ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవాదాయశాఖ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. “సైరా నరసింహారెడ్డి” చిత్రం తరువాత ఏంటో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన కలిగే చెడు ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్ర అసలు కథ. ఇందులో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఒక ఉద్యోగిగా మెగాస్టార్ ఒదిగిపోనున్నారు. ఈ చిత్రానిలో కథానాయికగా త్రిష నటిస్తుంది. మరో భామ రెజీనా ఒక ఐటెం సాంగ్ చేస్తుందట. అంతేకాదు “జాను” అక్కినేని సమంత కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తోందని, దీనికోసం కొరటాల శివ ఇప్పటికే సమంతని సంప్రదించారని సమాచారం. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నడని తెలుస్తోంది.
అయితే తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో కధానాయకుడిగా మోహన్ లాల్ నటించారు. ఈ సినిమాలోని మోహన్ లాల్ పాత్రలో మన మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారట. ఈ రీమేక్ స్క్రిప్టు కి సంబంధించిన పనులు అన్ని డైరెక్టర్ సుకుమార్ కు అప్పగించారట. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ సంబందించిన పనులు సుకుమార్ పూర్తిచేసారని తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మాత్రమే సుకుమార్ చూస్తారట. డైరెక్షన్ మాత్రం వేరే డైరెక్టర్ కి ఇస్తారని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు.. ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడట సుకుమార్. తాజాగా సుకుమార్ లూసిఫర్ సినిమా రీమేక్ కోసం మెగాస్టార్ చిరంజీవికి హెల్ప్ చేసాడట. మలయాళంలో మోహన్ లాల్ కధానాయకుడిగా నటించిన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్నే అందుకుంది. మలయాళంలో ఈ చిత్రానికి పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకత్వం వచించారు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా మలయాళంలో రికార్టు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.




























