గత కొంత కాలంగా యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కి దూరంగా ఉంటున్నారని… దానికి కారణం వాళ్ళిద్దరు శాశ్వతంగా విడిపోవడమేనని ఎన్నో రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయినా ఎప్పుడూ చాలా అన్యోన్యంగా, చూడచక్కగా కనిపించే వీళ్లిద్దరూ కలిసే ఉన్నారని అందరూ భావించారు. ఓ నెల క్రితం సుమ కనకాల ఒక ప్రోగ్రాములో తన భర్త రాజీవ్ కనకాల మీద సెటైర్లు కూడా వేశారు. దాంతో సుమ కనకాల రాజీవ్ కనకాల మధ్య వివాహ బంధం దృఢంగానే ఉందని అందరూ నమ్మేశారు.

వాస్తవానికి యాంకరింగ్ రంగంలో సుమ లాంటి పద్ధతి గల యాంకర్ ను ఎవరు చూసి ఉండరు. తాను ఏ ప్రోగ్రాం లో యాంకర్ గా చేసినా అసభ్యకరంగా అస్సలు మాట్లాడరు, అసభ్యకర బాడీ లాంగ్వేజ్ ని అనుసరించారు. అందుకే తెలుగు ప్రేక్షకులందరికీ సాంప్రదాయకంగా ఉండే ఆమె అంటే ఎంతో ఇష్టం. బడా స్టార్ హీరోయిన్ల కంటే సుమ గురించే ప్రతి ఒక్కరికి తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇక అసలు విషయానికి వస్తే.. గత నాలుగేళ్ల గా సుమ, రాజీవ్ కనకాల మధ్య అసలు మాటలే లేవట. అందుకే వారిద్దరు ఒకరికొకరు సపరేటుగా ఉంటున్నారు. సుమ కొనుగోలు చేసిన మణికొండ ఇంటిలో రాజీవ్ కనకాల నివసిస్తుండగా సుమ వేరొక ఇంటిలో ఉంటున్నారు. సుమ రాజీవ్ కనకాలకి దూరంగా ఉంటున్నప్పటికీ… తన అత్తమామలకు కోడలి లాగానే బాధ్యతలు నిర్వర్తిస్తూ వారు బతికున్నంత వరకు ఎన్నో సేవలు చేసింది. రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి చనిపోతే… సుమ అన్నీ తానై ఉత్తర క్రియలు కూడా జరిపించింది.

కానీ తన భర్తకు ఆమెకు మధ్య ప్రస్తుతం ఏ బంధం లేదని తెలియడం అందరినీ విస్తుపోయేలా చేస్తుంది. ఏది ఏమైనా టీవీ, సినిమా, మోడలింగ్ రంగాలలో అడుగుపెట్టిన వివాహితలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం. విడాకులు అయినప్పటికీ ఎవరి దారి వారు చూసుకొని తమ జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తూనే ఉంటారు. ‘సుమ అక్కగా’ అందరి మనసులో స్థానాన్ని సంపాదించుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో భర్తకు దూరమయ్యేంత గొడవ ఏమి జరిగి ఉంటుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయాయి అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. నిజానికి పెళ్లికాకముందు సినిమాలో నటించిన సుమ పెళ్లయిన తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు. తన భర్త రాజీవ్ కనకాలను ఏ సందర్భంలోనూ నొప్పించకుండా బుల్లితెర రంగంలో కూడా చాలా పద్ధతిగా నడుచుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో స్టార్ యాంకర్ సుమ కనకాల తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోయిందనే రూమర్ షికార్లు చేస్తున్నప్పటికీ ఈ రూమర్ పై సుమ కానీ.. రాజీవ్ కనకాల గానీ ఎప్పుడూ స్పందించింది లేదు. దాంతో చాలా మంది ఈ రూమర్ నిజమేననుకున్నారు.

ఈ నేపథ్యంలో ఒక్క ప్రోమోతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేసారు సుమ, రాజీవ్ ల జంట. లేటెస్ట్ గా “క్యాష్” ప్రోగ్రామ్‌కు అతిథిగా రాజీవ్ కనకాల వచ్చాడు. అందులో సుమతో ఈయన కెమిస్ట్రీ, రొమాన్స్ చూసిన తర్వాత ఇద్దరూ విడిపోయారు అంటూ నమ్మడం కూడా సాధ్యం కాదేమో..? అంతగా ఒకరికొకరు సందడి చేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే గతంతో పోలిస్తే ఇప్పుడే వీళ్ల మధ్య అన్యోన్యత ఇంకా బలంగా ఉందేమో అన్నట్లుగా సుమ, రాజీవ్ లు ఆనందంగా ఉన్నారు. ఇద్దరూ కలిసి డాన్సులు చేసారు.. పాటలు కూడా పాడుకున్నారు.. ఎమోషనల్ అయ్యారు.. కామెడీ చేసారు.. ఒక్కటేంటి ఈ ప్రోమో చూసిన తర్వాత “క్యాష్” ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా టిఆర్పీ రేటింగ్ పెరగడం ఖాయం అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఇద్దరూ రెచ్చిపోయారంతే..! పైగా ఈ ఎపిసోడ్‌కు రాజీవ్, సుమకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిన సమీర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్రలు కూడా ఈ షోకి గెస్ట్ లుగా వచ్చి వాళ్లు కూడా తమదైన శైలిలో కామెడీ అద్భుతంగా పండించారు. “క్యాష్” ప్రోగ్రామ్ ప్రోమో చివర్లో రాజీవ్‌ను పట్టుకుని సుమ ఏడవడం.. భర్త ఓదార్చడం ఆ ప్రోగ్రామ్ కి హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఈ ప్రోమో చూసిన తర్వాత సుమ, రాజీవ్ మధ్య ఏమీ మనస్పర్థలు లేవనే విషయం అర్థమైపోయింది. ఒక్క ప్రోమోతో అన్ని అనుమానాలు పటాపంచలైపోయాయంతే.



























