Suma Kanakala : తెలుగు బుల్లితెర అభిమానులకు సుమ కనకాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బుల్లితెర మీద ప్రోగ్రాములే కాదు ఏ సినిమా ఫంక్షన్ అయినా సుమనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ తెలుగు టాప్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతోంది. ఒకవైపు యాంకరింగ్ తోపాటు అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఇటీవల సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ అభిమానులకు ఎప్పుడూ చేరువలో ఉంటుంది.

సుమ ఇండస్ట్రీకి దూరం అవుతోందా…
ఎప్పుడూ ఒక వైపు ప్రోగ్రాములు మరోవైపు సినిమా ఫంక్షన్లతో బిజీ గా ఉండే సుమ ఈ మధ్య జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లకు దూరంగా ఉంది. ఈ వారంలో మూడు సినిమాలకు సంబందించిన ప్రీరిలీజ్ ఈవెంట్లు జరిగితే ఒకదానిలో కూడా సుమ లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ కారణంగానే కొన్ని రోజులుగా సుమ ఇండస్ట్రీకి దూరంగా ఉంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సుమ ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి కారణం మాత్రం సోషల్ మీడియాలో తన గురించి వెతికితే తెలుస్తుంది అని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే సుమ కొన్ని రోజులు విరామం తీసుకుని కుటుంబంతో పాటు మాల్దీవులలో వెకేషన్ కి వెళ్లినట్టు సమాచారం. అయితే సుమ మాత్రం అక్కడ కూడా ఎంజాయ్ చేయకుండా వెకేషన్ ను కెమెరాతో షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయాలని ఆలోచనలో కష్టపడుతోందట.



































