ఇండస్ట్రీ లో సెలబ్రెటీలు అందరూ కాస్ట్ లీ కారులు, సొంత ఇల్లు తో తమ హోదాను చూపిస్తున్నారు. సెలబ్రెటీలు ఒకొక్కరు సొంత ఇంటి వారు అవుతున్నారు. మొన్ననే హీరోయిన్ రష్మిక మందన్న ఇల్లు కొనుగోలు చేయగా… అల్లు అర్జున్ తన కొత్త ఇంటి నిర్మాణ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇదే బాటలో మరో సినీ జంట చేరింది.

సిటీలో అద్దె ఇంట్లో ఉండటం అంటే మాములు విషయం కాదు. దాని కన్నా హౌస్ లోన్ పెట్టుకొని ఇల్లు కొనుకొవ్వడం మంచిదని చాలా మంది అభిప్రాయం. ఇంతకు ముందు ఇంటి వాడు అవుతున్నారు అంటే పెళ్లి చేసుకున్నాడు అనే వారు కానీ ఇప్పుడు ఇంటివాడు అంటే సొంత ఇంటివాడు అవుతున్నాడు అని అర్ధం. అందరికీ సొంత ఇల్లు అనేది ఒక కల. దాని కోసం రాత్రి పగలు కష్టపడతారు.

ఇప్పుడు సొంత ఇల్లు ఎవరు కొన్నారా అని అనుకుంటున్నారా.. అదేనండీ… మన రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతులు ఒక ఇంటి వారయ్యారు. వారిద్దరూ కొద్ది రోజుల ముందే ఇంటిని తీసుకున్నట్టు సమాచారం. ఈ అత్యంత ఖరీదైన ఇంటికోసం కొన్ని కోట్లు పెట్టారని వినికిడి. అయితే రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల మరణించడంతో అది కాస్తా వాయిదా పడింది. ఇంట్లో వారు ఎవరైనా చనిపోయినపుడు కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి ఇన్ని రోజులు ఆ ఇంటికి సంబంధించిన మిగతా పనులను చేస్తూ వచ్చారట.

తమకు నచ్చినట్టుగా వాస్తు కూడా చూసుకుని భారీగా వెచ్చించి ఇల్లు తీసుకున్నారట. ఇక ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలో గృహప్రవేశం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సుమ షోస్, ఈవెంట్స్ తో చాలా బిజీ గా గడుపుతూ ఉంటే, రాజీవ్ కనకాల నటుడి గా తనదైన శైలిలో తగ్గ పాత్రలు చేస్తూ మెప్పిస్తు ఉన్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు తమ కల నెరవేర్చుకున్నారు.



























