సుమ, రాజీవ్ కనకాల దంపతులను మరణాలు 3 సంత్సరలుగా ఎంతో బాధకి గురిచేస్తున్నాయి. వరస మరణాలతో సుమా, రాజీవ్ కనకాల కుటుంబం ఎంతో ద్రిగ్బంతి చెందుతుంది. 2018వ సంవత్సరంలో రాజీవ్ కనకాల తల్లి అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.. 2019వ సంవత్సములో రాజీవ్ తండ్రి దేవదాసు కనకాల కూడా మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో ఉండగా మరోసారి మూడు రోజుల క్రిందట రాజీవ్ సోదరి శ్రీ లక్ష్మి కనకాల క్యాన్సర్ కారణగా మరణించడం జరిగింది. అయితే ఈ వరుస మరణాలతో సుమా, రాజీవ్ కనకాల కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది.

ఇది ఇలా ఉండగా సుమ దంపతులు ఎంతో కష్టపడి సొంత ఇంటిని నిర్మించుకున్నారు, సొంత ఇంటిలోకి వెళ్లాలని 2019లోనే అనుకున్నారు ఆ ఆలోచనలో ఉండగా దేవదాసు కనకాల మరణించారు. అయన మరణం తరువాత సొంత ఇంటి లో గృహప్రవేశం ఆగి పోయింది. అనుకున్న సమయంలో గృహప్రవేశం జరగకపోవడంతో ఆ ఇంట్లో ఇంకా కొన్ని ఉన్న పనులను పూర్తి చేసుకొని ఇంటిలోకి వెళ్ళడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట సుమ దంపతులు.. కాని మొన్న ఆడపడుచు చనిపోవడంతో మళ్లీ వాయిదా పడింది.

ఇలా వరస మరణాల వల్ల కొత్త ఇంటి వాస్తు విషయంలో కొందరు సందేహం వ్యక్తం చేయడంతో కొత్త ఇంటికి ఏమైనా వాస్తు ఇబ్బందులు ఉన్నాయా అనే అనుమానంతో పండితులకు చూపించగా, ఆ మూడు మరణాలు కూడా ఆకస్మికంగా జరిగినవి కాదు అని, రాజీవ్ తల్లి తండ్రులు వయస్సు పైబడి మరణించారు.. ఇక సోదరి శ్రీలక్ష్మి గత 2 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ మరణాలకు, ఇంటి వాస్తుకు ఎటువంటి సంబంధం లేదని పండితులు చెప్పడం జరిగింది అని సమాచారం.



























