Suma Rajeev Kanakala : తెలుగు బుల్లి తెర పై తిరుగులేని యాంకర్ ఎవరంటే సుమ అని టక్కున చెప్పొచ్చు. తన సమయం స్ఫూర్తితో, కామెడీ టైమింగ్ తో ప్రతి కార్యక్రమంలో సందడి చేస్తుంటుంది. ఇక సుమ సినిమాల్లోను నటించింది. హీరోయిన్ గా కూడా ఒక చిత్రంలో నటించింది. ఇక రాజీవ్ కనకాల తో వివాహం తర్వాత బుల్లితెర కు పరిమితమయ్యారు.

ఇక రాజీవ్ కనకాల మొదట్లో బుల్లితెర పై నటించినా ఆ తర్వాత సినిమాల్లో నెగెటివ్ పత్రాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసారు. చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు.రాజీవ్ కనకాల తల్లితండ్రులు కూడా నటులే. ఇక ఎంతోమందిని నటీనటులుగా వారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేశారు.
సుమ రాజీవ్ ల తనయుడి సినిమా ఆరంగేట్రం…..
రాజీవ్ కనకాల కుటుంబం మొత్తం సినిమా పరిశ్రమలో ఉన్నారు. ఇక రాజీవ్ చెల్లెలు కూడా బుల్లితెరా పై నటించారు. ఇక ఇపుడు సుమ రాజీవ్ ల తనయుడు కూడా సినిమాల్లో హీరో గా రానించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు సుమ తనయుడు రోషన్ మీడియా కు కనిపించింది చాలా అరుదు కానీ డాన్సులు, నటన పై శిక్షణ తీసుకుని సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు.
ఇక రోషన్ కోసం ప్రశాంత్ వర్మ ఒక మంచి కథను సిద్ధం చేశారట. విరించి వర్మ డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుందట.మజ్ను,ఉయ్యాలా జంపాల సినిమాలతో పేరు తెచ్చుకున్న విరించి తో రోషన్ చేయబోతున్నాడు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని టాక్.
































