“సుమ కనకాల” ఈ పేరు తెలియని బుల్లితెర మరియు సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై ఆమె క్రేజ్ మమోలుగా ఉండదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.. కరోనా సమయంలోనూ యాంకర్ సుమ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లు, అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు.

అయితే ప్రస్తుతం దేశంలో ఒక వైపు కరోనా దాడి చేస్తుంటే.. మరోవైపు రోజుకో రకమైన ఫంగస్ వ్యాధి భయపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా వార్తలు, థర్డ్ వేవ్, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ నిత్యం మీడియాలో వార్తలు రావడం, వాటిని చూసి జనాలు భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.
మరికొన్ని చోట్ల కరోనా సోకిందేమో అనే భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కరోనా బయంతో గుండె ఆగిన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటిపై పరోక్షంగా స్పందించారు సుమ కనకాల. “సై” సినిమాలోని రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ ను అచ్చుగుద్దినట్టు దింపేస్తూ ఒక వీడియో షేర్ చేసారు. ఆ సినిమాలో నితిన్ అండ్ టీం మ్యాచ్ లో ఓడిపోస్తున్న సమయంలో వారిలో స్పూర్తిని నింపేందుకు కోచ్ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్ మరోసారి ఆమె మాటలతో వినిపించారు యాంకర్ సుమ. ధైర్యంగా ఉండండి. చనిపోతమనే భయం మనసులో ఉంటే మనలో ఇమ్యునిటీ తగ్గిపోతుంది. అందుకే భయపడకుండా ఉండాలంటే మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూడకండి అంటూ సలహా ఇచ్చారు.



























