సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎవరి బంధువో, ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసా.?!

0
3841

1992లో తమిళంలో భాగ్యరాజా దర్శకత్వంలో సుందరకాండము అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అక్కడ ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని కె.వి.వి.సత్యనారాయణ తెలుగులో సుందరకాండ సినిమా నిర్మించాడు. అయితే 1992 లో వచ్చిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా వెంకటేష్ అపర్ణ, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు.

అప్పటి వరకు విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా లాంటి మాస్ ఇమేజ్ ఉన్న సినిమా చేశాడు. ఈ సినిమాలో ఒక కాలేజీలో లెక్చరర్ గా సాఫ్ట్ క్యారెక్టర్ లో కనబడడం బాగుండదని వెంకటేష్ శ్రేయోభిలాషులు చెప్పారు. అలాగే మీనా సుందరకాండ సినిమా సెకండాఫ్ లో కనిపిస్తారు. మీన శ్రేయోభిలాషులు కూడా ఈ సినిమాలో నటించడం ఎందుకు అన్నారు. ఆ మాటలు ఏవి లెక్కచేయకుండా ఆ ఇద్దరూ ఈ సినిమాలో నటించారు.

 

తమిళంలో భాగ్యరాజాని వెంటపడే విద్యార్థిగా సింధుజ నటించగా తెలుగులో మాత్రం వెంకటేష్ ని ఆటపట్టించే హీరోయిన్ గా ఈ సినిమా నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ మేనకోడలు అయినటువంటి అపర్ణ నటించడం జరిగింది. సుందరకాండ 1992 అక్టోబరు 2న విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత దాసరి దర్శకత్వంలో అపర్ణ అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో నటించింది. 2002లో వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here