Sunny leone : ఒకప్పటి నీలి చిత్రాల తార నేటి బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. కెనడాలో పుట్టి అమెరికా లో పెరిగి ఒక పోర్న్ స్టార్ గా, నగ్న ఫోటోలను మ్యాగజైన్స్ మీద కవర్ ఫోటో గా వచ్చిన నటి ఇండియా కు ఎలా వచ్చింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది. పోర్న్ వైపు నుండి సినిమాల వైపు వచ్చిన సన్నీ కెరీర్ పరంగా చాలా మందికి నచ్చక పోయినా రియల్ లైఫ్ లో మాత్రం ఆమె చేస్తున్న సేవకు ఫిదా అవ్వాల్సిందే. మహారాష్ట్రలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామానికి అన్ని వసతులను అందిస్తోంది. అలాగే కాన్సర్ తో బాధపడుతున్నవారి కోసం మారతాన్ అలాగే పెట్స్ రక్షణ కోసం పనిచేస్తోంది. అలాగే పెటా సభ్యురాలిగా కూడా కొనసాగుతున్న సన్నీ బాలీవుడ్ ఎంట్రీ గురించి తన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం.

మోడల్ గా పోర్న్ స్టార్ గా…
సన్నీ లియోన్ అసలు పేరు కరంజిత్ కౌర్ వోహరా. ఆమె ఇండియా సంతతికి చెందిన సిక్కు కుటుంబానికి చెందిన ఆమె. అయితే సన్నీ పుట్టింది కెనడాలో అయితే ఆమెను క్యాథలిక్ గా తల్లిదండ్రులు స్కూల్ చేర్పించేటపుడు రిజిస్టర్ చేయించారు. ఇక గ్రాండ్ పేరెంట్స్ కోసం క్యాలిఫోర్నియా కు సన్నీ కుటుంబం వెళ్లారు. ఇక అక్కడే చదువుకున్న సన్నీ నర్సింగ్ కోర్స్ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసే సమయంలో మోడల్ కావాలని ఆశపడేది. అదే సమయంలో నగ్నంగా నృత్యం చేసే ఒక మహిళ పరిచయం అవడం ఆమెతో మాట్లాడక అలాంటివి ప్రొఫెషన్ అని తెలుసుకున్న సన్నీ అటువైపు అడుగులేసింది. ఆమె ద్వారా పరిచయమైన ఒక ఏజెంట్ ద్వారా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ మీద మొదటి సారి నగ్నంగా ఫోజులిచ్చింది. ఆమె పేరును వర్క్ కోసం సన్నీ లియోన్ గా మార్చుకుంది. ఇక అతని ద్వారా వివిడ్ అనే కంపెనీ కి చెందిన వ్యక్తి పరిచయం అవడం అక్కడ పోర్న్ సినిమాలను చేయడానికి కాంట్రాక్టు రాసుకోవడంతో సన్నీ కెరీర్ మలుపు తిరిగింది.

సినిమాలకు ఆస్కార్ లాంటి గొప్ప అవార్డు పోర్న్ సినిమాలను చేసినందుకు ఫీల్డ్ లో సన్నీకి వరించింది. ఇక అలా పోర్న్ సినిమాలను చేస్తూనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే రైట్స్ తీసుకుంది సన్నీ. ఆ తరువాత తన పేరుతో వెబ్సైటు పెట్టగా ఆ వెబ్ సైట్ కి ఇండియా నుండే 80 % ఆదాయం వచ్చేదట. అలా ఇండియన్ రియాలిటీ షో బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిన సన్నీ అక్కడి నుండి బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంది. మొదట్లో ‘జిస్మ్’ సినిమా చేసి మళ్ళీ అమెరికా వెళ్లిన సన్నీ తరువాత ఇండియాలో తనకొస్తున్న ఆఫర్స్ క్రేజ్ చూసి పోర్న్ సినిమాలు చేయడం తన జీవితం కాదని డిసైడ్ అయి రిటైర్మెంట్ ప్రకటించి ఇండియా వచ్చేసింది. ఇక ఇక్కడ హిందీ, తెలుగు, మరాఠి, తమిళం ఇలా పలు భాషల్లో నటించడంతో పాటు ఇండియా మొత్తం భాషతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకుంది. ఆమె బయోగ్రఫీ సినిమాగా తీయగా అందులో సన్నీ నటించింది. ఆ సినిమా విడుదల సమయంలో పోర్న్ సినిమాలు చేయాలనే తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల తన తల్లిదండ్రులు బాధపడ్డారని, ఆ బాధతోనే మరణించారని సన్నీ ఎమోషనల్ అయింది. ఇక సన్నీ, డేనియల్ వెబర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొదట ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఆ అమ్మాయికి నిషా సింగ్ వెబర్ అని పేరు పెట్టారు. ఇక మళ్ళీ సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలు యాషర్ సింగ్ వెబర్, నోఆ సింగ్ వెబర్.