KGF music director past job : కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాతో ఒక్కసారిగా ఆ సినిమా లో నటీనటులు, టెక్నీషియన్స్ బాగా ఫేమస్ అయ్యారు. ఇక సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అసలైన పాన్ ఇండియా సినిమాగా కేజీఎఫ్ చరిత్ర సృష్టించింది. ఇక ఈ సినిమాతో కన్నడ సినిమాలకు పరిమితమైన యష్ ఇండియా మొత్తం క్రేజీ సూపర్ స్టార్ అయ్యాడు.

తండ్రితో కలిసి పని…
ఇక కేజీఎఫ్ చాప్టర్ 1కంటే మరింత విజయాన్ని అందుకుంది కేజీఎఫ్ చాప్టర్ 2. భారీ క్రేజ్, మరియు అంచనాల నడుమ విడుదలయ్యాక సినిమా ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతకు తెర తీస్తూ కేజీఎఫ్ 2 ప్రేక్షకులను ఆకట్టుకుంది. యష్ యాక్టింగ్, సినిమాను ప్రశాంత్ తీసిన విధానం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కు హైలైట్. ఇక సినిమా మొత్తం ఒక రేసు గుర్రంలా పరిగెడుతూ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది .

ఇక సినిమాలో బీజీఎమ్ విషయానికి వస్తే కేజీఎఫ్ రెండు పార్టులకు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు రవి బస్సుర్. ఇపుడు అందరి దృష్టి రవి బస్సుర్ పై పడింది ఇక టాలీవుడ్ లో అయితే థమన్ కి బీజీఎమ్ అందించడంలో పోటీ వచ్చేసాడని అంటున్నారు.రవి బస్సుర్ సొంతూరు కర్ణాటక లోని ఉడిపి సమీపంలోని కుందాపూర్. ఇక రవి బస్సుర్ కి చెందిన ఒక ఫోటో వైరల్ అవడంతో ఈయన పై ప్రేక్షకులు మరింత ఆరాలు తీస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో సొంతూరు వెళ్లిపోయారు రవి. ఇక తండ్రికి సహాయంగా దేవుళ్ళకు ఆభరణాలు తయారు చేసే పని చేసేవారట. ఇక ఈ పనికి రోజుకు 35 రూపాయలు సంపాదించేవారు రవి. ఇపుడు ఆ పనికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల్లో మ్యూజిక్ కి కోట్లు సంపాదిస్తూ కూడా తండ్రికి ఇలా 35రూపాయల కోసం కష్టపడటం నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది.



























