పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గతకొంత కాలంగా జరుగుతున్నా ఆందోళనలు జరుగుతున్నాయి.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.. దీనిపై 200 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం నుంచి జరిగిన ఈ హిసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు.

తాజగా సూపర్ స్టార్ రాజనీకాంత్ కూడా ఈ విషయంపై తీవ్రంగా మండి పడ్డారు. ఢిల్లీ అల్లర్లకు కేంద్ర వైఖరే కారణం అని మండిపడ్డారు. తాను బీజేపీ మద్దతు దారుని కాదని.. బీజేపీ ని వెనకేసుకువచ్చే ఆలోచనలు తనకు లేవని చెప్పారు. సీఏఏ వల్ల ముస్లింలకు నష్టం జరిగితే వారికీ తోడుగా ఉండి తాను పోరాడతానని స్పష్టం చేసారు రజనీకాంత్.

ఈ అల్లర్ల విషయంలో కేంద్ర నిఘా సంస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ విషయంపై కేంద్ర భాద్యత వహించి, ఘర్షణలను అరికట్టాలని రజనీకాంత్ అన్నారు. ఢిల్లీలో ఆందోళనలను అదుపుచేయాలని ఒక వేళ అలా అదుపుచేయలేనపుడు… ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మంచిదని ఎద్దేవ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. కులం, మతం పేరుతొ జరుగుతున్న ఈ రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని రజనీకాంత్ పేర్కొన్నారు.


































