Super Star Family : సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. మహేష్ బాబు కి అత్యంత ప్రీతి పాత్రమైన వారి అమ్మ గారు ఇందిరా దేవి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవి ఈరోజు ఉదయం మరణించారు. ఇందిరా దేవి గారి మరణం మహేష్ బాబు ని తీవ్ర విషాదంలో ముంచివేసింది. ఈరోజు ఇందిరా దేవి గారి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. వరుస మరణాలతో సూపర్ స్టార్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

మహేష్ బాబుని ఓదార్చడం కష్టమే…
మూడేళ్ళ వ్యవదిలోనే సూపర్ స్టార్ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈరోజు ఉదయం కృష్ణ భార్య, మహేష్ బాబు అమ్మ గారు ఇందిరాదేవి మరణించగా.. 2019 జూన్ 27 న కృష్ణ రెండవ భార్య అయిన విజయ నిర్మల గారు గుండె నొప్పితో మరణించడం జరిగింది. భార్యగా, తోటి నటిగా, స్నేహితురాలిగా ఇలా అన్ని విషయాల్లోను తనతో ఉన్న విజయ నిర్మల గారి మరణం కృష్ణ ను కలచివేసింది. విజయ నిర్మల గారిని రెండవ వివాహం చేసుకున్నా ఇద్దరు భార్యలతోనూ సన్నిహితంగా ఉన్నారు కృష్ణ.

Deeply saddened by the passing away of Indira Devi Garu. Deepest condolences to Krishna garu, Mahesh anna and family in this time of grief.
— Jr NTR (@tarak9999) September 28, 2022
శ్రీ కృష్ణ గారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5BOY6XCHA6
— JanaSena Party (@JanaSenaParty) September 28, 2022
సూపర్ స్టార్ కుటుంబంలో అంతులేని విషాదం అంటే మహేష్ బాబు అన్నరమేష్ బాబు గారు మరణించడం. ఈ ఏడాది ప్రారంభంలో రమేష్ బాబు గారు అకాల మరణం పొందారు. కొన్నాళ్ళుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతు రమేష్ బాబు గారు చికిత్స పొందుతూ మరణించారు. చిన్న వయస్సులోనే రమేష్ బాబు చనిపోవడం కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహేష్ బాబు ని తీవ్రంగా కృంగదీసింది. రమేష్ బాబు కూడా హీరోగా పలు చిత్రాలలో నటించారు. కృష్ణ, మహేష్ బాబు, రమేష్ బాబు కలసి కూడా నటించారు. అయితే ఈ వరుస విషాదాలతో మహేష్ కుటుంబం కోలుకోవడం కష్టమే. పలువురు సినీ ప్రముఖులు ఇందిరా దేవి గారి మరణం పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



























