Super Star Krishna: జీవితంలో ఎవరికైనా వాళ్ళను ఎంతో ప్రేమించిన వాళ్ళను వదిలి ఉండలేరు. ప్రేమించిన వాళ్ళను శాశ్వతంగా వదిలి ఉండాల్సి వస్తే మాత్రం వారి జ్ఞాపకాలను పదిల పరుచుకుని జీవిస్తుంటారు. అలానే సూపర్ స్టార్ కృష్ణ కూడా విజయ నిర్మల గారి జ్ఞాపకాల్లో జీవిస్తున్నారు. విజయ నిర్మల గారు మరణించాక బయటికి రావడం కూడా బాగా తగ్గించారు. ఇంట్లోనే ఆమె జ్ఞాపకాల్లో ఉంటున్నారు.

విజయ నిర్మల కాంస్య విగ్రహం…
ఇక కృష్ణ గారికి భార్య విజయ నిర్మల మీద ఎంత ప్రేమ ఉందో ఆయన హోమ్ టూర్ వీడియోలో తెలిసింది. కృష్ణ గారి కూతురు మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కృష్ణ గారి ఇల్లు చూపించారు. ఇందులో కృష్ణ గారి ఇంట్లో అందరినీ ఆకట్టుకున్న విషయం విజయ నిర్మల గారి కాంస్య విగ్రహం. ఇది చూసాక అందరికీ అర్థమైన విషయం కృష్ణ గారికి విజయ నిర్మలా గారి మీద ఉన్న ప్రేమ. ఇక ఇంట్లో ఆమెకు సంబంధించిన అవార్డులు, ఫోటోలను జాగ్రత్తగా భద్రపరిచారు.

ఇక విజయ నిర్మల గారు సింగల్ గా ఉన్న ఫోటోను సేకరించాలని కృష్ణ గారు ఎంత అనుకున్నా అన్ని ఫోటోల్లోనూ ఇద్దరు కలిసే ఉన్నారట. ఈ ఒక్క విషయంతో కృష్ణ విజయ నిర్మల గారి బంధం అర్థమవుతుంది. బతికున్నంత వరకూ కృష్ణ గారితోనే ఉన్నారు విజయ నిర్మల. ఇక విజయ నిర్మల కొడుకు నరేష్ తన తల్లి బంగారు పాదాలకు పూజ చేస్తారనే విషయం తెలిసిందే.



























