ఓకే సంవత్సరం 18 చిత్రాల్లో నటించడం పెద్ద గొప్పేమీ కాదని అనుకోవచ్చు. కానీ అవి చేసింది సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కాదు. ఒక హీరోగా 18 చిత్రాల్లో అలనాటి స్టార్ హీరో నటించారు. హీరోగా సంవత్సరానికి ఒక చిత్రంలో నటిస్తున్న ఈ రోజుల్లో ఒకే సంవత్సరంలో ఏకంగా 18 చిత్రాల్లో హీరోగా నటించడం మామూలు విషయం కాదు. అలా నటించడం కేవలం సూపర్ స్టార్ కృష్ణ కే చెల్లింది.

నెలకు ఒక చిత్రంలో నటించిన కూడా 12 నెలలకు కేవలం 12 చిత్రాలు విడుదలవుతాయి. కానీ 18 చిత్రాల్లో నటించడం ఆషామాషీ కాదు. ఆ రోజుల్లో అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువగా లేకపోవడం, మద్రాసులో వాహిని, జెమినీ స్టూడియోస్ మాత్రమే ఉండడం… ఆ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల షూటింగ్ మొత్తం కూడా అక్కడే జరిగేవి. అనేక చిత్రాలు షూటింగ్ జరుపుకోవాలంటే షిఫ్టుల్లో పని చేయడమే దానికి ఏకైక మార్గం. అలా నాలుగు షిఫ్టుల్లో నాలుగు రకాలైన సినిమా షూటింగ్ లు జరిగేవి. అందుకే వాహిని స్టూడియో ఎప్పుడు షూటింగులతో కళకళలాడుతూ ఉండేది. ఈ సంవత్సరంలో హీరో కృష్ణ దాదాపు నాలుగు షిఫ్టుల్లో పనిచేసేవారు. అలా చేయడం వలన ఈ 18 రకాల చిత్రాల్లో ఆయన నటించగలిగారు.

ఇకపోతే ఆయన నటించిన ఆ 18 చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం… 1.మొనగాడొస్తున్నాడు జాగ్రత్త 2.రాజమహల్ 3.అంతా మనమంచికే 4.మా ఊరి మొనగాళ్ళు 5.గూడుపుఠాని 6.హంతకులు దేవాంతకులు 7.కోడలు పిల్ల 8.మేనకోడలు 9.భలే మోసగాడు 10.పండంటి కాపురం 11.నిజం నిరూపిస్తా 12.ఇన్స్పెక్టర్ భార్య 13.అబ్బాయిగారు అమ్మాయిగారు 14.మా ఇంటి వెలుగు 15.ప్రజా నాయకుడు 16మరపురాని తల్లి 17.ఇల్లు ఇల్లాలు 18.కత్తుల రత్తయ్య…

ఈ 18 చిత్రాల్లో నటించడం అందరి హీరోలతో అయ్యేపని కాదు. ఒక్కోసారి సూపర్ స్టార్ కృష్ణ షాట్ గ్యాప్ లో విశ్రాంతి తీసుకునే వారు. అలా ఓ కునుకు తీయగానే షాట్ రెడీ అంటూ కో-డైరెక్టర్ పిలవడంతో వెళ్లి ఆయన నటించేవారు. ఒక విధంగా చెప్పాలంటే 1972 సంవత్సరంలో ఆయన తీరికలేని జీవితాన్ని గడిపారు.ఒక్కోసారి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. కొన్ని సందర్భాల్లో మొహమాటానికి వెళ్లి కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ ఒక్కోసారి నెలలో ఆయన చిత్రాలు ఆయనకు పోటీగా విడుదలయ్యేవి.

అది తన సినీ కెరీర్ కి బాగుండదని భావించి ఆ తర్వాత ఎక్కువ చిత్రాలు చేయకుండా బ్యాలెన్స్ గా చిత్రాలు చేస్తూ వచ్చారు. కానీ ఒకే సంవత్సరంలో హీరోగా 18 చిత్రాల్లో నటించడం అనే రికార్డును ఇంతవరకూ ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. ఇక భవిష్యత్తులో కూడా ఎవరు బ్రేక్ చేయబోరు. ఈ రికార్డు కేవలం సూపర్ స్టార్ కృష్ణకి చరిత్రలో లిఖించబడి ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.


































