మనకు తెలిసిన విధంగా ప్రపంచ కుబేరులు అయినా బిల్ గేట్స్, వారెన్ బఫెట్, మార్క్ జుకన్ బర్గ్ ప్రపంచంలో పేద వారి కోసం అనేక మార్గాలలో సేవలు అందిస్తున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వారు స్థాపించిన సేవ కంపెనీల ద్వారా పేదవారికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే వీరంతా కుబేరులు కాబట్టి మనకు వారి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే మన భారతదేశంలో వీరి అందరికీ మించిన ఒక డబ్బు లేని కుబేరుడు ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా..? తమిళనాడులోనే తిరునల్వేలికి చెందిన కల్యాణ సుందరం. ఈయన చేసిన సేవలను గుర్తించి అమెరికా దేశం 2013లో ” ద మ్యాన్ ఆఫ్ ది మిలీనియం ” అనే సత్కారం తో ఆయనను గుర్తించింది. ప్రపంచంలో ఇంత మంది పేదలకు సేవ చేస్తున్న ఏరికోరి కళ్యాణ సుందరాన్ని ఎంపిక చేసింది అంటే ఆయన చేసిన సేవలు మీరు కూడా తెలుసుకోవాలి.

ఈ కల్యాణ సుందరం గారు ఓ కాలేజీలో మామూలు చిన్న లైబ్రేరియన్. ఆయన ప్రతి నెల సంపాదించిన జీవితం మొత్తం తన జిల్లా అయిన తూతుకూడి లో ఉండే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన సంపాదన మొత్తాన్ని పేదలకు అందించే విధంగా కలెక్టర్ కి అందజేసేవారు. ఇలా ఆయన తన జీవితాన్ని తను పనిచేసిన మొత్తం 35 సంవత్సరాలు అందించారంటే ఆయన గొప్ప మనుసుని ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఆయన తన పదవీ కాలం ముగిసిన తర్వాత కాలేజీ వారు తనకు ఇచ్చిన పది లక్షల రూపాయలు కూడా తమిళనాడులోని పేరుగాంచిన సేవ కార్యక్రమాల అందించే ఎన్జీవోస్ కి సమానంగా పంచాడు. దీనికి కారణం ఎన్జీవోస్ చేసే మంచి పనులలో తన హస్తం కూడా ఉండాలని భావించి అలా చేయడం జరిగింది.

ఇలా ఆయన సేవలు అందిస్తున్న సమయంలోనే ఆయన మదిలో వచ్చిన ఆలోచనే పాలెం ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా ఆయన విరాళాలు సేకరించి అందరినీ కలుపుకొని ఆ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ఈ ఫౌండేషన్ ముందుంది పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇక ఇలాంటి సేవలను గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఆయనను ఎలాగైనా సత్కారించాలని 2013 సంవత్సరంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నేపథ్యంలో ఆయనను ” మ్యాన్ ఆఫ్ ది మిలీనియం ” గౌరవించడం జరిగింది. ఈ సందర్భంగా బరక్ ఒబామా కళ్యాణ సుందరం ను కలుసుకున్నప్పుడు ఆయన నిజంగా ఇలాంటి వారిని కలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేశారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సుందరం ని ఓ ప్రశ్న అడిగారు. నీకు ఈ సేవ చేయడానికి స్ఫూర్తి ఎవరు అని అడగగా, ఆయన టక్కున నా తల్లిగారు అని సమాధానం ఇచ్చారు. నా తల్లి చెప్పిన మూడు సూత్రాలను నేను ఇప్పటికీ పాటిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న అని చెప్పడంతో బరాక్ ఒబామా నిజంగా కంటతడి పెట్టుకున్నారు.

ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆయన విషయాన్ని తెలుసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కల్యాణ సుందరం దగ్గరికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనతో… నేను మిమ్మల్ని తండ్రిగా దత్తత తీసుకుంటా అని అనడంతో కల్యాణ సుందరం కొద్దిగా ఆలోచించి సరే అని చెప్పారు. అంత వరకు బాగానే ఉన్నా, దత్తత తీసుకున్న తర్వాత కల్యాణ సుందరం గారిని ఓ భవంతిలో ఉండడానికి పిలుచుకు వెళ్లారు. అక్కడ కేవలం మూడు నాలుగు రోజులు గడిచిన తర్వాత ఆయనకు రాజభోగాలు రుచించక సొంత ఊరికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయే ముందు రజనీ కాంత్ గారికి నేను ఇక్కడ రాజా భోగాలు అనుభవించడమే ఇష్టం లేదని మీరు నన్ను ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే నా దగ్గరికి రమ్మని చెప్పి తను వెళ్ళిపోయాడు. తన స్వగ్రామం వెళ్ళిన తర్వాత ఆయన నిజంగా తన నిస్వార్ధ పూర్వకంగా ఓ హోటల్లో సర్వర్ గా చేరి తన సంపాదన మళ్లీ సేవా కార్యక్రమాలకు ఉపయోగించేవారు. ఇలాంటి వ్యక్తి నిజంగా భారత దేశానికి ఎంతో గర్వించదగ్గ మనిషి.



























