శివాజీరావు గైక్వాడ్.. ఈ పేరు చెబితే చాలామంది గుర్తుపట్టలేరు. అదే రజనీకాంత్ అని చెప్పండి భారతదేశంలో ప్రతి సినీ ప్రేమికుడు ఇట్లే గుర్తుపట్టేస్తారు. అది ఆయనకు ఉన్న పాపులారిటీ. డిసెంబర్ 12, 1950న కర్ణాటక రాష్ట్రంలో ఆయన జన్మించారు. కర్ణాటక లో కొంతకాలం నివసించిన తర్వాత, సినిమాల్లోకి వచ్చాక ఆయన ఎక్కువగా చెన్నై నగరంలోనే ఉండడం ఆ తర్వాత పూర్తిగా చెన్నై నగరంలోనే స్థిరపడిపోయాడు. ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ప్రజాదరణ పొంది ఉన్నాడు. అందరి జీవితాల్లో అలాగే ఆయన జీవితంలో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. నిజానికి ఆ విషయం చాలా మందికి తెలియదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రజనీకాంత్ సినిమాల్లోకి రాకముందు కర్ణాటకలో సిటీ బస్సు కండక్టర్ గా పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన బెంగళూరు నగరంలో సిటీ బస్సు లో కండక్టర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆయనకు లవ్ స్టోరీ ఉంది. అదేంటంటే.. రజినీకాంత్ కండక్టర్ గా ఉన్న సమయంలో ఓ రోజు డాక్టర్ చదువుతున్న నిర్మల అనే యువతి తాను హడావిడిగా బస్సు ఎక్కడం ఆయన గమనించారు.. అలా ఎక్కిన ఆవిడ రోజు అదే సమయానికి అదే స్టాప్ లో ఎక్కుతుండడంతో ఆవిడతో పరిచయం ఏర్పడి చివరికి అది ప్రేమగా మారింది. రజినీకాంత్ కండక్టర్ ఉద్యోగం చేస్తుండగా డ్యూటీ దిగిన తర్వాత వారిద్దరు సిటీలోని ఏదో పార్కులో కలుసుకునేవారు. అలా ఓ రోజు రజనీకాంత్ సాయంత్రం వేళ సినిమా థియేటర్ సంబంధించి టికెట్లు ఇచ్చి అక్కడికి రమ్మని తెలిపాడు. అక్కడికి వెళ్లగా ఓ నాటకం మొదలైంది. ఆ నాటకంలో హీరోగా రజనీకాంత్ నటించడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ నాటకంలో హీరోగా రజనీకాంత్ నటనను మైమరపించారు. నాటకం ముగిసింది.

తెల్లవారుజామున ఇద్దరు కలుసుకున్నారు. అక్కడ అ రజనీకాంత్ తో నిర్మల నువ్వు నాటకాలు వేస్తావా..? అడిగింది. దానికి రజనీకాంత్ ఏం నచ్చలేదా అని ప్రశ్నించగా.. బాగుంది చాలా బాగుంది అంటూ సమాధానం ఇచ్చింది. అలా రోజులు గడుస్తున్నా సమయంలో ఓ రోజు ఓ పార్కులో భేటీ అయిన తర్వాత రజినీకాంత్ తన ప్రేమికురాలితో తనకి చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి లెటర్ వచ్చిందని అక్కడ ఓ తేదీలో అక్కడ జాయిన్ అవ్వాలని అందులో ఉందని తెలిపాడు. తను అప్లై చేయని కోర్సుకు ఇలా రిప్లై రావడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. దానికి సమాధానంగా రజినీకాంత్ వివరాలు నీ పేరుతో నేనే అప్లికేషన్ పెట్టాను అని, నీకు ముందుగా చెబితే నువ్వు వద్దంటావు అని నేను నీ పర్మిషన్ లేకుండా పంపించాను అని తెలిపింది. దీంతో రజనీకాంత్ ఆవిడ కళ్ళల్లోకి చూడగా నిర్మల నవ్వింది. ఆ తర్వాత ఈ బెంగళూరు నగరంలో కేవలం నాటకాలు వేసుకుని జీవనం కొనసాగించడం కాకుండా ఓ టార్గెట్ పెట్టుకొని నీ ఫ్యాషన్ అదే అయితే అందులోనే కెరియర్ లోనే బతుకు అంటూ ప్రోత్సహించింది. దాంతో రజనీకాంత్ తన ప్రియురాలితో లేదు వీలు కాదు. అంత స్థోమత ఉంటే నేను ఎందుకు ఇలా సిటీ బస్సు కు కండక్టర్ గా పని చేస్తానని చెప్పి వెళ్లడానికి తనకు ఇష్టం లేదని తెలిపాడు.

దానికి నిర్మల జీవితమంతా కండక్టర్ గానే ఉంటావా మహా అయితే ఒక బస్సు కొంటావు, అదేనా నీ టార్గెట్ అంటూ నువ్వు వెళ్ళు అని చేతిలో డబ్బులు పెట్టింది. దాంతో రజనీకాంత్ తనకు ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాలని ఆశగా ఉన్న ఒక వైపు ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆవిడ రజినీకాంత్ చెన్నై నగరానికి పంపించడానికి ఆర్థికంగా సహాయం చేసింది. ఇందులో భాగంగానే రజనీకాంత్ నిర్మలతో హీరో అంటే కండలు ఉండాలి.. అలాగే ఆరడుగులు ఉండాలి.. దానితో పాటు మంచి తెలుపు వర్ణంలో ఉండాలి అని చెప్పగా.. ఆవిడ ఎవరు చెప్పారు అలాంటిది అంటూ ఏమీ ఉండదు కంటెంట్ ఉన్నోనికి అక్కడ అవకాశం ఉంటుందని ప్రోత్సహించి ఆయనను దగ్గరుండి చెన్నై నగరాన్ని వెళ్లడానికి దోహదం చేసింది. దీంతో ఆయన చెన్నై నగరానికి చేరుకొని అందరి హీరోల అలాగే ముందర అనేక కష్టాలు పడి చివరికి సినిమాలను సాధించి క్రమేపీ హీరోగా ఎదుగుతున్నాడు. ఈయన హీరోగా బిజీ అవుతున్న సమయంలో ఆయన పిడుగురాళ్ల దగ్గర నుంచి రావడం ఆగిపోయాయి. అలా ఆ తర్వాత బెంగళూరు నగరానికి వెళ్ళి ఆవిడ ఉన్న ఇంటి దగ్గర వెళ్లి అడగగా వాళ్ళు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని ఆయనకు సమాధానం దొరికింది. అలా ఆయన బెంగళూరు నగరంలో ఎంతో శ్రమపడి ఎన్ని చోట్ల వెతికినా కూడా ఆవిడ ఆచూకీ లభించలేదు. అలా రజనీకాంత్ జీవితంలో లవ్ స్టోరీ అలా మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here