టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మన సీనియర్ హీరో వెంకటేష్.. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నారప్ప.. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత అనీల్ రావిపూడి దర్శత్వంలో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు వెంకీ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. వీటితోపాటు మలయాళం లో మంచి విజయం సాధించిన దృశ్యం సినిమాను రీమేక్ చేస్తున్నారు వెంకీ.

ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 2 సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించారు. ఇక తెలుగులో వెంకటేష్ కు జోడీగా మీననే అంటిస్తున్నారు. కాగా దృశ్యం 2 సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసారు చిత్రయూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా . అయితే ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందట.ఆద్యంత ఆసక్తికరంగా సాగేలా తెరకెక్కించాడట దర్శకుడు జీతుజోసెఫ్. అయితే పార్ట్ 2 లో పోలీసులు వెంకటేష్ ను పట్టుకోవడానికి వేసే ప్లాన్ లు ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తుంది.

పోలీసులు వేసే ఎత్తుల నుంచి వెంకీ ఎలా తప్పించ్చుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉండబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…ఇక మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్2 సినిమా సీక్వెల్ ఎఫ్3 ని కూడా లైన్ లో పెట్టాడు ఈ సీనియర్ హీరో..వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. ఇప్పటికే ప్రధాన భాగానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది..ఇక వెంకీ ,వరుణ్ ల సరసన తమన్నా, మెహరీన్ కథానాయిలుగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు27 న విడుదల కానుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here