ప్రస్తుతం సౌత్ లో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ సేతుపతి.. కేవలం తమిళంలోనే కాదు తెలుగు లో కూడా విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. స్టేటస్ తో సంబంధం లేకుండా నచ్చిన పాత్రలో ఒదిగిపోయి మరీ నటిస్తున్నాడు.. ఇప్పుడు సౌత్ మొత్తం లో విజయ్ సేతుపతి టాప్ లో ఉన్నాడనే చెప్పాలి.. తన కెరీర్లో మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ హీరోల స్థాయికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. విజయ్ సేతుపతి కేవలం పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తనకి ఇంత పేరు మరియు స్టార్ డమ్ రావడం విశేషం.

అయన నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది విజయ్ సేతుపతి పాత్రలకు ఎంత విలువ ఇస్తారని. అయన తీసుకున్న పాత్రలకు పూర్తి న్యాయం చేయగల ఏకైక నటుడు విజయ్ సేతుపతి. అందుకే అతడు దర్శకుల నటుడని అంటారు. తమిళ్ లో తనకంటూ లక్షల్లో అభిమాన వర్గం ఉందంటే ఆయనేంటో అయన ప్రతిభ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు.ఇక విజయ్ సేతుపతి వ్యక్తిగత విషయానికి వస్తే, విజయ కుటుంబం చెన్నైలో నివాసముంటున్నారు. అయితే ఒక దర్శకుడు నీవు సినిమాలలోకి వస్తే గొప్పవాడివి అవుతావని అనడంతో దానిని పట్టుకొని విజయ్ సేతుపతి సినిమా అవకాశాల వెంట తిరగడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ‘ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’ అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి రంగ ప్రవేశం చేసాడు. ఇక అక్కడినుంచి సినిమా అవకాశాలు చేజిక్కించుకొని సినిమాలు చేసారు. ఆ తర్వాత హీరోగా మారారు. అటు తర్వాత ప్రతినాయక పాత్రలు చేస్తూ పేరు సంపాదిస్తున్నారు.
అయితే విజయ్ సేతుపతి సినిమాల్లోకి రాకముందే జెస్సి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. సరిగా నిచ్చితార్ధం రోజే ఇరువురు కలుసుకోవడం విశేషం. వీరి వివాహం 2003 లో జరిగింది. సినిమాల్లో అవకాశాలు రానప్పుడు తనకి తన భార్య అండగా నిలిచిందని విజయ్ సేతుపతి తెలిపారు.ఇప్పుడు వీరికి ఒక పాప,బాబు ఉన్నారు. విజయ్ సేతుపతి ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తమిళ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటూ సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు…!!



























