ప్రముఖ సినిమా నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ప్రపంచ వ్యాపతంగా అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ కు ఈ అవార్డు రావడంపై అయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ప్రస్తుతం అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.






























