గత కొన్నిరోజులుగా జగన్ సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నెలకొన్న పరిస్తితులు అందరికి తెలిసిందే… అయితే ఎన్నికలు ఇప్పట్లో వద్దని రాష్ట్ర ప్రభుత్వం.. ఎట్టి పరిస్తితుల్లోనూ జరిగి తీరాల్సిందే అన్నట్లుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరూ పంతాలకు పోయారు.

తాజాగా ఏపీ పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని సవాల్ చెస్తూ ఏపీ ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది సుప్రీం కోర్టు. ఇక ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని తేల్చిచెప్పింది జస్టిస్ కౌల్ ధర్మాసనం. దింతో పంచాయితీ ఎన్నికలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తుంది.





























