Surekha Vani : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను చేసి గుర్తింవు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. భద్ర, రెడీ, బొమ్మరిల్లు వంటి సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. బిజీ ఆర్టిస్ట్ గా చేతి నిండా సినిమాలతో ఉన్న సురేఖ ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో కూతురు సుప్రీతతో కలిసి రీల్స్ చేస్తూ, సందడి చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక సుప్రీతను కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ఇపుడు ప్రయత్నిస్తోంది. ఇక సుప్రీత కూడా గ్లామర్ డోస్ పెంచేసి నెట్టింట్లో ఫోటో షూట్లతో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

సురేఖ ఆస్తుల విలువ…
సురేఖ వాణి భర్త మరణించాక కూతురు సుప్రీతను అన్ని తానై సురేఖ చూసుకుంటోంది. ఇక సినిమాల్లో చేస్తూనే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది. ఇక సురేఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సమయంలో ఒక్కో సినిమాకు పది లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకునేదట. అంతేకాకుండా పాత్ర నిడివిణి బట్టి రెమ్యూనరేషన్ తీసుకునేదట సురేఖ. అలా ఒక పది కోట్ల ఆస్తులు పోగేసిందని వినికిడి. ఇక కూతురుని హీరోయిన్ గా లాంచ్ చేయాలని బాగా ప్రయత్నిస్తున్న సురేఖ, ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించడానికి తెలుగు ఉచ్చారణ స్పష్టంగా ఉండడం కోసం తెలుగు టీచర్ తో పాఠాలు కూడా చెప్పిస్తోందట. ఇక సుప్రీత అప్పుడే ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇక తల్లికూతుళ్లు ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇటీవలే నిఖిల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వీళ్లిద్దరూ బాయ్ ఫ్రెండ్ టాపిక్ రాగా సుప్రీత నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటే సురేఖ కూడా నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి ఆది కూడా మంచి ఫిజిక్ ఉండాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.



























