బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే ప్రసారం కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయటానికి నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోగోని కూడా విడుదల చేశారు.

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రసారం కాబోతుందనే వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ ల ఇంటర్వ్యూలు కూడా జరిగాయని, సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ కొందరు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లిస్టులో యాంకర్లు, యూట్యూబర్ లు, బుల్లితెర నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ లిస్టులో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా ఉన్నట్లు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై నటి సురేఖ వాణి స్పందిస్తూ అసలు విషయం తెలిపారు. తాను బిగ్ బాస్ షో కి వెళ్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు.
ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ తెలిపింది.నేను ఎలాంటి కార్యక్రమాలకు వెళ్లడం లేదని దయచేసి ఈ విధమైనటువంటి తప్పుడు పోస్టులు రాయకండి అంటూ పోస్ట్ పెట్టిన ఈమె పెట్టిన కొద్దిసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు. ఈ విధంగా పోస్ట్ డిలీట్ చేయడంతో ఈమె బిగ్ బాస్ లోకి వెళ్లనుందా… లేదా అనే విషయంపై మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఐదవ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.



























