Suriya: సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తమిళ హీరో అయినప్పటికీ ఈయనకు మాత్రం తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సూర్య నటించే ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదలవుతాయి. ఇక్కడ కూడా అదే స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇలా ఒక కోలీవుడ్ నటుడికి ఈ స్థాయిలో ఆదరణ ఉండటం ఎంతో విశేషం.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాని తెలుగులో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాని థియేటర్లలో ప్రేక్షకులు చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. 2008వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైన సంగతి మనకు తెలిసిందే.
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూర్య సిమ్రాన్ సమీరా రెడ్డి ప్రధాన పాత్రలలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతున్నటువంటి ఈ సినిమాను చూస్తూ ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేయడం చూసి సూర్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Suriya: మీ ప్రేమ నన్ను ఆశ్చర్యపరిచింది..
థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఈ ప్రేమ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ టీం నుంచి స్పెషల్ థ్యాంక్స్. సినిమాని ఎంజాయ్ చేయడంలో మీరు బెస్ట్ అని ట్వీట్ చేశారు.ఇలా తెలుగు అభిమానులను ఉద్దేశించి సూర్య చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
This love is a huge surprise!!!
A big thank you from team #SuriyaSonOfKrishnan
Awestruck – you guys are the best!! ❤️ pic.twitter.com/N2zrxpmKrp— Suriya Sivakumar (@Suriya_offl) August 5, 2023