బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ బలవాన్మరణం సంఘటన ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే సుశాంత్ మరణించడానికి ముందే అంటే సరిగ్గా వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ కూడా బలవాన్మరణనికి పాల్పడడం.. ఈ 2 సంఘటనలూ ఒకేవిధంగా జరగడంతో ఎవరో వీళ్శిద్దరినీ వారం రోజుల గ్యాప్ లో కావాలనే ప్లాన్ చేసి ఇలా చిత్రీకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ కేసు దర్యాప్తులో భాగంగా CBI అధికారులు రంగంలోకి దిగడంతో ఈ 2 కేసులు రోజుకో సరిక్రొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సాలియన్ మరణం పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

పోలీసులు వీళ్ళిద్దరి కేసు విషయంలో పలు కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే దిశ సాలియన్‌ని ఎవరో కావాలనే చేసారని కొందరు తమ ఆరోపిస్తుండగా.. అవన్నీ ఒట్టి రూమర్స్ అని దిశ తల్లిదండ్రులు ఖండించారు. జూన్ 9 రాత్రి ముంబైలోని మలద్ ప్రాంతంలో దిశ ప్రియుడు రోహాన్ ఇంట్లో జరిగిన పార్టీలో అసలేం జరిగింది.? అనే అంశం ఇప్పుడు మిస్టరీగా మారింది. దిశా చనిపోయే ముందు తన ప్రియుడు రోహాన్‌తో పాటు కొందరు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. ఇందుకు నిదర్శనంగా ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
#DishaSalian last video of 8th june, akhir hua kya? , this video shows she is happy and on 8th June she commits suicide. What is the investigators hiding? #DishaSalian #SushantCoverup pic.twitter.com/OPoAp9AzjC
— Sid (@imsid_vasu) August 8, 2020
ఈ వీడియోలో దిశ .. హృతిక్ రోషన్ నటించిన ‘మిషన్ కశ్మీర్’ చిత్రంలోని రిండ్ పొష్మల్ పాటకి ఆనందంగాగా స్టెప్పులేయడం కనబడుతుంది. మీడియా సమాచారం ప్రకారం ఈ వీడియోని దిశ తన ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయగా, తాజాగా ఆ వాట్సప్ వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోను బట్టి చూస్తే సంతోషంగా ఉన్న దిశ తనకు తానుగా ప్రాణం తీసుకోవడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతూ, దిశ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారట.

ఊహకందని బాలీవుడ్ టాప్ సీక్రెట్స్ లలో వీళ్ళిద్దరి మరణం ఒక మిస్టరీగా మిగిలిపోకముందే ఈ కేసులోని చీకటి రహస్యాలను ఎలాగైనా ఛేధించాలన్న పట్టుదలతో సుశాంత్ కేసు దర్యాప్తులో స్పీడ్ ను పెంచారు CBI అధికారులు. తెర వెనక ఏం జరిగిందనేది ఎవరికి సరిగ్గా తెలియదు కానీ, మంచి భవిష్యత్తు ఉన్న 2 నిండు ప్రాణాలు మాత్రం బాలీవుడ్ కుట్రలకు బలైపోయాయన్నమాట వాస్తవం.



























