బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు దర్యాప్తులో ముంబయి పోలీసులు తమ స్పీడ్ ను పెంచారు. ఇప్పటికే సుశాంత్ మరణించి 40 రోజులు పూర్తైనా కూడా ఈ కేసును మాత్రం అంత ఈజీగా పోలీసులు వదలడం లేదు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కొంతకాలం నుండి చాలా క్లోజ్‌గా ఉన్నాడు.

ఈ అంశం కూడా కూడా సుశాంత్ మరణానికి కారణం అయ్యుండొచ్చు అని తాజాగా మహేష్ భట్ కు సమన్లు పంపించారు ముంబయి పోలీసులు. మహేశ్ భట్ వాంగ్మూలాన్ని మరో 2 రోజుల్లో తీసుకోబోతున్నారని, ఆయనతో పాటు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ సొంత నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ CEO అపూర్వ మెహతాను కూడా ఎంక్వయిరీకి పిలిచినట్లు, అవసరమైతే కరణ్ జోహార్ ను కూడా విచారిస్తామని, అలాగే సుశాంత్ మరణంపై సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్కూ సమన్లు జారీ చేసినట్లు లేటెస్ట్ గా మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలియజేశారు. కంగనా ప్రస్తుతం హోమ్ టౌన్ మలాలిలో ఉన్నానని, అక్కడికొచ్చి స్టేట్మెంట్ రికార్డు చేసుకోవచ్చని తెలిపినట్లుగా సమాచారం. సుశాంత్ సింగ్ బలవాన్మరణం చేసుకున్న సంఘటనని సీరియస్‌గా తీసుకున్న కంగనా రనౌత్.. కేవలం నెపోటిజం వల్లే తాను చనిపోయాడని, కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ వంటివాళ్ళే సుశాంత్ మరణానికి కారణమని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

సుశాంత్ అర్ధాంతరంగా తనువు చాలించడానికి సినిమా రంగంలో వృత్తి పరంగా అతనికి ఎదురైన సంఘటనలే కారణమని పెద్ద ఎత్తున రూమర్స్ క్రియేట్ అవుతున్న క్రమంలో.. సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్‌లో కూడా కొందరు రాజకీయ నేతలు ఇదే మాట అంటున్నారు. వీటి ఆధారంగా కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే ఇప్పటివరకూ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్ రాజీవ్ మసంద్ వంటి ప్రముఖులతో సహా 37 మందిని ఎంక్వయిరీ చేశారు



























