సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క మనో వేదన వర్ణానాతీతం !!

0
239

విశ్వాసానికి ప్రతిరూపం కుక్కేనని పెద్దలు ఎందుకన్నారో కానీ ఈ రోజుల్లో మనుషుల కంటే జంతువులే ఎక్కువ ప్రేమ చూపిస్తాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం బాలీవుడ్ ధోనీ సుశాంత్ పెంపుడు కుక్కని చూస్తే అర్ధమౌతుంది. తమను ప్రేమించేవాళ్ళు దూరమైతే అవి పడే మనో వేదన ఎలా వుంటుందో సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క ఫుడ్జ్ ను చూసి తెలుసుకోవచ్చు.

ఈ అరుదైన జాతి కుక్కను సుశాంత్ కొన్నేళ్లుగా పెంచుకుంటున్నాడు. దానిని ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. అయితే ఈమధ్యనే సుశాంత్ కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే.! కానీ రోజూ సుశాంత్ తో ఆడుకునే పుడ్జ్ ఇప్పుడు సుశాంత్ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ సిబ్బంది పోస్ట్ చేస్తున్న ఫుడ్జ్ వీడియోలు చూస్తున్న నెటిజన్లకు కన్నీరు ఆగడం లేదు. ఏ తలుపు చప్పుడైనా కూడా సుశాంత్ వచ్చాడేమోనని ఆశగా పరిగెడుతుంది. కానీ సుశాంత్ కనిపించక పోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుశాంత్ గది బయట అలాగే నేలపై పడుకుంటుంది. సుశాంత్ మరణం తరువాత కూడా అతడి కోసమే వేచి చూస్తూ అలాగే మౌనంగా రోదిస్తుంది ఫుడ్జ్. తిండి తినకుండా, నీళ్లు తాగకుండా పాపం..

యజమాని రాక కోసం ఈ మూగ జీవి పడుతున్న నరకయాతన దేవుడికే తెలుసు. దాన్ని మళ్లీ సాధారణ స్ధితికి తీసుకు రావాలని సుశాంత్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా అసాధ్యమనే నిరూపిస్తుంది ఈ శునకం.. ఇలాగే మరి కొద్ది రోజులు ఈ శునకం ఉంటే అది కూడా తన యజమాని దగ్గరికి వెళ్లి పోతుందేమో అని భయపడుతున్నారు సిబ్బంది. ఏదేమైనా ఈ పెంపుడు కుక్క బాధను చూస్తే ఎవ్వరైనా చలించాల్సిందే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here