Sushanth Singh Rajput : సుశాంత్ ఎంతో టాలెంట్ ఉన్న నటుడు, డిప్రెషన్ లో మరణించాడు, కారణం అందరికీ తెలుసు. అవకాశాలు వచ్చి ఇక మంచి కెరీర్ ఉండబోతోంది అనే సమయంలో ఒక్కో సినిమా చేజరిపోయింది దీనికి కారణం కూడా అందరికీ తెలుసు. నెపోటిజం నిజానికి అన్ని సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది. స్వతహాగా కొంతమంది తారలు తమని తాము నిరూపించుకుని సూపర్ స్టార్లు అవుతున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం కాస్త భిన్నంగా ఉంది. నెపో కిడ్స్ మాత్రమే సినిమాల్లో ఉన్నారు బయటి వారు స్టార్ గా ఎదగాలంటే ఎన్నో అడ్డంకులను దాటుకోవాలి, కేవలం ప్రతిభ ఒక్కటే స్టార్ ని చేయదు.

సుశాంత్ మరణం బాలీవుడ్ ను మార్చేసిందా…
ఏదేమైనా ఒక టాలెంటెడ్ హీరోని ఇండస్ట్రీ బలి తీసుకుంది. సుశాంత్ మరణించిన సమయంలో బాయ్ కాట్ బాలీవుడ్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయింది దేశంలో. సుశాంత్ బ్రతికున్నపుడు ఎంత మంది అభిమానులు తనకు ఉన్నారో తెలుసో లేదో కానీ అయన మరణించాకే ఇండస్ట్రీ కి ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలిసింది. ఇప్పటికీ ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉందంటే ఇప్పటికి సుశాంత్ మరణాన్ని మరచిపోలేని అభిమానుల గురించి చెబుతోంది. సుశాంత్ మరణించినపుడు ఒక్క బాలీవుడ్ హీరో కూడా నోరు మెదపలేదు.

ఆ పాపమే శాపమైందని విశ్లేషణ మొదలయింది. బాలీవుడ్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరనే విషయం అర్థమైపోయింది అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధ’ సినిమాతో. ఇంతకుముందు అమీర్ ఖాన్ సినిమా అంటే వసూళ్లు రికార్డులో ఉండేవి అలాంటిది ఇపుడు వసూళ్లు చతికిల పడిపోయాయి. బాలీవుడ్ లో పెరిగి పోయిన నెపోటిజం, హిందూ వ్యతిరేకత ధోరణి, దేశానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్స్ ఇవన్నీ సినిమాలను జనాలు బాయ్ కాట్ చేసేందుకు కారణాలు. ఒక్క అమీర్ ఖాన్ సినిమాలే కాదు అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ సినిమా కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలా సినిమాలను బాయ్ కాట్ చేసేంత కోపం బాలీవుడ్ సినిమాలపై జనాలకు కలగడానికి బాలీవుడ్ హీరోలు చేస్తున్న కామెంట్స్, హిందూ వ్యతిరేక అంశాలను ప్రోత్సాహించడం. సుశాంత్ మరణానికి బాలీవుడ్ ఇండస్ట్రీ తగిన మూల్యం చెల్లించకతప్పదేమో.


































