కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఐసోలేషన్ నుంచి తప్పించుకున్నాడు. అధికారులకు దొరక్కుండా తప్పిచుకునేందుకు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అతడు మృతి చెందాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

హర్యానాలోని పాణిపట్టు జిల్లా నూర్పూర్ గ్రామంలో ఒక వ్యక్తికీ కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతన్ని ఏప్రిల్ 1వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నల్ లోని కల్పనచావ్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డులో అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అతడు ఐసోలేషన్ నుంచి తప్పించుకోవాలని భావించాడు. అనుకున్నదే తరువుగా పారిపోయేందుకు మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. ఆ హాస్పిటల్ బిల్డింగ్ 6వ అంతస్తు నుంచి ఒక తాడు సాయంతో కిందికి దిగి తప్పించుకుని పారిపోదాం అని భావించాడు. అనుకున్నట్టుగానే తాడును సంపాదించి అక్కడినుంచి దిగడం మొదలు పెట్టాడు అయితే అలా దిగే ప్రయత్నంలోనే దురదృష్టవశాత్తు మధ్యలోనే అతడు జారీ కింద పడిపోయాడు. దీనితో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతని మరణాంతరం నిర్వహించిన కరోనా పరీక్షలలో అతడికి నెగెటివ్ వచ్చింది. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.




























