Swara Bhaskar: ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలు చేసుకోవడం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఒకరినొకరు ప్రేమించుకుని వివాహాలు చేసుకుంటున్నారు. ప్రేమకు కులమత బేధాలు ప్రాంతాలు వంటి భేదాలు ఏమీ ఉండవు. అందువల్ల ఇతర దేశాలకు చెందిన వారితో కూడా ప్రేమలో పడి పెళ్లిలో చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందిన స్వరా భాస్కర్ కూడా ఒక రాజకీయ నాయకుడు అని ప్రేమించే వివాహం చేసుకుంది.

ప్రస్తుతం ఈమె వివాహం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సమాజ్ వాది పార్టీకి చెందిన ఫాహద్ జిరార్ అహ్మద్‌ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రచారం సందర్భంగా ఫాహద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. మొదట్లో ఆమె ఫాహద్ జిరార్ అహ్మద్‌ను ‘అన్నయ్య’ అని పిలిచేది. ఆ తర్వాత ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకూ వెళ్ళింది.
ఇద్దరి మతాలు వేరే అయినా ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి ఒప్పుకోవటంతో పెళ్ళి చేసుకొని ఒక్కటయ్యారు. తాజాగా, వీరి పెళ్లికి సంబంధించిన వివరాలను స్వయంగా స్వరా భాస్కర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో ఆమె గురువారం రోజున ట్వీట్ చేస్తూ..మనం మన పక్కనే ఉన్న దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. మేము కూడా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాం. మా మధ్య మొదట స్నేహం మొదలైంది. తర్వాత అది ప్రేమగా మారింది.

Swara Bhaskar అన్నా అని పిలిచి పెళ్లి చేసుకుంటావా…
నా హృదయం ఫాహద్ జిరార్ అహ్మద్‌కు స్వాగతం పలుకుతోంది అంటూ ట్వీట్ చేస్తూ తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. నీతో కొందరు గతంలో ఆమె ఫాహద్ జిరార్ అహ్మద్‌ను అన్న అని సంభోదించిన సంగతిని గుర్తు చేస్తు ‘అన్న అని పిలిచి, అతడినే పెళ్లి చేసుకోవటానికి సిగ్గులేదా’ అంటూ ఫైర్ అవుతున్నారు.
Sometimes you search far & wide for something that was right next to you all along. We were looking for love, but we found friendship first. And then we found each other!
Welcome to my heart @FahadZirarAhmad It’s chaotic but it’s yours! ♥️✨???? pic.twitter.com/GHh26GODbm— Swara Bhasker (@ReallySwara) February 16, 2023





























