Swathi Reddy : సికింద్రాబాద్ నుండి వైజాగ్ వెళ్తున్న దురంతో ఎక్సప్రెస్ లో వైజాగ్ వెళ్లాలనుకున్న ఒక నిండు గర్భవతికి ఉన్నట్లుండి పురిటి నొప్పులు వచ్చాయి. అర్థరాత్రి, అందులోనూ ట్రైన్ లో బిజీ కూడా కాదు, ఇక దగ్గర్లో ఏ స్టేషన్ లేదు, పైగా హాస్పిటల్స్ కూడా లేవు, ఇక ఆ గర్భవతి నొప్పులకు అరుస్తున్నా అక్కడ గాఢ నిద్రలో ఉన్న వారికి వినిపించలేదు. ఇక ఏంచేయాలో తెలియని స్థితి లో అంత ఒక మాయలాగా ఒక వ్యక్తి ఆమెకు పురుడు పోసి తల్లికి, బిడ్డకు ఏమి కాకుండా చేసింది. అంతా సినిమాలో జరిగే సన్నివేశం లాగా ఉన్నా నిజంగా జరిగింది. డాక్టర్ స్వాతి రెడ్డి ఆ గర్భవతి కి పురుడు పోసి ఆ తల్లికి పునర్జన్మ ఇచ్చింది.

బిడ్డ తల బయటికి వచ్చింది.. బయటికి తీయగానే కలర్ మారిపోయింది… ఒకవేళ ఏదైనా జరుగుండుంటే ఊహించలేను…
విజయవాడ లో వైజాగ్ వెళ్ళాడనికి బయలుదేరినా స్వాతి రెడ్డి గీతం యూనివర్సిటీ లో ఎమ్బిబిఎస్ 3 సంవత్సరం చదువుతోంది. ఇక వైజాగ్ వెళ్ళడానికి దురంతో ఎక్సప్రెస్ ఎక్కిన స్వాతి రెడ్డి ఒక గర్భవంతికి పురుడు పోసింది. రాత్రి 1:00 సమయంలో స్వాతి విజయవాడ నుండి బయలుదేరగా 3:30 ప్రాంతంలో ఆ గర్భవతికి నొప్పులు రావడం మొదలయ్యాయి. అయితే అందరూ గాఢ నిద్రలో ఉండటం వల్ల ఎవరికీ ఆమె అరుపులు పెద్దగా వినిపించలేది. ఆమె భర్త ఆడవాళ్లను అందరినీ సహాయం కోసం లేపాడు. అలా నన్ను లేపగా వెళ్లి చూస్తే అప్పటికే బేబీ తల కొంచెం బయటికి కనబడుతోంది. ఇక నాతో ఎపుడూ బేటాడిన్ వెంట తీసుకువెళ్తాను అలా చేతులు బేటాడిన్ తో క్లీన్ చేసుకుని ఆమెకు ఎటువంటి పరికరాలు లేకపోయినా డెలివరీ చేశాను. ఆది ఏసీ బోగి అవడం వల్ల పాప ను బయటకు తీయగానే చల్లగా ఉండటం వల్ల శరీరం రంగు మారిపోయింది కొంచెం భయపడ్డాను కానీ ట్రైన్ సిబ్బంది, అక్కడున్న ఇతర పాసింజెర్స్ సహాయంతో పాపను షీట్స్ తో చుట్టి వెచ్చగా ఉండేలా చేసాము. ఇక అనకాపల్లి స్టేషన్ లో ఇన్ఫోర్మ్ చేసి హాస్పిటల్ కి తరలించి, అక్కడ పాప తల్లి ఇద్దరూ సేఫ్ అనుకున్నాక నేను వైజాగ్ వెళ్ళాను అంటూ స్వాతి రెడ్డి చెప్పారు.

అంతా ఒక అద్భుతంలా జరిగిపోయిందని ఇంతవరకూ ఎప్పుడూ ఇంకా పురుడు పోయకపోయినా తెలిసిన కొంచెం నాలెడ్జ్ తో చేశాను. ఒకవేళ నెగెటివ్ గా ఏదైనా జరిగితే అనే భయం ఉన్నా వాళ్లిద్దరినీ ఎలాగైనా కాపాడాలని అనిపించింది. ఇక అక్కడున్న వాళ్ళు కూడా సమయానికి బాగా హెల్ప్ చేసారు అంతా దేవుడు సహకరించడం వల్లే జరిగింది అంటూ స్వాతి అభిప్రాయ పడింది. నెలలు నిండక ముందే ప్రసవం అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పాపకు ఉంటాయో అని బయపడినా అలాంటిదేమి జరగలేదు అంటూ చెప్పింది. చివరగా డాక్టర్ అవ్వడం తన తండ్రి కోరిక అని ఇక తాను ఈ పని చేసినందుకు తన తల్లి నిన్ను కన్నందుకు నా జీవితం సఫలమైందని అంటూ కన్నీళ్లు పెట్టుకుందని చెప్పింది.



























