Swetha Lakshmipathi : యాంకర్ గా అలాగే స్క్రిప్ట్ రైటర్ గా కమెడియన్ గా 70 కి పైగా సినిమాల్లో నటించిన లక్ష్మీపతి గారు చేసింది కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులు ఆయనని మర్చిపోలేరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెద్ద బాబు వంటి సినిమాల్లో అయన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆయన విలన్ గా చేసిన ఏకైక సినిమా ఆయన తమ్ముడు శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా బాబీ. ఇక చూడాలని ఉంది సినిమాతో కమెడియన్ గా తెలుగులో బ్రేక్ తెచ్చుకున్న లక్ష్మీపతి గారు 2008లో మరణించారు. అయన మరణం కంటే నెల రోజుల ముందు ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించారు. ఇక నెల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేక పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి గారి కూతురు శ్వేత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియపారు. తన తండ్రి బాబాయ్ తో ఉన్న అనుబంధాన్ని పుస్తకాల రూపంలో తెచ్చారు శ్వేత.

నెల వ్యవధిలో ఇద్దరి మరణం… అందరూ పడుకున్నాక ఏడ్చేదాన్ని…
లక్ష్మీపతి గారికి ఇద్దరు తమ్ముళ్లు, వారి సొంతూరులో రెండు థియేటర్లు ఉండేవి. అయితే ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే లక్ష్మీపతి గారి తమ్ముడు శోభన్ రైటర్ గా డైరెక్టర్ గా అవకాశాలను వెతుకుతూ మద్రాస్ వెళ్లారు. అలా కృష్ణ గారి సినిమా ‘రైతు భారతం’కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఇక అయన ‘బాబీ’ సినిమా దర్శకత్వం వహించడం, ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కొంత మళ్ళీ ఇబ్బందులను కుటుంబం ఎదుర్కోగా ఆ సమయానికి లక్ష్మీపతి గారు కమెడియన్ గా మంచి అవకాశాలతో ఉన్నారు. ఇక సడెన్ గా 2008 జనవరి 7 తేదీన శోభన్ గారు గుండెపోటుతో మరణించగా నెలరోజుల తరువాత అదే రోజున లక్ష్మీపతిగారు మరణించారు. ఆ సమయంలో అంత్యక్రియలకు డబ్బులను యాక్టర్ అజయ్ ఇచ్చారని విన్నాను అంటూ నాన్న తాగడం వల్లే మరణించారు అంటూ శ్వేత తెలిపారు. బాబాయ్ చనిపోయినపుడు బాధ మర్చిపోడానికి అంత్యక్రియల సమయంలో నాన్న తాగి రావడం నచ్చక తన తండ్రితో గొడవ పడ్డారట.

ఇక ఆ సమయంలో తన తండ్రి తనను పట్టుకుని ఏడ్చేశారట. అందరూ ఏడుస్తూ ఉన్నా తను ఏడ్చకుండా అలా ఉండిపోయానని అందరూ నిద్ర పోయాక రాత్రుల్లో ఏడ్చేదాన్ని అంటూ ఎమోషనల్ అయ్యారు శ్వేత. ఇక తండ్రి మరణించినపుడు తాను అధైర్యపడితే తన కన్నా చిన్నవాళ్ళైన తన తమ్ముడు, బాబాయ్ కొడుకులు భయపడతారని వాళ్ళ బాధ్యతను తాను తీసుకున్నారట శ్వేత. వైజాగ్ లో రేడియో జాకీ గా పనిచేసిన శ్వేత తన తండ్రి, బాబాయ్ ల మీద ఉన్న ప్రేమను పుస్తక రూపంలో అందరి ముందుకు తీసుకోచ్చారు. ప్రస్తుతం శోభన్ గారి అబ్బాయి సంతోష్ శోభన్ హీరో గా ‘ఏక్ మినీ కథ’ వంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు.

































