ఈ మధ్య సెలబ్రెటీ లపై అసభ్యకరంగా కామెంట్స్ చేయడం ఎక్కువ అయ్యింది. ఎంతో మంది నటులు ఇటువంటి కామెంట్స్ కి బాధ పడుతున్నా కొందరు వాటిని పట్టించుకోకుండా స్పందించడం లేదు. కానీ కొంత మంది చేసే అసభ్యకరమైన కామెంట్స్ వల్ల వాళ్ళు ఎంత బాధ పడతారో అని కనీస ఆలోచించకుడా లేకుండా కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ లో బాగా వైరల్ అవుతున్న వార్త యాంకర్ అనసూయ పై ట్విట్టర్లో అసభ్యకరంగా పెట్టిన కామెంట్స్. దానికి అనసూయ ట్విట్టర్ అధికారులకు ఫిర్యాదు చేయగా ట్విట్టర్ అధికారులు దానిలో ఏముంది అని పెద్దగా స్పందించక పోవడంతో, అనసూయ ఆగ్రహంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇపుడు నెట్టింట ఈ విషయం పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అనసూయ కూడా ఆ వల్గర్ కామెంట్స్ పెట్టిన వారి మీద మండి పడుతుంది. వారిపై కేసు నమోదు చేసి శిక్ష పడేవరకు వదలను అని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయంపై జర్నలిస్టు, బీజేపీ నాయకురాలు అయిన శ్వేతా రెడ్డి కూడా స్పందించారు. అనసూయ మీద బాడ్ కామెంట్స్ పెట్టిన నెటిజన్స్ ను సోషల్ మీడియా వేదికగా దుమ్ము దులిపేసింది.
శ్వేతా రెడ్డి జర్నలిస్టు గా చాలా మందికి పరిచయస్తురాలే… అంతే కాకుండా బిగ్ బాస్ -3 వ సిజన్ లో బిగ్ బాస్ నిర్వాహకులు తన పై అసభ్యంగా మాట్లాడారని ఆరోపణలు చేసి వార్తలలో నిలిచింది. అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు శ్వేతా రెడ్డి అనసూయకి అండగా నిలిచి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు, మీరెవరు అనడానికి, ఇపుడు సినిమాలో హీరోయిన్స్ కూడా అలానే చేస్తున్నారు వాళ్ళను ఎవరు అనడం లేదు మరి, ఇంకా సమంత కూడా అన్ని రకాల డ్రెస్ లు వేస్తుంది ఆమెను అనడం లేదు ఎందుకు అని ప్రశ్నించింది. నచ్చిన వారిని ఒకలాగ, నచ్చని వారిని ఒకలా కామెంట్స్ చేయడం మానుకోండి అని గట్టిగా వార్నింగ్ఇ చ్చింది శ్వేతా రెడ్డి. ఇక ఈ న్యూస్ ఇక్కడి వరకు వెళ్తుందో చూడాలి. అయితే ఈ మ్యాటర్ మధ్యలోకి సమంతని ఎందుకు లాగింది అని సమంత అభిమానులు, నెటిజన్లు శ్వేతా రెడ్డిపై మండి పడుతున్నారు.




























