Tag Archives: amala

Amala: నాగచైతన్య నేను పెంచలేదు..చైతూ అఖిల్ మాదిరి కాదు.. అమల కామెంట్స్ వైరల్!

Amala: అక్కినేని హీరో నాగార్జున భార్యగా సినీ నటిగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం నాగార్జున పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జునకు అమల రెండో భార్య. ఈయన మొదట దగ్గుబాటి లక్ష్మినీ పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య జన్మించిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

ఇలా లక్ష్మి విడాకులు ఇచ్చిన అనంతరం నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా అఖిల్ నాగచైతన్య ల గురించి అమల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి నేను నాగచైతన్యను పెంచలేదని నాగచైతన్య తన తల్లి వద్ద పెరిగాడని తెలిపారు.

ఇక టీనేజ్ వచ్చేవరకు నాగచైతన్య తన తల్లి వద్ద ఉన్నారని అనంతరం నాగార్జున వద్దకు రాగా ఆయన హీరోగా తనని ప్రేక్షకులకు పరిచయం చేశారని తెలిపారు. ఇక నాగచైతన్య అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవారని తనతో అఖిల్ చాలా చనువుగా ఉండేవారని తన రాక కోసం అఖిల్ ఎదురు చూస్తూ ఉండేవారని అమల తెలిపారు.

చైతు కోసం ఎదురు చూసేవాడు…

ఇప్పటికి వీరిద్దరి మధ్య అదే అనుబంధం ఉందని అమల తెలిపారు. నాగచైతన్యకు తనకు మధ్య బాండింగ్ లేకపోయినా అఖిల్ తో మాత్రం నాగచైతన్యకు మంచి బాండింగ్ ఉంది అంటూ ఈ సందర్భంగా అమల అఖిల్ నాగచైతన్య గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nagarjuna Amala: నాగార్జున అమల రెండో బిడ్డను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా.. ఇదే కారణమా?

Nagarjuna Amala: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున నటి అమల జోడి ఒకటని చెప్పాలి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ప్రేమలో పడటం అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది.

నాగార్జున అమలను రెండో వివాహంగా పెళ్లి చేసుకున్నప్పటికీ వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శంగా కూడా ఉన్నారని చెప్పాలి. ఇక నాగార్జున దంపతులకు అఖిల్ సంతానం అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ దంపతులకు అఖిల్ ఒకరే కొడుకు. అయితే వీరిద్దరూ మరొక సంతానం పూర్తిగా వద్దనుకున్నారని తెలుస్తుంది. ఇలా వద్దనుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని పలు సందర్భాలలో నాగార్జున తెలియజేశారు.

ఈ సందర్భంగా నాగార్జున సందర్భంగా మాట్లాడుతూ అఖిల్ కడుపులో ఉన్నప్పుడు తప్పకుండా తమకు అమ్మాయి పడుతుందని భావించాము కానీ అఖిల్ పుట్టారు అంటూ చెప్పుకొచ్చారు.అయితే తదుపరి అమ్మాయి అయితే బాగుంటుందని భావించగా అమలు మాత్రం తనకు మరో బిడ్డ వద్దని చెప్పారట నాకు ఒక్కడే కాదు ఇద్దరు కొడుకులు ఉన్నారు అందుకే మరో బిడ్డ నాకు వద్దు అంటూ ఈమె మరోసారి బిడ్డను కనడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది.

Nagarjuna Amala సంతోషపడిన నాగేశ్వరరావు….


ఇలా నాగచైతన్యను కూడా తన సొంత బిడ్డగా భావించిన అమల ఇప్పటికే తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని మరొక బిడ్డ అవసరం లేదు అంటూ రెండో బిడ్డ గురించి ఆలోచించడం లేదని అందుకే వీరిద్దరికి మరొక బిడ్డ జన్మించలేదనీ తెలుస్తుంది. ఇలా అమల తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నాగేశ్వరరావు ఎంతో సంతోషం వ్యక్తం చేశారట.

Nagarjuna -Amala: శ్రీవారి సన్నిధిలో నాగార్జున దంపతులు… కొడుకుల సినిమాల హిట్ కోసమే వచ్చామంటూ కామెంట్స్!

Nagarjuna -Amala: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమల, నాగార్జున ఇద్దరు కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం తరువాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన నాగార్జున, అమల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .ఇదిలా ఉండగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ… ఏడాది తర్వాత సతీసమేతంగా ఇలా శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా నాగార్జున తన కొడుకులు అక్కినేని అఖిల్ అక్కినేని నాగచైతన్య గురించి కూడా మాట్లాడుతూ..త్వరలోనే మా అబ్బాయిలు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారు. కేవలం కష్టం ఒక్కటే కాదని.. శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామివారి దర్శనార్థం వచ్చాము అని నాగార్జున తెలిపాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అలాగే మరొకవైపు అక్కినేని నాగచైతన్య కూడా ‘ కస్టడీ ‘ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

Nagarjuna -Amala: కష్టం ఒకటే కాదు శ్రీవారి ఆశీస్సులు కావాలి…

గతంలో విడుదలైన థాంక్యూ సినిమా నాగచైతన్యకు నిరాశ మిగిల్చింది. దీంతో ప్రస్తుతం కస్టడీ సినిమా మీద నాగచైతన్య ఆశలు పెట్టుకున్నాడు. ఇక అఖిల్ కూడా తాను నటించిన ఏజెంట్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా ‘ ది ఘోస్ట్ ‘ సినిమా ద్వారా నాగార్జునకి కూడా పరాజయం ఎదురయ్యింది. ఇక ప్రస్తుతం తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని సమాచారం.

Nagarjuna: ఆ క్షణం అఖిల్ వల్ల అమల చాలా ఇబ్బంది పడింది… నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna: అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కినేని నాగార్జున వారసుడిగా ‘ అఖిల్ ‘ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోలేదు. ఇక ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏప్రిల్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. వరంగల్‌లోని రంగలీలా మైదానంలో ఏజెంట్ ప్రీ రీలిజ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్‌‌గా వచ్చారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు.

ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ..” ‘అఖిల్‌ ఎనర్జీ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, తను వాళ్లమ్మ కడుపులో ఉండగానే.. తన ఎనర్జీ లెవల్స్‌ ఏంటో మాకు చూపించాడని తెలిపాడు. అఖిల్ కి 8 నెలల వయసు ఉన్నపుడే విపరీతమైన ఎనర్జీ ఉండేదని.. పడుకోకుండా ఎప్పుడూ పరుగెత్తుతూ ఉండేవాడు. దాంతో మేం కంగారు పడి.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే.. ఆయన అఖిల్‌ను సాయిల్ మీద పడుకోబెట్టమని సలహా ఇచ్చారు.

Nagarjuna: అఖిల్ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకి తీశారు…

అలా తనలోని ఎనర్జీని బయటకు లాగాలని డాక్టర్ సూచించారని నాగర్జున తెలిపాడు. ఈ సినిమాలో కూడా అఖిల్ ఎనర్జీని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అలానే బయటకు తీశారు అంటూ అఖిల్ ఎనర్జీ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇలా అఖిల్ గురించి నాగార్జున చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nagarjuna: వీధి కుక్కలను మీ ఇంటి ముందు ఉంచితే తెలుస్తుంది… నాగార్జునని ప్రశ్నించిన నేటిజన్.. ఏమైందంటే?

Nagarjuna: తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నాగార్జున గురించి పరిచయం అవసరం లేదు. అయితే నాగార్జున నటి అమలను ప్రేమించి తనని రెండవ వివాహం చేసుకున్నారు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అమల వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె మూగజీవాల పట్ల ఎలాంటి శ్రద్ధ చూపిస్తారో మనకు తెలిసిందే. బ్లూ క్రాస్ సమస్థ ద్వారా ఈమె మూగజీవాలను కాపాడుతూ వాటి సంరక్షణ చేపట్టారు.

ఇకపోతే గతంలో వీధి కుక్కలను చాలా దారుణంగా చంపుతున్న నేపథ్యంలో ఈమె కోర్టులో వేసిన పిటిషన్ వల్ల వీధి కుక్కలను మనుషులు చంపడానికి కూడా వీలు లేకుండా పోయింది.అయితే కొన్ని ప్రాంతాలలో ఈ వీధి కుక్కల కారణంగా చిన్నపిల్లలు సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి.

ఇలా ఒక వీధి కుక్క వల్ల ఇబ్బంది పడినటువంటి ఓ వ్యక్తి జిహెచ్ఎంసి అధికారులను సంప్రదించగా అక్కడ ఉన్నటువంటి అధికారులు అమల గారు వేసిన పిటిషన్ వల్ల వీధి కుక్కల విషయంలో తామేమి చేయలేమని సమాధానం చెప్పారు. ఇలా జిహెచ్ఎంసి ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి ఈ విధమైనటువంటి సమాధానం రావడంతో ఒక నెటిజన్ నాగార్జునను సూటిగా ప్రశ్నించారు.

  1. Nagarjuna: మీ భార్య మధ్యతరగతి వారిని వేధిస్తోంది..

మీ భార్య మధ్యతరగతి వాళ్లను వేధిస్తోందని నాగార్జునను ప్రశ్నించారు.వీధి కుక్కలను మీ ఇంటి ముందు ఉంచితే ఆ బాధ తెలుస్తుంది అంటూ ఆదర్శ్ అనే నేటిజన్ నాగార్జునని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అయితే ఈ ట్వీట్ కాస్తసోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఆదర్శ అనే వ్యక్తికి సపోర్ట్ చేయగా మరి కొందరు అమలకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Amala: ఏఎన్ఆర్ చివరి రోజుల్లో తన మాటలతో బాధపెట్టిన అమల.. అలా మాట్లాడేసిందా?

Amala: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఆయన వారసుడిగా నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక నాగార్జున మొదటి దగ్గుబాటి లక్ష్మీన వివాహం చేసుకోగా ఆమెకు విడాకులు ఇచ్చి నటి అమలను రెండవ వివాహం చేసుకున్నారు.

ఇక నటిగా ఇండస్ట్రీలో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అమల వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై ఇంటి బాధ్యతలను చక్కబట్టారు. అయితే నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత అమల కారణంగా నాగేశ్వరరావు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఫుడ్ విషయంలో అమల నాగేశ్వరరావు మధ్య గొడవలు జరిగేవని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న అమల నాగేశ్వరరావు తీసుకునే ఆహార విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల వీరిద్దరికి గొడవలు జరిగేవని,ఈ గొడవల కారణంగానే నాగార్జున కొద్దిరోజుల పాటు అమలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.ఇక నాగేశ్వరరావు చివరి రోజులలో ఇదే విషయం గురించి అమల మాట్లాడుతూ మీకు ఇష్టం లేకుండా మీ అబ్బాయి పెళ్లి చేసుకోవడం వల్లే మమ్మల్ని విడతీయాలని చూస్తున్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట.

Amala: అమల నాగార్జున పెళ్లి ఏఎన్నార్ కి ఇష్టం లేదా…

ఈ విధంగా అమల మాటలతో నాగేశ్వరరావు ఎంతో బాధ పడ్డారని అప్పటినుంచి పెద్దగా వీరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చూసుకుంటూ పోయే వారిని అప్పట్లో వార్తలు వచ్చాయి.ఇలా వీరిద్దరి గురించి ఈ విధమైనటువంటి వార్తలు వచ్చిన కొంతకాలానికే నాగేశ్వరరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారని అనంతరం ఆయన కాలం చేశారు.

Nagarjuna – Amala: బాలీవుడ్ తారలతో దసరా సెలబ్రేషన్స్ లో పాల్గొన్న నాగార్జున దంపతులు.. ఫోటోలు వైరల్!

Nagarjuna – Amala:ఈ ఏడాది దసరా పండుగను సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా దసరా పండుగ సందర్భంగా తెలుగులో కూడా సినిమాలు విడుదలవడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకున్నారు. ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలయి మంచి హిట్ కావడంతో నాగార్జున కుటుంబ సభ్యులు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దసరా పండుగ సందర్భంగా నాగార్జున దంపతులు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి దసరా వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా నాగార్జున బాలీవుడ్ తారలతో కలిసి దసరా వేడుకలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ కు కేవలం తెలుగులో మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక ఈ బ్రాండ్ కు వివిధ భాషలలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నటువంటి సెలెబ్రెటీల అందరిని ఒకే చోట చేర్చి దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

Nagarjuna – Amala: అందరినీ ఒకచోట చేర్చిన కళ్యాణ్ జువెలర్స్..

ఈ క్రమంలోనే నాగార్జున అమలతో పాటు రణబీర్ కపూర్, స్నేహ, కత్రినా కైఫ్,కళ్యాణి ప్రియదర్శన్ వంటి పలువురు సెలబ్రిటీలు ఒకే చోటచేరి దసరా వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అఖిల్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.

Nagarjuna: అమల నటన చూసి కంటతడి పెట్టుకున్న నాగార్జున.. సెంటిమెంట్ ను పండించిన అమల!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్యగా అమల అందరికీ ఎంతో సుపరిచితమే. వివాహానికి ముందు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. ఇలా కుటుంబ బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అమల చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె తాజాగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల శర్వానంద్ తల్లి పాత్రలో సందడి చేయబోతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న అమల ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమా 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో పలువురు సినీ సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ చూడటానికి నాగార్జున, అఖిల్, అమల, డైరెక్టర్ హను రాఘవపూడి, చందు మొండేటి వంటి ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఈ సినిమా చూసిన అనంతరం నాగార్జున ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.

Nagarjuna: అమల నటనకు ఎమోషనల్ అయిన అఖిల్..

ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల ఎంతో అద్భుతంగా నటించిందని ఈమె తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో అద్భుతంగా సినిమా చేశారంటూ ఈయన చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు. ఇక మదర్ సెంటిమెంట్ తో వచ్చినటువంటి ఈ సినిమా చూసిన అఖిల్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని,ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఈ సందర్భంగా నాగార్జున సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేశారు.

Prabhas: ప్రభాస్ అన్నతో చాలా కష్టం.. వద్దన్నా వదిలిపెట్టడు అఖిల్ కామెంట్స్ వైరల్!

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ చిత్ర బృందానికి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ తో పాటు నటించిన ఎంతోమంది నటీనటులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ ఫుడీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తినడమే కాకుండా అందరికీ అలాంటి భోజనమే పెడతారంటే ఎంతో మంది ప్రభాస్ ఆతిథ్యం గురించి వెల్లడించారు.

తాజాగా ప్రభాస్ ఏర్పాటు చేసే విందు గురించి అమల శర్వానంద్ అఖిల్ ముచ్చటించారు.శర్వానంద్ అమల నటించినటువంటి ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్ 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అఖిల్ కలిసి ఈ ముగ్గురు అమ్మ చేతి వంట అనే ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రస్తావన వచ్చింది.

ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి అఖిల్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభాస్ అన్నాను కలిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పగా వెంటనే శర్వానంద్ అవును అంటూ తనకు వత్తాసు పలికారు. ఈ క్రమంలోనే అఖిల్ మాట్లాడుతూ ప్రభాస్ అన్న వద్దు బాబోయ్ అని మొరపెట్టుకున్న ఆయన మాత్రం తినేవరకు వదిలిపెట్టరు అంటూ అఖిల్ అమలకు చెప్పుకొచ్చారు.

Prabhas: ప్రభాస్ తో విందు భోజనం అంటే అట్లుంటది మరి…

ఇలా ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదల కాగా అఖిల్ ప్రభాస్ ఆదిత్యం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఖిల్ మాత్రమే కాకుండా ఇదివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇలా అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు అట్లుంటది మరి మా హీరోతో అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Naga Chaitanya Mother: నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా.. విడాకులకు కారణం అదేనా?

Naga Chaitanya Mother: నాగార్జున ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దగ్గుబాటి వారసురాలు దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్నారు.దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలోనే లక్ష్మి జన్మించారు. ఈమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఇంటీరియర్ డిజైనర్ గా స్థిరపడ్డారు.ఇకపోతే రామానాయుడు ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో మంచి పరిచయం ఏర్పడింది.

ఈ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో వీరిద్దరూ వియ్యంకులుగా మారాలని భావించారు.ఇలా అనుకున్నదే తడవు దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున వివాహానికి అన్ని సిద్ధం చేశారు. అయితే అమెరికా జీవన శైలికి అలవాటు పడిన లక్ష్మి ఇండియా రావడానికి ఇష్టపడలేదు. అయితే ఆమెకు నచ్చజెప్పి ఇండియా రప్పించి వీరి వివాహాన్ని చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

ఇకపోతే వివాహమైన తర్వాత లక్ష్మి ఇండియాలో ఇమడలేకపోయింది దీంతో తాను అమెరికా వెళ్లి స్థిరపడాలని నాగార్జునపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నాగార్జున ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా రాణించాలనే ఉద్దేశంతో తాను అమెరికా వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.వీరి మధ్య గొడవలు జరగడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరికి నచ్చ చెప్పారు.

ఇండియాలో ఉండలేక గొడవలు పడి విడిపోయిన లక్ష్మి..

ఇక ఈ దంపతులకు నాగచైతన్య జన్మించకా లక్ష్మి ఇండియాలో ఉండలేక నాగార్జునతో గొడవలు పడి విడాకులు తీసుకుని విడిపోయారు.విడాకులు ఇచ్చిన తర్వాత నాగార్జునకు అమల పరిచయం కాగా ఆమెతో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు. అదేవిధంగా లక్ష్మీ సైతం తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని తిరిగి అమెరికాలో స్థిరపడ్డారు.ఇక నాగచైతన్య కొద్దిరోజుల పాటు తన తల్లి లక్ష్మీ వద్ద పెరిగినా అనంతరం తండ్రి నాగార్జున దగ్గర కూడా పెరిగారు.