తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై కీలక చర్చకు రంగం సిద్ధం!
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరుగనుంది. ...

























