Tag Archives: bike accident

Sai Dharam Tej: బైక్ అనే భయం నుంచి బయటపడటానికి ఆ పని చేశాను.. సాయి ధరంతేజ్ కామెంట్స్ వైరల్!

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. బైక్ పై ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా ఈయన అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రగాయాలు పాలయ్యారు. దీంతో 12 రోజులపాటు కోమాలో ఉన్నటువంటి సాయి ధరంతేజ్ కు పలు సర్జరీలు కూడా నిర్వహించి ఈయనని ప్రాణాలతో కాపాడారు.

ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని తెలుస్తుంది.సాధారణంగా ఎవరికైనా మరణం అంచులు దాకా వెళ్లి వస్తే తిరిగి ఆ పని చేయాలంటే భయపడతారు. ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ కూడా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత బైక్ నడపాలి అంటే చాలా భయపడ్డారట.

ఇలా బైక్ అంటేనే భయం ఉన్నటువంటి ఈయనని తన తల్లి ఆ భయం నుంచి బయటకు తీసుకు వచ్చారని తెలిపారు.తను కాస్త కోలుకున్న తర్వాత స్వయంగా తన అమ్మ తనకు కీస్ ఇచ్చి బైక్ నడపమని చెప్పారని సాయి తేజ్ వెల్లడించారు. మొదట్లో తన ఇంటి పార్కింగ్ లోనే మెల్లిమెల్లిగా బైక్ నడిపే వాడినని ఆ తర్వాత కాస్త దూరం వెళ్లానని సాయి ధరంతేజ్ వెల్లడించారు.


Sai Dharam Tej: తాతయ్య బైక్ కొనిచ్చారు…

ఇప్పుడు తాను మామూలుగానే బైక్ నడుపుతున్నానని ఈయన తెలియచేశారు. అయితే ప్రమాదానికి గురైన ఆ బైక్ ఏం చేశారన్న ప్రశ్న కూడా తనకు ఎదురు కావడంతో ఆ బైక్ తనకు తన తాతయ్య కొనిచ్చారని అయితే ప్రమాదం జరిగిన తర్వాత అది పూర్తిగా పాడవడంతో మరొక బైక్ కొనుగోలు చేసి దానిని అమ్మేశాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Sai Dharam Tej: బైక్ ప్రమాదం ఒక స్వీట్ మెమోరీ.. ప్రమాదంపై మొదటిసారి స్పందించిన సాయి ధరమ్ తేజ్!

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగా అల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన వరుస సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాల క్రితం సాయి ధరంతేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఆ సమయంలో ఈయన తీవ్ర గాయాలు పాలు అవ్వడమే కాకుండా దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ క్షేమంగా బయటపడ్డారు.

ఇలా ప్రమాదం నుంచి బయటపడిన సాయిధరమ్ తేజ్ తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోని ఈయన విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి ధరంతేజ్ బైక్ ప్రమాదం గురించి స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రమాదాన్ని తాను ఒక పీడకలలా భావించలేదని దానిని ఒక స్వీట్ మెమరీగా భావిస్తున్నానని తెలిపారు.

తనకు యాక్సిడెంట్ అయిన తర్వాత తాను చాలా విషయాలు నేర్చుకున్నాను ముఖ్యంగా మాట విలువ తెలుసుకున్నాను. ప్రమాదానికి ముందు తాను ఎక్కువగా మాట్లాడే వాడిని కానీ మాటకు ఉన్న విలువ ప్రమాదం తర్వాతే తెలిసిందని తెలిపారు.ఇక హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అభిమానులు నాకోసం ప్రార్థించిన వారందరినీ చూసి తనకు చాలా సంతోషం వేసిందని ఇది కదా నేను సంపాదించిన అసలు సిసలైన ఆస్తి అని సంతోషం వేసిందని తెలిపారు.

Sai Dharam Tej: మళ్లీ బైక్ ఎక్కకూడదు అనుకున్నా…


మళ్లీ బైక్ ఎక్కనని అనుకుంటే, భయాన్ని జయించడం అవసరమని తన తల్లి చెప్పి, బైక్ ఎక్కించిందని చెప్పుకొచ్చాడు. ఈ క్షణంలో బ్రతకాలి వర్తమానంలో బ్రతకాలి అనే విషయాలను తెలుసుకున్నానని అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా గడపాలని ఫిక్స్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా సాయి ధరంతేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం తర్వాత ఇప్పటివరకు తన మొహాన్ని చూపించకపోవడానికి కారణం అదేనా..!

గత నెల 10 వ తేదీ హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయితేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలాఉండగా సాయి తేజ్ ను మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

దాదాపు నెల రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సాయి తేజ్ దసరా పండుగ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలోనే చిరు,పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తేజు క్షేమంగా ఉన్నాడని తెలపడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్న సాయి తేజ్ ను పలువురు కలిసి అతనిని పరామర్శించారు.

తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ తేజును కలిసి తమ్ముడు క్షేమంగా ఉన్నాడని చెప్పడమే కాకుండా అతని చేతిలో చెయ్యి వేసి దిగిన ఫోటోను కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.అయితే ప్రమాదం తరువాత సాయి ధరమ్ తేజ్ చేతిని, చేతి వేళ్ళని మాత్రమే చూపిస్తున్నారు కానీ అతని మొహాన్ని ఇప్పటి వరకు చూపించకపోవడంతో అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే సాయి ధరమ్ తేజ్ కు ప్రమాద సమయంలో మొహానికి గాయాలు తగలయాని, అవి పూర్తిగా మానేవరుకు అతని ఫేస్ చూపించరని తెలుస్తోంది.మరి నిజంగానే సాయి తేజ్ మొహాన్ని చూపించక పోవడానికి కారణం అదేనా? లేక మరిదైన కారణం ఉందా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ పై.. స్పందించిన పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..!

కొన్ని రోజుల కిందట బైక్ ప్రమాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అతడు ఆసుపత్రిని నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 35 రోజుల పాటు అతడు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నాడు.

ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకొని అతడు ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ ఇలా ఉన్నారు. ‘అనుకోకుండా ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా చికిత్స పొందిన సాయి కోలుకొని క్షేమంగా ఇంటికి చేరాడు.. విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావ‌డం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని క‌లిగించింది.

ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు అందుకొని ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు మ‌రింత‌గా పొందాల‌ని శక్తి స్వ‌రూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఎంతో బాధ‌ప‌డ్డారు’ అని అన్నాడు.అలాగే తేజ్ ఆరోగ్యంగా ఉండాలని.. ఆలయాల్లో పూజలు చేసి.. ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’ అంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు.

వారి పూజలు ఫలించాయని పేర్కొన్నాడు. తేజ్ క్షేమంగా తిరిగి ఇంటికి రావడంపై మెగా అభిమానులు, మెగా బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేశారు. అది పండుగ రోజు ఇంటికి రావడంతో ఆ ఆనందం ఇంకా రెంట్టింపు అయింది.

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: బాబు మోహన్

ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ దుర్గం చెరువ కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. వైద్యులు బెలెటిన్ కూడా వెల్లడించారు.

ఇదిలా ఉంటే సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి ప్రముఖ నటుడు బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు స్పోర్ట్స్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించాడని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

యాక్సిడెంట్‌లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. స‌ర‌దా కోసం ప్రాణాల‌తో ఎవ‌రు చెల‌గాటం ఆడొద్దని బాబుమోహన్‌ చెప్పుకొచ్చారు. ప్రమాదంలో మరణించిన వారు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారు. ప్రతీ ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలి అని వాపోయారు.

కుమారుడు కోల్పోయిన బాధ ఒక తండ్రిగా తనకు తెలుసునని.. సాయి హెల్మెట్ పెట్టుకొని మంచి పని చేశాడని అన్నారు. ఎవరు బైక్ నడిపినా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించాడు. ఎవరూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోరు.. కానీ దురదృష్టం వెంటాడితే ఎవరూ ఏమి చేయలేరన్నారు. అందుకే రోడ్డు మీదకు బైక్ తీసింది మొదలు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ.. సూచించారు.

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ముందుగా తెలిసింది బన్నీకే.. వెంటనే బన్నీ ఏం చేశాడో తెలుసా?

శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే అతనికి చికిత్స నిమిత్తం అక్కడే ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. సాయి తేజ్ ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ ఆస్పత్రికి చేరుకొని సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించారు.

ఈ విధంగా మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం సాయి ధరమ్ తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు స్పందిస్తూ..ఆయన ఈ ప్రమాదం నుంచి తొందరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఈ విధంగా మెగా హీరోకు రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినప్పటికీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటమే కాకుండా ఈ రోడ్డు ప్రమాదం పై స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా ఆయన పై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నిజానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే మెగా కుటుంబంలో మొదటగా అల్లు అర్జున్ కే ఈ విషయం తెలియడంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

ఎక్కడో షూటింగ్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ కు ఈ ప్రమాదం గురించి ఎలా తెలిసింది అనే విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే అతనిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆస్పత్రిలో అల్లు అర్జున్ సన్నిహితులు ఉండడంతో ఈ విషయాన్ని అల్లు అర్జున్ కి చేరవేయగా అల్లు అర్జున్ తమ కుటుంబ సభ్యులకు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయాన్ని తెలియజేశారు. అయితే తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో అల్లుఅర్జున్ షూటింగ్ లోనే ఉండిపోయారు. తనకు ఏమాత్రం కాళీ దొరికిన వెంటనే హైదరాబాద్ చేరుకొని తేజ్ ను పరామర్శించాలానే ఆలోచనలో అల్లుఅర్జున్ ఉన్నట్టు తెలుస్తుంది.

సాయిధరమ్ తేజ్ నడిపిన బైక్ పై ఉన్న చలానాను ఆ హీరో అభిమాని క్లియర్ చేశారట..

సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అతడి ఆరోగ్య విషయమై ప్రతీ గంట గంటకు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నారు. అయితే అతడికి ఆదివారం సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు, పరిశ్రమ వర్గాలు, బంధువులు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ప్రస్తుతం అతడు నడిపిన స్పోర్ట్స్ బైక్ గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. అతడు డ్రైవ్ చేసిన ఆ బైక్ సాయిధరమ్ తేజ్ పేరు మీద లేదు.

అనిల్ కుమార్ బురా అనే వ్యక్తి పేరు మీద రిజిష్టర్ అయి ఉంది. అయితే దానిని ఆ మెగా హీరో కొనుగోలు చేశారనే వార్తలు వస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ లో అతడు కొనుగోలు చేశాడని.. రిజిస్ట్రేషన్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని సమాచారం. ఇదిలా ఉండగా ఆ బైక్ ను నడుపుతున్న సమయంలో మితిమీరిన వేగంతో వెళ్లడంతో ఆ బైక్ పై చలాన్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మెగా హీరో బైక్ పెండింగ్ చలాన్ ను నందమూరి అభిమాని క్లియర్ చేశాడని తెలిసింది. ఇప్పడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అతడి బైక్ ఉన్న పెండింగ్ చాలనాను నందమూరి అభిమాని చెల్లిండం ఏంటని.. ఏదేమైనా నందరమూరి-మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధానికి ఇదొక నిదర్శనం అంటూ చాలామంది ప్రశంసిస్తున్నారు.

సాయి ధరమ్ కేసులో బయటపడిన నిజానిజాలు ఇవే..!

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి కెబుల్‌ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ ను వెంటనే స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిన పోలీసులు అతనిని మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇకపోతే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో భాగంగా పలు విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికార్డు పరిశీలించినట్లయితే సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి పై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సమయానికి సాయి ధరమ్ తేజ్ 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారని తెలియజేశారు.

సాధారణంగా కేబుల్ బ్రిడ్జి పై కేవలం గంటకు 40 కిలోమీటర్ల వేగం అనుమతి కాగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలో కేవలం 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక సాయి ధరమ్ తేజ్ నడిపిన ట్రైంఫ్ కంపెనీ రేసింగ్ బండి తన పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదని, ఎల్బీ నగర్ కు చెందిన బూర అనిల్ కుమార్ అనే వ్యక్తి దగ్గరసాయి ధరమ్ తేజ్ కొన్నప్పటికీ ఇప్పటివరకు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఇప్పటికే ఆ బైక్ అనిల్ కుమార్ పేరు పై ఉంది.

ఇదే బండి నెంబర్ పై గత ఏడాది అధిక వేగంతో ప్రయాణం చేస్తున్నందుకుగాను రూ. 1135 చలానా పెండింగ్ లో ఉంది. అయితే సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ చలానా కట్టినట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారించగా కేవలం అతివేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు.

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. సాయి ధరమ్ తేజ్ సర్జరీ సక్సెస్.. !

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.ఈ విధంగా ఆపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సాయితేజ్ స్పృహలోకి రావడంతో ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, ఈ నేపథ్యంలో అతనికి కాలర్ బోన్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.కాగా నేడు ఉదయం సాయి తేజ్ కు సర్జరీ మొదలుపెట్టారు.

కొన్ని గంటల పాటు సర్జరీ నిర్వహించిన వైద్యులు అతనికి కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయిందని తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఈ సందర్భంగా అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాలకు ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు.

ఈ విధంగా సాయి ధరంతేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని త్వరలోనే ఈ ప్రమాదం నుంచి కోలుకుని క్షేమంగా బయటకు తిరిగి వస్తారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాయి ధరంతేజ్ ప్రమాదం గురించి మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు రావడంతో అభిమానులు ఎంతో కంగారు పడ్డారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని, కాలర్ బోన్ సర్జరీ కూడా విజయవంతం కావడంతో ఇకపై తనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని ఈ సందర్భంగా వైద్యులు వెల్లడించారు.

నేడు సాయిధరమ్ తేజ్ కు కీలక సర్జరీ.. వెల్లడించిన వైద్యులు..

సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ప్రతీ రోజు వందల్లో వార్తలు.. అతడి చికిత్సకు సంబంధించి ప్రతీ న్యూస్ ఛానల్లో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడు నడిపిన బైక్ గురించి అనేక వార్తలు వచ్చాయి. వాటితో పాటే అతడు బైక్ రేసింగ్ కారణంగానే ఇలా జరిగిందనే ఫేక్ వార్తలు కూడా వచ్చాయి.

ఇవన్నీ పోలీసులు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి చికిత్సకు సంబంధించి మరో వార్త వచ్చింది. అతడికి కీలకమైన సర్జరీ చేసేందుకు వైద్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలామందికి ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా అనే అనుమానాలకు కూడా వైద్యులు చెక్ పెట్టారు. అలాంటిది ఏమి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అతడికి అబ్జర్వేషన్ లో పెట్టామని.. 24 గంటల తర్వాత కీలక సర్జరీ చేసేదుకు ప్రయత్నిస్తున్నామని.. వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.

మొదట అతడు ఆసుపత్రిలో చేరగానే 48 గంటల డేంజర్ జోన్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ శారీరం సహరిస్తే సర్జరీ చేస్తామని చెప్పిన వైద్యులు.. తాజాగా ఆ గడువు ముగిసింది. దీంతో అతడి శరీరం సహకరిస్తే సర్జరీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

కాలర్‌ బోన్‌కు ఫ్రాక్చర్‌ కావడంతో దానికి సంబంధించి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రములుకు ప్రార్థనలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారు.