Tag Archives: Chittoor district

Comedian Hari: ఎర్రచందనం స్మగ్లింగ్ కి పాల్పడిన జబర్దస్త్ కమెడియన్… పరారీలో ఉన్న కమెడియన్?

Comedian Hari: జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతోమంది కమెడియన్లుగా పనిచేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు .మరి కొంతమంది కమెడియన్స్ ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకొని సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా మరికొందరు అడ్డదారులలో పయనిస్తున్నారు.

అడ్డదారులలో పయనిస్తూ పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కి పాల్పడతున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ ద్వారా సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న హరి అలియాస్ హరిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన మరోవైపు స్మగ్లింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలోనే హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కి పాల్పడుతూ పోలీసుల నుంచి తప్పించుకొని పరారైనట్లు తెలుస్తోంది.చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 60 లక్షల విలువచేసే ఎర్రచందనాన్ని ఆక్రమంగా తరలిస్తూ పోలీసులు చేతికి చిక్కారు. అయితే ఈ అక్రమ రవాణాలో జబర్దస్త్ కమెడియన్ హరికి కూడా భాగం ఉందని తెలుస్తోంది.

Comedian Hari: ఎర్రచందనం స్మగ్లింగ్…


ఈ ఆపరేషన్ లోభాగంగా పోలీసులు జబర్దస్త్ కమెడియన్ పట్టుకోవాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన అప్పటికే పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే హరి పై కేసు నమోదవడం ఇది మొదటిసారి కాదని ఇదివరకే ఈయనపై స్మగ్లింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది.

దోశకు డబ్బులు ఇవ్వలేదని.. ఆత్మహత్య చేసుకున్నాడు బీటెక్ విద్యార్థి..

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. మరికొందరు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వంటి ఇతర బలమైన కారణాలతో జీవితంపై విరక్తితో బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువకుడు ఏ కారణంచేత ఆత్మహత్య చేసుకున్నాడో తెలిస్తే.. షాక్ అవుతారు. కేవలం కోడి గుడ్డు దోశకు డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్(21) కొత్తకోట సమీపంలోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అతడికి చిన్న తనంలోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన తల్లి వద్దే పెరిగాడు. ఒక్కడే కొడుకు కాబట్టి ఆమె కూడా అతడిని ఎంతో గారాబంగా పెంచింది.

చదువులో కూడా అందరికంటే ముందుండేవాడు. అయితే అతడు తన తల్లిని కోడి గుడ్డు దోశ తినాలని ఉంది.. డబ్బులు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్ ఇంట్లో గోడవ పడి తన మొబైల్ ఫోన్‌ను ఇంటిలోనే వదిలి పెట్టి బయటకు వెళ్ళారు. కోపంతో బయటకు వెళ్తున్నాడు.. మళ్లీ వస్తాడులే అని ఆమె అనుకుంది.

కానీ అక్కడ జరిగింది వేరు. అతడు అలాగే నడుచుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ అతడిని కాపాడేందుకు కూలీలు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెంది ఉండడంతో పోలీసులకు,‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

హైవే పక్కనే ఆ రెండు గ్రామాలు ఉన్నాయి.. కానీ వాళ్ల ఊర్లకు మాత్రం రోడ్డు లేదు.. ఎక్కడంటే..

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక రంగం నుంచి మొదలుకొని.. ఎన్నో రంగాల్లో అద్బుతంగా రాణిస్తుంది.. అప్పటి భారత ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పథకాన్ని 2000 సంత్సరంలో ప్రేశపెట్టారు. దాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలని.

మారు మూల పల్లెల దగ్గర నుంచి గిరిజనులు ఉండే.. ప్రాంతాల వరకు రోడ్లను అనుసంధానం చేయలనేది లక్ష్యం. అయితే అప్పటి నుంచి రోడ్డు లేని గ్రామం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం చీకలబైలు పంచాయతీ పరిధిలోని ఎగువ దొనబైలు, దిగువ దొనబైలు గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

రోడ్డు సౌకర్యం లేకుండా ఉన్న ఊర్లు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అది మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రామాలకు హైవే రోడ్డు కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రామాల్లో 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. హైవే నుంచి వాళ్ల ఊరికి వెళ్లాలంటే మాత్రం రోడ్డు సౌకర్యం లేదు.

అధికారులను ఎన్నో సంవత్సరాల నుంచి వేడుకుంటున్నా స్పందించడం లేదంటూ వాపోతున్నారు. మదనపల్లె-బెంగళూరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న చీకలబైలు కొండలపై ఈ రెండు గ్రామాలున్నాయి. వీళ్ల గ్రామాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అధికారులు తమ సమస్యను పట్టించుకొని రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

తండ్రిలాంటి వాడని అతడి బైక్ ఎక్కిన బాలిక.. చివరకు అతడు ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడంటే..

ఆడపిల్ల బయటకు వచ్చిందంటే చాలు.. కామంతో కల్లు మూసుకుపోయిన కామాంధులు వావివరసలు మరచిపోయి రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్యాచార వార్తలే వినిపిస్తున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా వీళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ రోజుల్లో బంధువులను నమ్మి వారితో పంపించాలన్న భయపడాల్సి పరిస్థితి వచ్చింది. ఎవరి మదిలో ఎలాంటి విషపు ఆలోచన దాగి ఉందో..! ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉందో ముందే గ్రహించడం చాలా కష్టంగా మారుతోంది.

రేషన్ కోసం అని బంధువుతో తన కూతరును పంపించారు తల్లిదండ్రులు. వరుసకు పెద్దనాన్నతో రేషన్ షాపుకు వెళ్ళింది ఆ బాలిక. కానీ ఆ కామాంధుడి కన్ను కూతరు వయస్సున్న ఆ బాలికపై పడింది. పొదల్లోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌనిగానిపల్లెలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తల్లి తండ్రులతో కలసి జీవనం సాగిస్తోంది. రేషన్ కోసమని ఆ బాలిక పెద్దనాన్న అయిన గంగులప్పతో పంపించారు తల్లిదండ్రులు. రేషన్ బియ్యం, సరుకులు తీసుకోని తిరుగు ప్రయాణం అయ్యారు.

అతడికి అప్పటికే పెళ్లైన ఇద్దరు కుమార్తెలు, కొడుకు కూడా ఉన్నారు. కుమారుడికి రెండేళ్ల క్రితం వివాహం కూడా చేశాడు. అయితే ఆ కామాంధుడి కన్ను కూతురు వరుసైన ఆ బాలికపై పడింది. ఇంటికి వెళ్లే క్రమంలో దారి మధ్యలో బైక్ ఆపి.. పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. ఇదేంటి పెద్దనాన్న ఇక్కడకు తీసుకొచ్చావ్.. అని ప్రశ్నించగా.. తన కోరిక తీర్చాలని బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక పెద్దగా అరిచింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో.. ఆమె అరుపులకు ఉపయోగం లేకుండా పోయింది. ఎలాగోలా అక్కడ నుంచి ఆమె అతడి చెర నుంచి తప్పించుకొని పరుగున తన ఇంటికి చేరుకుంది.

ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా.. అఘాయిత్యాన్ని తలుచుకొని సబ్బు నీళ్లను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను తల్లితండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎందుకు ఈ పని చేశావని ఆ బాలికను నిలదీయగా.. జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

చేపల చెరువులో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. ఎక్కడంటే..

అప్పుడప్పడు మనం వార్తల్లో వింటూ ఉంటాం.. ఆ ఊరిలో పొలాలు దున్నుతుండగా.. ఇంటికి పునాదులు తవ్వుతుండగా.. మైనింగ్ చేస్తున్నప్పుడు పురాతన విగ్రహాలు , సంపద బయటపడుతుంటాయని. వీటిలో ఎక్కువగా దేవతల విగ్రహాలే బయటపడుతుంటాయి. కానీ ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి.

దీంతో జనాలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వాటి కోసం కొందరు ఆలయాల్లోనూ, చారిత్రక ప్రదేశాల్లోనూ తవ్వకాలు జరుపుతుంటారు. అలా కాకుండా ఓ చేపల చెరువులో పురాతన విగ్రహాలు బయటపడటంతో జనం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు విష్ణుమూర్తి, శివలింగం ఒకేచోట లభ్యం కావడంతో అద్భుతమంటున్నారు. ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా, పాకాల మండలం పెదగోల్పాడు గ్రామంలోని బావి రాగన్న చెరువులో చేపల కోసం మోటర్ తో నీటిని తోడుతుండగా విగ్రహాలు కనిపించాయి.

ఒకే చోట ఇలా విష్ణుమూర్తి, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో స్థానికులు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి బంగారంతో చేసిన విగ్రహాలు కాదు.. కంచుతో చేసినవి. మూడు అడుగుల విఘ్ణమూర్తి, శివలింగాన్ని సమీపంలోని ఆలయానికి తరలించారు.

విగ్రహాలు స్వతహాగా చెరువులో బయటపడ్డాయా లేక ఎవరైనా దొంగిలించి చెరువులో పడేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ మండల ఎమ్మార్వో సమక్షంలో వివరాలను నమోదు చేశారు పోలీసులు. అనంతరం పరావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించి.. విగ్రహాలను ట్రెజరీకి తరలించారు.

భర్తను కట్టుకున్న భార్యే హతమార్చింది.. ప్రైవేట్ పార్ట్ పై మరి దారుణంగా కొట్టి..

మద్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త మర్మాంగాలను కోసేసింది ఓ వివాహిత. ఈ ఘటన చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు గ్రామంలో చోటు చేసుకుంది. కేశవ, రేఖకు కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారి సంసార జీవితం కొన్ని రోజుల వారకు బాగానే సాగింది. కానీ ఆర్ధిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా కేశవ మద్యానికి బానిసయ్యాడు.

పలమనేరు టమాటా మార్కెట్లో హమాలిగా పనిచేసే కేశవ వచ్చిన డబ్బంతా మద్యానికి ఖర్చు పెడుతూ ఉండేవాడు. తర్వాత ఇంటికి వచ్చి భార్యను ఇబ్బందుకు గురి చేసేవాడు. దీంతో ఆమె అతడి వేధింపులకు తట్టుకోలేకపోయింది. దీంతో మద్యం మత్తులో ఉన్న భర్త ను హతమార్చింది. తర్వాత ప్రమాదవశాత్తూ చనిపోయాడని అందర్నీ నమ్మించింది. మద్యం మత్తులో ఇంటి మేడపై నుంచి జారిపడినట్లు ఇంటి పక్క వారికి, పోలీసులను ఆమె నమ్మించింది.

ఐతే కేశవ తల్లి మాత్రం తన కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోలేదని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
తాజాగా పోస్ట్ మార్టం రిపోర్టులో మర్మాంగాలపై బలమైన గాయాలున్నట్లు వెల్లడైంది.

పోలీసులు కేశ‌వ భార్య‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు నిజం భ‌య‌ట‌పెట్టేసింది. త‌న భర్త ప్ర‌తి రోజూ మ‌ద్యం సేవించి వ‌చ్చి వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని అందుకే మ‌ర్మాంగంపై కొట్టి చంపాన‌ని నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.

ఇంటి ముందు ఆగిన ఇద్దరు అమ్మాయిలు.. చివరకు ఏం చేశారో తెలుసా..?

అలంకరణ సామగ్రి అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా అందులోనూ నగలు, పూలు, మేకప్ కిట్లు, డ్రెస్సులు అనేవి ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వాటి కోసం వేలల్లో ఖర్చు అయినా వెనకాడకుండా కొనేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ ఇద్దరు అమ్మాయిలు దొంగలుగా మారారు. వాళ్లు చేసే దొంగతనం ఎంటో తెలిస్తే షాక్ అవుతారు.. వాళ్లు పూలకుండీలను దొంగతనం చేస్తున్నారు.
అవునండి.. మీరు విన్నది నిజమే.. వాళ్లు ఇంటి ముందు ఉంచే పూలకుండీలను మాత్రమే దొంగతనం చేస్తున్నారు. ఇది సీసీఫుటేజీలో చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని నగరి ప్యాలెస్ కాపౌండ్ లోని ఓ లాయర్ తన ఇంటి ఎదుట సీసీ ఫుటేజి చెక్ చేయగా ఇదంతా తెలిసింది. ఓ స్కూటీపై ఇద్దరు యువతులు వచ్చి ఇంటిముందు ఆగారు. రోడ్డుపై అటు నుంచి ఇటు నుంచి ఎవరైనా వస్తున్నారా.. అని చూశారు.

ఉన్నట్లుండి పూలకుండీని స్కూటీపై పెట్టుకున్నారు. ఓ నిమిషం తర్వాత ఆ పూలకుండీని తీసేసి.. అక్కడ పెట్టి మరో పూలకుండీని స్కూటీపై పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నారు. మొదట వారు తీసిన పూల కుండీ తులసి మొక్కది కాగా.. దానిని మళ్లీ అక్కడ పెట్టేసి కొత్తరకం పూలమొక్కను దొంగిలించినట్లు ఇంటి యజమాని తెలిపారు. మొక్కలు కావాలంటే నర్సరీలో చాలా ఉంటాయి.. అక్కడకు వెళ్లి కొనుక్కోవాలి లేదా.. ఇంటి దగ్గర ఉంటే దాని అంటును కత్తిరించి తెచ్చి నాటుకోవాలి.

కానీ ఇలా దొంగతనం చేయడం ఏంట్రా అని తెలిసిన వారు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పూలకుండీ మొక్కలకు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మనం ఒక మామిడి చెట్టుకు నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలాగా నియమించినట్లు చూశాం. ఇది మధ్యప్రదేశ్ లో జరిగింది. అలాగే.. పూలకుండీలకు కూడా గార్డులు నియమించాలా అంటూ పలువురు పేర్కొంటున్నారు.

వామ్మో..ఉల్లి పకోడీలో కప్ప..!

ఈ చల్ల చల్లని వాతావరణంలో ఎవరికైనా వేడివేడిగా బజ్జీలు లేదా పకోడీలు తినాలని అనిపిస్తుంది. అలా తింటూ ఉంటే ఆ మజానే వేరేగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగానే ఆలోచించి ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరులో జిల్లాలోని కుప్పంలో వ్యక్తి వేడి వేడి ఉల్లిపాయ పకోడీలను తినాలనుకున్నాడు. అనుకున్న వెంటనే సోమవారం (జనవరి 4) సాయంత్రం సమీప రాజీవ్ కాలనీ లో బజ్జీలు, పకోడీల దుకాణానికి వెళ్లి ఉల్లిపాయ పకోడీలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. 

ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ప్యాకెట్ ఓపెన్ చేసి పకోడీలు తిందామని అనుకుంటుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తి ఉలిక్కిపడ్డాడు. పకోడీలు అతని చేతికి మెత్తగా అనిపించడంతో ఏంటని దానిని దీర్ఘంగా చూశాడు. అయితే అది మాత్రం పకోడీ కాదు ఒక “కప్ప” అని తెలుసుకున్నాడు.ఆ పకోడీలలో కప్ప ఉందని తెలియగానే ఎంతో షాక్ అయిన ఆ వ్యక్తి కోపంతో తిరిగి దుకాణదారుడు దగ్గరికి వెళ్లాడు.

దుకాణం వద్ద చేరుకొని పకోడీలు ఆమె వ్యక్తిపై దుకాణంలో పకోడీ లతోపాటు కప్పలను కూడా వేసి అమ్ముతున్నావా? అంటూ ఆ వ్యక్తిని నిలదీశాడు. అందుకు అతను స్పందించి బాబు.. తప్పైపోయింది పొరపాటుగా ఇలా జరిగింది. క్షమించండి అంటూ… ప్రాధేయపడ్డాడు. ఇంకోసారి ఈ విధంగా జరగకుండా జాగ్రత్త పడతానని దుకాణదారుడు తెలియజేశాడు. ఇంటికి తీసుకెళ్లిన పకోడీలు తిందామని చూసేసరికి అందులో కప్ప కనిపించింది. అప్పటికే మా ఇంట్లో కొందరు ఈ పకోడీలను తిన్నారని అయితే దేవుడి దయవల్ల ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు.పొరపాటున ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటే పరిస్థితి ఏంటని సదరు వ్యక్తి వాపోయాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా 800 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ఈ మధ్య కాలంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రైవేట్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. అమర్ రాజా గ్రూప్ కంపెనీలో 800 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు.

అమర్ రాజా కంపెనీ ఈ నోటిఫికేషన్ ద్వారా 800 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. కంపెనీ ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి, ఇతర సదుపాయాలను ఉద్యోగాలకు ఎంపికైన వారికి కల్పిస్తారు. https://www.apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులు అమర్ రాజా సంస్థలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే జనవరి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పది ఇంటర్ పాస్ అయినవారితో పాటు ఫెయిల్ అయిన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు డిప్లొమో, డిగ్రీ, బీటెక్ చదువులు మధ్యలో ఆపేసిన వారు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి వరకు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.