పాట్నా, బీహార్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ఆయన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. ...