ప్రోటీన్ పవర్‌తో నిండిన పేసరపప్పు లడ్డూ.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్!
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో, సంప్రదాయ వంటకాలపై ప్రజల్లో ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేసరపప్పుతో తయారుచేసే లడ్డూలు ఆరోగ్యకరమైన స్వీట్‌గా గుర్తింపు పొందుతున్నాయి. ...

























