Tag Archives: latest interview

CVL Narasimha Rao : ఠాగూర్ సినిమాకు నన్ను వాడుకొని.. చివరికి సినిమా రిలీజ్ అయ్యాక ఎంత మోసం చేసారంటే.. : సీవీఎల్ నరసింహారావు

CVL Narasimha Rao : విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన సీనియర్‌ ఆర్టిస్ట్‌ సీవీఎల్‌ నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి సీక్రెట్ ను అతడే బయట పెట్టి సినిమాకు ఓ కీలకంగా వ్యవహరిస్తాడు. అయితే ఇదిలా ఉండగా.. అతడు ఠాగూర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడారు. అతడు ప్రొఫెషన్ గా ఒక లాయర్.. లాయర్లు సాధారణంగా మోసపోరు కదా.. మీరెప్పుడైనా మోసపోయారా అని అతడిని ప్రశ్నించగా.. ఒక స్కూటర్ విక్రయించే విషయంలో మోసపోయినట్లు చెప్పిన అతడు.. మరో మోసం గురించి కూడా చెప్పారు.

రక్ష అనే ఆర్గనైజేషన్ పెట్టి 25 ఏళ్లు అయిందని.. దానిలో యాంటీ కరెప్షన్ వింగ్ లో రిటైర్డ్ డీజీపీతో ఒక సంవత్సరం వరకు నడిపినట్లు తెలిపారు. ఠాగూర్ సినిమా రావడానికి రెండు సంవత్సరాల ముందు ఇలా నడిపామని.. దానిలో ఎలాంటి అవినీతి ఉండకూడదని అనేది మెయిన్ థీమ్. అయితే ఠాగూర్ సినిమా సమయంలో ప్రొడ్యూసర్స్, వివి వినాయక్ తో కలిసి దీనికోసం ఒక వెబ్ సైట్ చేద్దామని అనుకున్నాం… దాని పేరు కూడా ‘ఫర్ యూ’ అని కూడా అనుకున్నామని చెప్పారు.

దానితో జనాలకు సేవ చేయడానికి వీలు ఉంటుందని అనుకున్నారట. దాని ఆధారంగానే ఠాగూర్ సినిమా తీసామని.. తీరా సినిమా రిలీజ్ అయి మొదటి షో పడగానే.. వెబ్ సైట్ గురించి మాట్లాడితే.. ఇక అలాంటిది ఏమి అవరసం లేదని, సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది ఇంకా పబ్లిసిటీ తో పనేముంది అని మోసం చేశారని నరసింహారావు చెప్పుకొచ్చారు. ఇలాంటిదే యువసేన సినిమాకు కూడా జరిగిందని ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

Karate Kalyani: ఉద్దేశపూర్వకంగానే నాపై కుట్రలు చేస్తున్నారు… చిన్నారిని దత్తత తీసుకోలేదు: కరాటే కళ్యాణి

Karate Kalyani: కరాటే కళ్యాణి యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో పెట్టుకున్న గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఫ్రాంక్ వీడియోలు అంటూ ఈ వివాదం మొదలై చివరికి చిన్నారి దత్తత వరకు దారి తీసింది.ఈ క్రమంలోనే తనతోపాటు ఉన్న చిన్నారి ఎవరు ఏంటి అని అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ విధంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తన ఇంటిని సోదా చేస్తున్న సమయంలో కరాటే కళ్యాణి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే అనంతరం మీడియా ఎదుటకు వచ్చిన ఈమె తన లాయర్ తో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఐదు నెలల చిన్నారిని దత్తత తీసుకున్నాననే విషయంలో ఏ మాత్రం నిజం లేదు కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.అయితే గతంలో కరాటే కళ్యాణి ఈ చిన్నారిని దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ ఛానల్స్ లో వెల్లడించారు. ఈ విషయం గురించి కరాటే కళ్యాణి మీడియా సమావేశంలో మాట్లాడారు.

గతంలో తాను యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన మాట వాస్తవమే.అలా చెప్పడం వల్ల నన్ను చూసి మరికొందరు ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి చిన్నారులను దత్తత తీసుకుంటారనే ఉద్దేశంతోనే అలా చెప్పానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అయితే నేను ఈ చిన్నారిని దత్తత తీసుకో లేదు నాకు కలెక్టర్ల నుంచి కానీ, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల నుంచి కాని ఏ విధమైనటువంటి నోటీసులు రాలేదని ఆమె తెలియజేశారు.

పాపను దత్తత తీసుకోలేదు…


ఈ విషయం గురించి కలెక్టర్ ను సంప్రదించి వివరణ ఇచ్చాను. ఇక చిన్నారి తన తల్లిదండ్రులతో పాటు నా దగ్గరే ఉంటుందని, కావాలనే శివశక్తి సమస్థ వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే లాయర్ మాట్లాడుతూ ఈమె దత్తత తీసుకోనపుడు ఇది లీగలా,ఇల్లీగలా అన్న ప్రశ్న ఎక్కడిది. పాపను దత్తత తీసుకోలేదు. కలెక్టర్‌కి ఇదే విషయం వివరించాము. కలెక్టర్ కూడా ఇదే ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు వెల్లడించారు. ఇంతటితో ఈ సమస్యకు పులిస్టాప్ పడిందని లాయర్ వెల్లడించారు.

డైరెక్షన్ చేస్తా అన్నందుకు.. నన్ను బెల్టుతో కొట్టారు.. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య షాకింగ్ కామెంట్స్!

Director Lakshmi Sowjanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు నందిని రెడ్డి తర్వాత తెలుగులో వరుడు కావలెను చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె చిన్నప్పటినుంచి డైరెక్టర్ కావాలన్న కోరికతో ఈ రంగం వైపు అడుగులు వేస్తూ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత వరుడు కావలెను చిత్రానికి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీ సౌజన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. లక్ష్మీ సౌజన్య తండ్రి లెక్కల మాస్టర్ కావడంతో తను కూడా అలాగే టీచర్ కావాలన్న ఉద్దేశంతో తన తండ్రి తనని చదివించారని తెలిపారు. చిన్నప్పుడే చాలా ఎత్తుగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరు తనని చూసి ఇంకా ఆరవ తరగతెనా అంటూ హేళన చేయడంతో ఏకంగా తన తండ్రి పదవతరగతి పరీక్షలు రాయించారని ఇలా పదకొండు సంవత్సరాలకే పదవ తరగతి పూర్తి చేసినట్లు తెలిపారు.

10 పూర్తికాగానే తనకు MEC తీసుకోవాలనే కోరిక ఉండేదని తన తండ్రి మాత్రం ఎంపీసీ తీసుకోవాలని ఒత్తిడి చేసి.. ఎంపీసీ జాయిన్ చేశారని చెప్పారు.అయితే తనకు లెక్కలు అంటే ఏమాత్రం ఇష్టం లేదని తెలిపిన సౌజన్య ఇంటర్ ఫెయిల్ అయ్యారు.ఇలా ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో నాకు చదువు అంటే ఇష్టం లేదు నేను చదవను సినిమాలకు డైరెక్టర్ అవుతానని చెప్పినట్లు వెల్లడించారు.

నచ్చని పనిని అస్సలు చేయను..

ఇలా తను ఇంటర్ ఫెయిల్ అయ్యి సినిమాలలోకి రావాలని ఉందని చెప్పడంతో తన తండ్రి బెల్ట్ తీసుకొని కొట్టారని ఈ ఇంటర్వ్యూలో లక్ష్మీ సౌజన్య వెల్లడించారు. ఇక తాను ఏ విషయమైనా ఒక్కసారి చెప్పానంటే అది తప్పకుండా తీరాలని, తనకు నచ్చని పనిని అసలు ముట్టుకోని లక్ష్మీ సౌజన్య తెలిపారు.ఇక తన నిర్ణయం చెప్పడంతో తన తండ్రి ముందు చదువుకొమ్మని అప్పటికి కూడా సినిమాలపై ఇంట్రస్ట్ ఉంటే అటువైపే పంపిస్తానని మాట ఇచ్చారని ఆ విధంగానే తాను మాస్టర్ డిగ్రీ వరకు చదువు పూర్తి చేసి అనంతరం ఇండస్ట్రీ వైపు వచ్చానని ఈ సందర్భంగా లక్ష్మీ సౌజన్య తెలియజేశారు.

వారు లేకపోతే నాగబాబు ఎవరు.. అంటూ నాగబాబుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు!

ఎన్నో వందల సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కోటశ్రీనివాసరావు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగాకోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ కోట శ్రీనివాస్ రావు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు మెగాబ్రదర్ నాగబాబు ను టార్గెట్ చేశారు. గతంలో ప్రకాష్ రాజ్, నాగబాబు మధ్య ఎన్నో గొడవలు చోటుచేసుకున్నాయి ఆ విషయం అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం తాను ప్రకాష్ రాజ్ ని అన్నానని ఆయన నా గురించి విమర్శలు చేస్తున్నారు.

అసలు నన్ను విమర్శలు చేయడానికి ఆయన ఎవరు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు ఎవరు అంటూ ప్రశ్నించారు.నాగబాబు ఉత్తమ నటుడు ఏం కాదు, చిరంజీవి పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన ఎవరో కూడా చాలా మందికి తెలియదు.

నాగబాబుకు కేవలం మెగాబ్రదర్ అనే గుర్తింపు తప్ప అతనికి నటన పరంగా ఏ విధమైనటువంటి గుర్తింపు లేదని కోట శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా నాగబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను ప్రకాష్ రాజ్ కలిసి 15 సినిమాల్లో నటించానని అయితే ఏ సినిమాలోనూ తన కరెక్ట్ సమయానికి షూటింగ్ కు రారని అతనికి క్రమశిక్షణ లేదని కోట ప్రకాష్ రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు అప్పుడు సంచలనంగా మారాయి.

నా కూతురుని లారీ గుద్ది కాలు తీసేశారు. కొడుకు అలా చనిపోయాడు. ఫ్యామిలీని తలుచుకుంటూ కంటతడి పెట్టిన కోట!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల కాలం పాటు విలక్షణ నటుడిగా, కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోట శ్రీనివాస్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వయసు పైబడటంతో సినిమా అవకాశాలు తగ్గడంతో పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూల ద్వారా ఆసక్తికరమైన విషయాల తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

కోట శ్రీనివాసరావు పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకు తన అత్తగారు మరణించడంతో ఆ విషయం తెలుసుకున్న తన భార్య ఒక సైకియాట్రిక్ వ్యాధితో బాధ పడిందని, ఆ సమయంలో తను ఎవరో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో తన ఉండేదని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా సినిమాల పరంగా తనకు ఎంతో మంచి పేరును తీసుకువచ్చిన ఆ భగవంతుడు తనకు కష్టాలను కూడా అదే స్థాయిలో తీసుకువచ్చారని తెలిపారు.

ఈ క్రమంలోనే తన భార్య వింత వ్యాధితో బాధపడటం గురించి తెలియజేసిన కోట శ్రీనివాసరావు తన కూతురు కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన కూతురు విజయవాడలో తన అక్కయ్య పిల్లలు అన్నయ్య పిల్లలతో కలిసి సరదాగా రిక్షాలో బయలుదేరి వెళ్తున్న సమయంలో ఎదురుగా ఒక లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డివైడర్ దాటుకుని వీరు ప్రయాణిస్తున్న రిక్షాను ఢీకొట్టిందని, ఆ ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు మరణించారు. దీని అదృష్టం బాగుండి కాలు విరిగిందని తెలిపారు.

ఇలా కాలు విరిగిన తన కూతుర్ని చూస్తూ రోజు బాధపడే వాడిని. అయితే నేను మొదట ఏ బ్యాంకులో అయితే గుమస్తాగా పని చేశానో ఆ బ్యాంక్ మేనేజర్ చివరికి నాకు వియ్యంకుడిగా మారారు. తన కొడుకు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు తనకు ఒక కూతురు తన జీవితం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

ఇకపోతే కోట శ్రీనివాస్ రావు కొడుకు గురించి మనకు తెలిసిందే. అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కోట శ్రీనివాస్ రావు కొడుకు బండి పై ప్రయాణం చేస్తుండగా యాక్సిడెంట్ కి గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నింటిని తలచుకుని కోట శ్రీనివాస్ రావు ఎమోషనల్ అయ్యారు. అయితే ఎన్ని బాధలు ఉన్న ఎప్పుడు కూడా తన బాధను బయట పంచుకోలేదని, వారు గుర్తొచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తాను తప్ప నా బాధను బయటకు చెప్పుకోనని తెలియజేశారు. ఇక మరో జన్మంటూ ఉంటే నటుడిగా జన్మించాలని కోరుకుంటారా అనే ప్రశ్న ఎదురు కాగా తనకు ఇలాంటి జీవితమే కావాలని.. అయితే ఈ కష్టాలను తగ్గించి పది మందికి సేవ చేసే గుణం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ అంటూ ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ రావు తెలియజేశారు.

14 టెక్స్.. ఏడిపించేసాడు.. క్రిష్ణవంశీ మీద అరిచేసా.. సినిమా నుంచి తీసేస్తాడనుకున్నా : ప్రకాష్ రాజ్

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ఎన్నో పాత్రల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

తాజాగా ప్రకాష్ రాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను నటించిన సినిమాలలో సన్నివేశాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పలు ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడితో గొడవ పడిన విషయాన్ని కూడా వెల్లడించారు.

ఈ సినిమా షూటింగ్ తీసే సమయంలో నాకు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే అయినా ఈ సినిమాలో ముసలోడి పాత్రలో నటించాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఢిల్లీ రాజేశ్వరకి బొట్టు గాజులు తీసే సమయంలో నేను ఏడ్వాలని ఉంది. ఆ సీన్ కోసం డైరెక్టర్ కృష్ణ వంశీ ఏకంగా 14 టేకులు తీశారు. వన్ మోర్ టెక్ వన్ మోర్ టెక్ అంటుండగానే కోపం వచ్చి నీకు ఏం కావాలి రా అన్నాను.

దాంతో కృష్ణవంశీ లైట్స్ ఆఫ్ అన్నారు. కృష్ణవంశీ అలా అనేసరికి నన్ను ఈ సినిమా నుంచి తీసేస్తాడు అని భయపడ్డాను. మరొక విషయం ఏమిటంటే అప్పటికే నేషనల్ అవార్డు పొందిన నేను వన్ మోర్ టేక్ అని అడిగేసరికి నేను కోపం తెచ్చుకున్నానని ఆయన భావించారు. ఇలా లైట్స్ ఆఫ్ అన్న తర్వాత వెళ్లి ఏం కావాలి అని అడగగా కూతురు బొట్టు గాజులు వెళ్లిపోతున్న సమయంలో చిన్నపిల్లాడిలా అసహనం వ్యక్తం చేసే ఏడుపు కావాలి అన్నారు. అలా ఏడిస్తే షాట్ ఓకే అవుతుందని చెప్పగా ఆ తర్వాత టేక్ లో షాట్ ఓకే అయిందని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ అంతఃపురం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను వెల్లడించారు.

నేను వర్జిన్ కాదు.. అతడితో ఏడేళ్ళు సహజీవనం చేశా.. బిగ్ బాస్ సరయు బోల్డ్ కామెంట్స్..

సరయు గురించి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే చాలామందికి తెలుసు. ఆమె 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ లో ఎక్కువగా పాపులారటీ తెచ్చుకున్నారు. దీనిలో దాదాపు అన్ని బూతులే మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలోనే ఎక్కువ డబుల్ మీనింగ్ ఉంటాయి.. కానీ ఏదో ఒక మెసేజ్ ను ఆ వీడియో చివర్లో సందేశాత్మకంగా ఇస్తారు. ఇలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.

ఇందులో పాపులర్ అయిన సరయు.. 19 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. కానీ ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేక.. అందులో ఇమడలేక .. గొడవలకు దిగుతూ.. అరుస్తూ.. మొదటి వారానికే బయటకు వచ్చేసింది. ఇలా బిగ్ బాస్ 5 నుంచి మొదటి వారమే బయటకు వచ్చిన సరయు గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ గురించి చెప్పారు. తాను ఒకరిని ప్రేమించానని.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అతడితో ఏడు సంవత్సరాలు రిలేషన్ లో కూడా ఉన్నానని.. ఈ విషయం వాళ్ల కుటుంబసభ్యులకు, మా కుటుంబసభ్యులకు కూడా తెలుసు అంటూ చెప్పింది. అతడికి సర్వం అర్పించానని.. తాను వర్జిన్ కాదు అంటూ చెప్పుకొచ్చారు.

అంతలా అతడిని నమ్మాను అంటూ చెప్పారు. కానీ చివరకు కట్నం దగ్గర ఇద్దరం విడిపోయామని.. అందులో మొదట రూ.25 లక్షలు, తర్వాత కోటి.. తర్వాత ఆస్తిలో సగం అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటారో అని.. తానే మొహం మీద ‘తాను నీకు తగిన దానిని కాదు’ అంటూ చెప్పాననీ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సరయు తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘నా సొమ్ము నా ఇష్టం.. నీకెందుకు.. నీకు మీ నాన్నకు ఎవరు నేర్పించారన్నారు..’ సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణిలో ఉన్న వారిలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. తన తండ్రి రామానాయుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు. తండ్రి రామానాయుడు బాటలోనే సురేష్ బాబు ఉ ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించాగా, వెంకటేష్ హీరోగా వెండితెరపై సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ నాయుడు ప్రొడక్షన్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీలో యాక్టింగ్ స్కూల్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, రైటర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రొడ్యూసర్స్ కు స్కూల్స్ ఎందుకు లేవనే ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు సమాధానంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రొడక్షన్ అనేది చాలా మందికి ఒక విసిల్ బిజినెస్ గా మారిపోయింది. ఎక్కడో డబ్బులు సంపాదించి సినిమాలను తెరకెక్కించి నేను ప్రొడ్యూసర్ అనిపించుకోవాలని చాలామందికి ఉంటుంది.

నేనుప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కి ప్రతిరోజు రెండు గంటల పాటు నేను చెప్పే క్లాస్ వినాలని చెప్పాను. మెంబర్షిప్ తీసుకునే ముందు నా దగ్గరికి వస్తే క్లాసెస్ చెప్తానని చెప్పాను. అలా అన్నప్పుడు చాలామంది మెంబర్షిప్ ఇవ్వండయ్యా.. వీడి దగ్గర ఏంది మనం నేర్చుకునేది.. నా సొమ్ము నా ఇష్టం మీరు ఎవరు చెప్పడానికి.. నీకు మీ నాన్నకి ఎవరైనా నేర్పించారా.. అని అడిగారని ఈ సందర్భంగా సురేష్ బాబు తెలియజేశారు. అలా వారి ధోరణిలో వారికి అది కరెక్ట్ అనిపించిందని సురేష్ బాబు తెలియజేశారు.

అదేవిధంగా దిల్ రాజు గారు ప్రతి ఒక్క జిల్లాలో థియేటర్లు నిర్మిస్తున్నారు. మీరు ఎందుకని థియేటర్లు నిర్మించడం లేదు అన్న ప్రశ్న ఎదురయింది.. ఈ క్రమంలోనే నేను పది పదిహేను సినిమాలు నిర్మిస్తున్నాను అంటే నాకు థియేటర్ అవసరమౌతుంది. కానీ దిల్ రాజు గారు అలా సినిమాలు నిర్మిస్తారు కనుక ఆయనకి థియేటర్లు అవసరం కనుక.. అతను ప్రతి ఒక్క జిల్లాలో థియేటర్లు నిర్మిస్తున్నారని అవి నడిచినన్ని రోజులు నడుస్తాయని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

సునీల్ నన్ను మేనేజర్ గా తీసేయడానికి కారణం అదే: రాజా రవీంద్ర

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాజారవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలలో పలు పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇండస్ట్రీలో రాజా రవీంద్రకు హీరో రవితేజకి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ తనని ఎంతో అభిమానంగా మామ అంటూ పిలిచేవారని, రవితేజ పెళ్లి సమయంలో అతని కాళ్లు కడిగి కన్యాదానం చేశానని రవీంద్ర ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

అయితే రవితేజతో ఈ మధ్యకాలంలో కొన్ని విభేదాలు రావడం వల్ల అతనితో మాటలు లేవని విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూనే ఎంతో మంది హీరోలకు మేనేజర్ గా రాజా రవీంద్ర వ్యవహరించారు.ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాజారవీంద్ర తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎంతో మంది హీరోలు మేనేజర్ లను తీసేసి ఉంటారని తాజాగా నన్ను సునీల్ తన మేనేజర్ గా తొలగించారని విషయాన్ని తెలిపారు.అసలు సునీల్ మేనేజర్ గా తీసేయడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ప్రశ్నించగా అది సునీల్ ను అడగాలి అంటూ సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ… సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు

సాధారణంగా తనకి ఏదైనా క్లాష్ వస్తే తనకు పర్సనల్ గా వెళ్లి ఇది చేస్తే బెటర్ గా ఉంటుంది అంటూ సలహాలు ఇచ్చే వాన్నే ఒకసారి వాటి గురించి నేను మాట్లాడతాను అంటూ తనతో మాట్లాడటం మరిచిపోయే వాణ్ని. ప్రస్తుతం హీరోస్ నుంచి కమెడియన్ గా చేస్తున్న సునీల్ కి కొంచెం పర్సనల్ అటెన్షన్ ఎక్కువగా ఉండాలని ఫీలయ్యాడు అది నా దగ్గర నుంచి లేకపోయేసరికి మేనేజర్ గా తీసేసారని నేను భావిస్తున్నాను. కానీ సునీల్ ఇప్పటి వరకు సరైన కారణం చెప్పలేదు అని ఓ ఇంటర్వ్యూలో రాజారవీంద్ర తెలియజేశారు.

నూతన్ ప్రసాద్ అన్నీ పాత్రలు చెయ్యలేడు.. కోట షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది అద్భుతమైన నటనను కనబరిచేవారు. ఈ విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినటువంటి రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్ వీరందరూ ఒకప్పుడు ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో గొప్ప మంచి పేరును సంపాదించుకున్నారు. వీరందరూ స్టార్ సెలబ్రిటీగా ఉన్న సమయంలో కోట శ్రీనివాసరావు అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సమయంలోనే వీరందరికీ కూడా ఎంతో సరదాగా సెట్లో గడిపేవారు.

ఈ క్రమంలోనే కోట శ్రీనివాస్ రావు నూతన్ ప్రసాద్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. అప్పట్లో ఎన్టీఆర్ పై వ్యతిరేకంగా కోట శ్రీనివాసరావు మండలాధీశుడు అనే చిత్రంలో నటించారు. అదేవిధంగా కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ పాత్రలో నూతన్ ప్రసాద్ చంద్రబాబు నాయుడు పాత్రలో నా పిలుపే ప్రభంజనం అనే సినిమాలో చేశారు.అయితే అందులో చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ ఆ తర్వాత ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తెగ భయపడేవారని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు.

అలాగే నూతన ప్రసాద్ అన్ని పాత్రలలోనూ చెయ్యలేరని, కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే అతడు బాగా సెట్ అవుతాడని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒకరోజు ఈవీవీ సత్యనారాయణ గారు తన దగ్గరకు వచ్చి మీరు అన్ని పాత్రలలో ఇట్టే ఇమిడి పోతారు. అది ఎలా సాధ్యం అంటూ తనని అడిగినట్లు కోట శ్రీనివాస్ రావు చెప్పారు. అసలు ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, అంతా ఆ భగవంతుడు దయఅని, గుమ్మడి కాయంత తెలివి మాత్రమే కాదు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాస్ రావు అని అప్పట్లో చాలామంది తన గురించి మాట్లాడేవారని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు తెలియజేశారు.