Tag Archives: lock down

లాక్ డౌన్ దెబ్బ.. విమానంలోనే పెళ్లి.. వీడియో చూస్తే షాకే!

ఇదివరకు పెళ్లిళ్లు కళ్యాణ మండపంలో, లేదా ఏదైనా దేవుని సన్నిధిలో ఇంటిదగ్గర అంగరంగ వైభవంగా జరగడం చూసే ఉంటాం. కానీ కరోనా వైరస్ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఆడంబరంగా చేసుకుని పెళ్లిళ్లు కనుమరుగైపోయాయి. కరోనా దెబ్బకు ఏదో పెళ్లితంతు కార్యక్రమాన్ని ముగిస్తున్నారు. మరికొందరు కరోనా వార్డులలో సైతం పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో తాజాగా మధురైకి చెందిన ఓ జంట ఏకంగా గాల్లో పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మధురైకి చెందిన రాకేష్, దక్షిణల వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం కోసం ఇరు కుటుంబ సభ్యులు ఎన్నో ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి మంగళవారం జరగాల్సి ఉండగా వీరు కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి మదురైకి విమానంలో పయనమయ్యారు. ఈ క్రమంలోనే తమిళనాడులో కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల మంగళవారం నుంచి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలోని పెళ్లి కోసం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు.ఇక చేసేదేమీ లేక ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో విమానంలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా కరోనా దెబ్బకు నెలలో కాకుండా నింగిలో పెళ్లి చేసుకున్న ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో, పెద్దల ఆశీర్వాదంతో ఈ పెళ్లి తంతు జరిగింది.

బ్యాంక్ టైమింగ్స్ మారాయ్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రతరంగా మారడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే మరికొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ కార్యకలాపాలు పనివేళలు కూడా మార్చారు. ఇలాంటి తరుణంలోనే బ్యాంకు సిబ్బంది కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనివేళలో మార్పులు చేస్తూ, కేవలం 50 శాతం మంది సిబ్బందితోనే విధులు నిర్వర్తించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం తెలిపింది.

తాజాగా తెలంగాణలో కూడా పది రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో బ్యాంకు పనివేళలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించిన బ్యాంకులు నేటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేయనున్నాయి. ఇప్పటికే బ్యాంకులలో కేవలం 50 శాతం మంది సిబ్బందితోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

తెలంగాణలో పది రోజులు లాక్ డౌన్ విధిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో సాధారణ కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి తెలిపింది. ఈ క్రమంలోనే బ్యాంకు పనివేళలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంకులకు మారిన పని వేళలో భాగంగా కేవలం అత్యవసరమైన సేవలను మాత్రమే అందించాలని, మిగతా ఎటువంటి సేవలైన ఆన్లైన్ ద్వారా నిర్వర్తించాలని బ్యాంకర్ల సమితి ఆదేశాలు జారీ చేసింది.ఇకపోతే ఏటీఎంలలో డబ్బులు భర్తీ చేసే వారు బ్యాంకు వచ్చే సమయంలో తప్పనిసరిగా వారి గుర్తింపు కార్డును తెచ్చుకోవాలనే సూచనలను కూడా తెలిపింది.

లాక్ డౌన్ గ్యారెంటీ.. రెండు వారాలకు సరిపడ సరుకులు తెచ్చుకోండి!

కరోనా రెండవ దశ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈసారి కూడా తప్పదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో లాక్ డౌన్ అమలు చేయడం ఎంతో శ్రేయస్కరం అని భావిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించారు.

ఈ క్రమంలోనే మరోసారి లాక్ డౌన్ విధిస్తే తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే గ్రహించిన వలస కూలీలు పెద్ద ఎత్తున సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. ఒకప్పుడు గ్రీన్ జోన్లుగా ఉండే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ప్రస్తుతం అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు జిల్లాలలో లాక్ డౌన్ విధించాలని అధికారులు అడుగులు వేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులలో లాక్ డౌన్ విధించాల లేదా అనే అంశంపై అక్కడి ప్రజలను ప్రశ్నిస్తే అందుకు వారు లాక్ డౌన్ విధించాలనే చెబుతున్నారు. 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తే ఈ మహమ్మారిని కొంత వరకు కట్టడి చేయవచ్చని అక్కడి ప్రజల ఉద్దేశం. ఈ క్రమంలోనే రెండు వారాలకు సరిపడానిత్యావసర వస్తువులను తాము ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికే ఈ రెండు జిల్లాలలో కంటెంట్మెంట్ జోన్లను విధించగా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా యువత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఇటువంటి సమయంలోనే లాక్ డౌన్ అమలు చేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై గతంలో మాదిరిగా శిక్షించాలని, ప్రాణం కన్నా లాక్ డౌన్ మిన్న అంటూ అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.

లాక్ డౌన్ వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి భారీ నష్టం.. ఎన్ని కోట్లంటే..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. కరోనా విజృంభణ వల్ల ఏపీలో నెలల తరబడి బస్సులు డిపోలకే పరిమితం కావాల్సి వచ్చింది.

ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి 2,528 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. సాధారణంగా బస్సులు నడవాల్సిన దూరంతో పోలిస్తే 78.84 కోట్ల కిలోమీటర్లు తక్కువగా నడిచాయని చెప్పారు. బస్సు సర్వీసులు మొదలైన తరువాత పరిమిత సంఖ్యలో మాత్రమే 50 శాతం సీటింగ్ కెపాసిటీతో బస్సులు నడిచాయి. కరోనా సమయంలో సైతం ఆర్టీసీ సర్వీసులను అందించింది.

కరోనా విజృంభణ వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన 5,586 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కాగా వీరిలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది నవంబర్ నెల నాటికి ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయం 3,350 కోట్లు కాగా ఈ ఏడాది 827 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ జనవరి నెల నుంచి పల్లెలకు సైతం సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 3,607 ప్రత్యేక బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ నడపనుంది.

అయితే ఈ బస్సులకు సాధారణంగా వసూలు చేసే ఛార్జీలతో పోలిస్తే 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 45 వేల కిలోమీటర్ల మేర బస్సు సర్వీసులను పెంచాలని భావిస్తోంది. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో 5,200 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోనుందని సమాచారం.

కరోనా సెకండ్ వేవ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గడంతో పాటు పలు జిల్లాల్లో 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ గురించి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడంతో కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ యూరప్ లో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని చెప్పారు. ఢిల్లీలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. అమెరికా సైతం కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు.

ఫ్రాన్స్, లండన్‌ వైరస్ వ్యాప్తి వల్ల షట్ డౌన్ లో ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ అమలవుతోందని అన్నారు. సెకండ్ వేవ్ రాకుండా కరోనా నిబంధనలు పాటించి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాలేజీలు, పాఠశాలలు తెరుస్తున్నామని కలెక్టర్లు కరోనా వైరస్ మళ్లీ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

గతంతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని.. అయితే సెకండ్ వేవ్ ఇతర దేశాల్లో వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు సైతం కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

మోదీ సర్కార్ ఆదేశాలు.. అక్కడ నవంబర్ 30 వరకు లాక్ డౌన్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. కేంద్ర హోం శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అమలవుతున్నా నిబంధనలను మాత్రం కేంద్రం సడలించింది.

ఎలాంటి అనుమతులు అవసరం లేకుం్దానే సరుకు రవాణా చేసుకోవచ్చని, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కూడా ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. గత నెల 30వ తేదీన వాణిజ్య సంస్థల రీ ఓపెనింగ్ విశయంలో అన్ లాక్ 5 నిబంధనలు విడుదలయ్యాయని.. అవే నిబంధనలను నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నామని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఫలితంగా కంటైన్మెంట్ జోన్ల ప్రజలు మరో నెల రోజుల పాటు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడక తప్పదు.

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు మాత్రమే ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి. గతంతో పోలిస్తే కేంద్రం కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను భారీగా తగ్గించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలోనే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అధికారులు లాక్ డౌన్ అమలవుతున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర హోం శాఖ తెలిపింది.

మరోఅవైపు దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా బలహీనపడుతోంది. గత నెలలో నమోదైన కేసులతో పోలిస్తే కేసుల సంఖ్య సగానికి తగ్గింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి పరిస్థితి కొనసాగితే కరోనా వ్యాక్సిన్ లేకుండానే మహమ్మారిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.