Tag Archives: media

Sudheer Varma: డైరెక్టర్ సుధీర్ వర్మను చంపేసిన మీడియా… చూసుకోవాలి కదా అంటూ ఏకిపారేస్తున్న నేటిజన్స్!

Sudheer Varma: కుందనపు బొమ్మ సినిమా హీరో సుధీర్ వర్మ నిన్న వైజాగ్ లో కొన్ని కారణాలవల్ల ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదంగా మారింది.ఇలా సుధీర్ వర్మ మరణ వార్త తెలుసుకున్నటువంటి కొందరు ఈయనకు సంతాపం ప్రకటించారు. అయితే సుధీర్ వర్మ మరణ వార్త సోషల్ మీడియాలోనూ అలాగే కొన్ని న్యూస్ ఛానల్లో మరోలా స్పెండ్ అవుతుంది.

తెలుగు ఇండస్ట్రీలో హీరో సుధీర్ వర్మ మాత్రమే కాకుండా డైరెక్టర్ సుధీర్ వర్మ కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.అయితే హీరో సుధీర్ వర్మ మరణించడంతో కొన్ని జాతీయ మీడియా సంస్థలు డైరెక్టర్ సుధీర్ వర్మ మరణించారని పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నారు.

ఇలా డైరెక్టర్ సుధీర్ వర్మ చనిపోయారంటూ ఫొటోలను మార్చి ఏకంగా కొన్ని కథనాలు వెలబడటంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఆశ్చర్యపోయారు.అయితే ఈ తప్పును గ్రహించిన కొన్ని మీడియా సంస్థలు తమ తప్పును సరిదిద్దుకోగా మరికొందరు మాత్రం రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు.

Sudheer Varma: రావణాసుర సినిమా పనులతో బిజీగా ఉన్న సుధీర్ వర్మ…

ఈ విధంగా ఒక వ్యక్తి గురించి వార్త రాసేటప్పుడు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకొని కథనాలు ప్రచురించాలని పొరపాటున తప్పు జరిగిన వెంటనే ఆ తప్పు సరిదిద్దుకోకుండా ఇలాగే తప్పుడు కథనాలను ప్రచారం చేయడం ఏంటి…. పేర్లు ఒకటైన మనుషులు వేరే కదా కాస్త చూసుకోవాలి కదా అంటూ నేటిజన్స్ సదురు మీడియా సంస్థలపై మండిపడుతున్నారు. ఇక డైరెక్టర్ సుధీర్ వర్మ ప్రస్తుతం రావణాసుర సినిమా పనులతో బిజీగా ఉన్నారు.

Prabhas: ప్రభాస్ కోసం రాత్రంతా పడిగాపులు కాసిన మీడియా.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్?

Prabhas: పాన్ ఇండియా స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎక్కడున్నారు అంటే అక్కడ అభిమానులు మీడియా పెద్ద ఎత్తున ఆయనతో ఫోటోలు దిగడం కోసం, ఆయన ఫోటోలు కోసం ఎగబాకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఓం రౌత్ ఘనంగా పార్టీ ఇవ్వడంతో ఆది పురుష్ చిత్ర బృందం మొత్తం ఆ దర్శకుడి ఇంటికి క్యూ కట్టారు.

the-media-has-been-waiting-total-night-for-prabhas-by-request

ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు అందరూ కూడా డైరెక్టర్ ఓం రౌత్ ఇంటికి వెళ్ళారని తెలియడంతో మీడియా ఒక్కసారిగా అక్కడ వాలిపోయింది. రాత్రంతా ఎంతో ఘనంగా పార్టీ చేసుకున్న అనంతరం మరుసటి రోజు ఉదయం ప్రభాస్ అక్కడినుంచి వెళ్ళడానికి బయటికి రాగా మీడియా ఒక్కసారిగా ప్రభాస్ ను చుట్టుముట్టింది.

the-media-has-been-waiting-total-night-for-prabhas-by-request

ప్రభాస్ అక్కడి నుంచి కారు వద్దకు వెళ్తుండగా మీడియా సర్ మీ కోసం రాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము.. ప్లీజ్ అంటూ అతనిని రిక్వెస్ట్ చేయడంతో డార్లింగ్ మీడియా అభ్యర్థన మేరకు కాసేపు అక్కడ నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అనంతరం ప్రభాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా ప్రభాస్ ఫోటో కోసం మీడియా రాత్రంతా ఇలా వెయిట్ చేయడం చూస్తుంటేనే అతనికి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

ఘనంగా పార్టీ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్…

ఇకపోతే ప్రభాస్ కృతిసనన్ హీరోహీరోయిన్లుగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మిగిలిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పార్టీ ఇవ్వడంతో చిత్రబృందం మొత్తం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే సినిమాలతో బిజీగా ఉన్నారు..

Vijay Devarakonda: చెత్త వార్తలు అంటూ మీడియాపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనా?

Vijay Devarakonda: తెలుగుతో పాటు కన్నడలోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ,బాలీవుడ్ లో కూడా లీడింగ్ స్టార్ హీరోయిన్ సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది నటి రష్మిక మందన. ఇకపోతే పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Vijay Devarakonda: చెత్త వార్తలు అంటూ మీడియాపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనా?

ఆ తర్వాత అర్జున్‌ రెడ్డితో యూత్‌కు బాగా దగ్గరైన విజయ్.. రష్మికతో కలిసి జంటగా నటించిన గీత గోవిందం సినిమా వీరిని ఎక్కడికో తీసుకెళ్లిందని చెప్పవచ్చు. అప్పట్లో వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి అభిమానులు కథలు కథలుగా చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి డియర్ కామ్రేడ్‌ అంతగా ఆడకపోయినా ఓ లెవల్లో యూత్‌ను ఆకట్టున్నట్టు చెప్పవచ్చు.

Vijay Devarakonda: చెత్త వార్తలు అంటూ మీడియాపై రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ..కారణం అదేనా?

ఇకపోతే వీరిద్దరూ ఇంత సాన్నిహత్యంగా ఉండడం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రూమర్స్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని పోస్ట్‌లు, మీమ్స్ వైరల్‌ అవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ వీరిద్దరిలో ఏ ఒక్కరూ కూడా తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు గానీ, లేదా లేనట్టు గానీ ప్రకటించలేదు. అంతే కాకుండా విజయ్‌కి సంబంధించిన పర్సనల్ పార్టీలలోనూ రష్మిక ఉండడం, తన మదర్‌తో షాపింగ్‌ చేయడం లాంటివన్నీ కూడా ఆ వార్తలు నిజమనేటట్టు గానే నిరూపిస్తున్నాయి.

పెళ్లి వార్తలపై స్పందించిన విజయ్…


ఇదిలా ఉండగా ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన మరో వార్త వైరల్‌గా మారింది. విజయ్, రష్మిక తొందర్లోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్‌ మరియు కొన్ని వార్తా వెబ్‌సెట్లు ప్రకటించాయి. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే విజయ్ దేవరకొండ ఇలాంటి వార్తలు వ్యాపింపజేసే వారికి తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. తనపై వచ్చే వార్తలపై అగ్రెసివ్‌గా రియాక్టవడం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం వారిద్దరి పెళ్లిపై ఇప్పటి వరకూ స్పందించని విజయ్ మాత్రం తొలిసారిగా స్పందించి, బూతు పురాణం మొదలెట్టారు. ఎప్పటిలాగే తనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు అన్నీ నాన్సెన్స్ అని తిడుతూ, ఓ బూతు పదాన్ని జత చేస్తూ విజయ్ ట్వీట్‌ చేశారు. ఇలా తనపై వార్తలన్నీ అసత్యాలని తనకు నచ్చిన స్టైల్‌లో సమాధానమిచ్చారు విజయ్.

Samantha: మీడియాకు అడ్డంగా దొరికిపోయిన సమంత..! రెమ్యూనరేషన్ విషయంలో ఇంత ఘోరమా..!

Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం నుంచి సమంత వరసపెట్టి సినిమాలు చేస్తోంది. విడాకులుకు ముందు అక్కినేని ఫ్యామిలీగా, నాగార్జున కోడలిగా, నాగచైతన్య భార్యగా సమంతకు కొన్ని పరిమితులు ఉండేవి. ఎప్పుడైతే విడాకుల వచ్చాయో అప్పటి నుంచి సమంత ఫ్రీ బర్డ్ అయిపోయింది.

Samantha: మీడియాకు అడ్డంగా దొరికిపోయిన సమంత..! రెమ్యూనరేషన్ విషయంలో ఇంత ఘోరమా..!

వరసగా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇటీవల పుష్ప సినిమాలో ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా’ పాటతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ కు కమ్ బ్యాక్ అయింది సమంత. ఈ పాట కూడా పెద్ద హిట్ సాధించింది. సమంత అందాలు, దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ తో పాట సూపర్ డూపర్ హిట్ అయింది.

Samantha: మీడియాకు అడ్డంగా దొరికిపోయిన సమంత..! రెమ్యూనరేషన్ విషయంలో ఇంత ఘోరమా..!

యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సంపాదించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా సినిమా ‘ శాకుంతలం’ చేస్తోంది. ‘యశోద’ అనే మరో సినిమా చేస్తోంది. మరికొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.


రూ.1.5 కోట్లు తీసుకొని.. రూ.5 కోట్లు అని చెబుతావా..?

ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం దాదాపుగా నిర్మాతలు సమంతకు రూ. 1.5 కోట్లు ముట్టచెప్పారు. పూర్తి సినిమా చేసిన హీరోయిన్లకు కూడా ప్రస్తుత 2-3 కోట్లే ఇస్తున్నారు. అలాంటిది కేవలం ఓ ఐటెం సాంగ్ కోసం ఇంత మొత్తం ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. ఇదిలా సమంతకు ఇచ్చిన మొత్తం టాలీవుడ్ కు పెద్దదే అయినా… బాలీవుడ్ కు మాత్రం చిన్నదే అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఓ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఐటెం సాంగ్ కు రూ. 5 కోట్లు తీసుకున్నట్లు చెప్పింది. ఈ మాత్రం తీసుకున్నా అని చెబితే రానున్న రోజుల్లో బాలీవుడ్ లో ఇంతకు మించి అడగొచ్చని సమంత లెక్కలేసుకున్నట్లు ఉంది. అయితే ఇది తెలిసిన బాలీవుడ్ సినీ ప్రముఖులు.. పుష్ప నిర్మాతలను ఆరా తీయగా.. మేం రూ. 1.5 కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో బాలీవుడ్ మీడియా సమంతను ట్రోల్ చేయడం ప్రారంభించింది. బిల్డప్ కు పోయి అడ్డంగా బుక్కయింది సమంత

ప్రమాదం తర్వాత మొదటి సారి మీడియా ముందుకు సాయిధరమ్ తేజ్..?

ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల వరకు చికిత్స పొందిన ధరమ్ తేజ్ కోలుకొని.. తన పుట్టిన రోజునే ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుంచి కూడా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.

తన ఆరోగ్యం గురించి తన ట్విట్టర్ ఖాతాలో అప్ డేట్ ఇచ్చేవాడు. ఇలా తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించేవారు. అయితే తాజాగా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. తేజ్ కి సంబంధించిన ఒకటి రెండు ఫొటోలో బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను తన కుటుంబసభ్యులే విడుదల చేశారు.

అతడు హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాకు సంబంధించి శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని జీ5 సొంతం చేసుకుంది. దీనిలో భాగంగానే జీ5 టీమ్ రిప‌బ్లిక్ ప్రీమియ‌ర్స్‌కి సంబంధించిన ఓ ప్రెస్‌మీట్ ను నిర్వహించనుంది. ఈ మీట్ లో చిత్ర‌బృందం పాల్గొన‌బోతోంది. ఆ మీట్ లోనే తేజ్ పాల్గొననున్నారు.
ప్రమాదం తర్వాత రిపబ్లిక్ సినిమాకు సంబంధించి ఎలాంటి ఈవెంట్లకు హాజరు కాలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతడు పాల్గొనలేదు.

మొదటి సారి మీడియా ముందుకు వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమాదం గురించి మీడియాలో వివిధ రకాల కథానాలు వచ్చినప్పటికీ దేనికి వాస్తవ రూపం లేదు. ప్రమాదానికి గురైన తేజ్ చెబితేనే అది ఎలా జరిగిందో తెలియనుంది. అతడి నోటి వెంట.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను చెబుతారో లేదో చూడాలి.

మీడియాను కాకులని సంబోధిస్తూ మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన యాంకర్ ఝాన్సీ..!

సాధారణంగా మీడియా ప్రతి విషయాన్ని ఎంతో ఫోకస్ చేస్తుంది. అది రాజకీయాలలో నైనా లేదా సినిమా పరిశ్రమలో నైనా మీడియా మరింత ఎక్కువగా ఆతృతను చూపిస్తూ.. చిత్ర పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీల విషయాలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ మధ్య కాలంలో మీడియా ఫోకస్ మరింత ఎక్కువైంది అంటూ పలువురు సెలబ్రిటీలు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ ఝాన్సీ తాజాగా మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి సెలబ్రెటీకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని వారి వ్యక్తిగత విషయాలు వారి ఇంటికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తారు. కానీ మీడియా ఫోకస్ వల్ల ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఝాన్సీ మీడియాపై విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆమె తెలియజేస్తూ అనగనగా ఒక ఎద్దు ఎద్దు కాలిలో పుండు… ఆ పుండులో పురుగులు..ఎద్దు తో కబుర్లు చెప్పాల్సిన కాకి ఆ పుండును పొడుస్తూ పొడుస్తూ పురుగులు తింటుంది. ఆ ఎద్దు రెచ్చిపోయి బుసలు కొడుతూ కాకుల గోల పెంచి మైకులు పట్టి మరీ మా మురికిని అందరి ఇంటిలోకి చేరవేస్తున్నాయి. ఇండస్ట్రీలో పెళ్లి జరిగిన విడాకులు జరిగిన ఎన్నికలు జరిగిన కాకుల హడావిడి చేస్తున్నారంటూ మీడియాను కాకులతో పోలుస్తూ యాంకర్ ఝాన్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత విడాకుల విషయం పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు, మా ఎన్నికల గురించి ఝాన్సీ పరోక్షంగా మీడియాపై ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్.. ఎందుకంటే?

సాధారణంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ పై మీడియా ఫోకస్ పెట్టడం సర్వసాధారణం. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల విషయాలలో మీడియా మరింత ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే గత నెల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుంచి ప్రస్తుతం మా ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ మీడియా ఎక్కువ ఆత్రుతను కనబర్చిందని చెప్పవచ్చు.

ఇక సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో టీవీ9 రిపోర్టర్ ఏకంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో గొడవ పడిన సంగతి అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో పవన్ వ్యాఖ్యలను కూడా హైలైట్ చేసింది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా టీవీ9 ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఎన్నికలలో ఓటు వేయడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవిని మీడియా చుట్టుముట్టింది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి టీవీ9 ఉద్దేశిస్తూ.. మీకు ఇప్పుడు మంచి మ్యాటర్ దొరికింది కదా అని వెటకారంగా మాట్లాడారు. ఎప్పుడు మీడియా పై నోరుజారిన మెగాస్టార్ చిరంజీవి టీవీ9 పై ఇలా మాట్లాడారు అంటే సాయి ధరమ్ తేజ్ విషయంలో మీడియా చేసిన పనికి మెగా కుటుంబం చాలా ఫీల్ అయ్యారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా నిన్న ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నటి హేమ శివబాలాజీని కొరికిన సంఘటన వైరల్ అయింది.ఈ సంఘటనను కూడా టీవీ9 ఎక్స్క్లూజివ్ వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక మా ఎన్నికలు కూడా అయిపోవడంతో ఓడిపోయిన క్యాండిడేట్ లతో డిబేట్ లు పెట్టి ఈ విషయాన్ని మరింత పెద్దది చేసి జనాలను ఎంటర్టైన్ చేయడానికి మీడియా సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇరుపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి_ వెంకయ్య నాయుడు

రాజ్యసభలో జరిగిన దాడి గురించి చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపీలపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాక గత సంఘటన దృష్టిలో పెట్టుకొని చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను ప్రివిలేజ్ కమిటీ అప్పగిస్తారని తెలుస్తోంది. మీడియా ప్రతినిధులకు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు.

కాగా ఉపరాష్ట్రపతిగా అధికార పార్టీతో పాటు విపక్షాల సమానంగా చూస్తానని.. రెండు కూడా తన కళ్ళ లాంటివని వెంకయ్య నాయుడు తెలిపారు. అంతేకాక సభా సజావుగా జరగడానికి ఇరు పక్షాలు సమిష్టి బాధ్యత వ్యవహరించాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.

మూడు ఛానెళ్లకు జగన్ సర్కార్ షాక్.. అసెంబ్లీలోకి నో ఎంట్రీ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అధికారంలో వున్న వైసీపీ ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అయితే జగన్ సర్కార్ అసెంబ్లీలోకి రావడానికి కొన్ని మీడియా ఛానెళ్లకు అనుమతులు ఇవ్వలేదు.

జగన్ సర్కార్ అనుమతులు ఇవ్వని మూడు మీడియా ఛానెళ్లు చంద్రబాబు అనుకూల మీడియా ఛానెళ్లు కావడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ తమ్మినేని సీతారంకు ఇప్పటికే ఆంక్షలు విధించిన మీడియా ఛానెళ్లకు అనుమతులు ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాశారు. ఈ లేఖ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

టీడీపీ ప్రజాస్వామ్యంలో పధాన భాగస్వామి మీడియా అని అలాంటి మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని చెబుతోంది. జగన్ సర్కార్ గతంలో జీవో నంబర్ 2430 ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే మీడియా ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని.. ఈ జీవోపై రాష్ట్ర మీడియాతో జాతీయ మీడియాలో సైతం వ్యతిరేకత వచ్చిందని తెలిపింది. చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం దారుణమైన చర్యగా టీడీపీ అభివర్ణించింది.

అధికార పక్షం, ప్రతిపక్షం వ్యవహారశైలిని మీడియా నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేస్తుందని.. మీడియాపై ఆంక్షలను ప్రజాస్వామిక విలువలను అణగదొక్కటంగా భావిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.