Tag Archives: pan india movies

Rajamouli: పాన్ ఇండియా సినిమాలకే కాదు.. ఆస్కార్ కి కూడా దారి చూపించిన రాజమౌళి… సరిహద్దులు చెరిపేసిన జక్కన్న!

Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ బుల్లితెరకు మాత్రమే పరిచయమయ్యారు.ఇలా బుల్లితెర డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి ఈయన ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి రాజమౌళి తన తదుపరి సినిమా సినిమాకు సరికొత్త మెరుగులు దిద్దుతూ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరుపొందారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ సాధించినటువంటి రాజమౌళి తన సినిమాలకు భారీ బడ్జెట్ ఖర్చు చేయడంతో ఎందరో రాజమౌళికి పిచ్చి పట్టిందా ఇంత డబ్బు ఖర్చు చేస్తే సినిమాని ఎలా మార్కెట్ చేయాలి అంటూ మాట్లాడారు. అయితే ఈ మాటలకు తాను వెనుకడుగు వేయలేదు. ఇలా తన సినిమా సినిమాకు కొత్తదనం చూపెడుతూ ఎంతో పేరు పొందిన ఈయన బాహుబలి సినిమాతో ఏకంగా తెలుగు సినిమా సత్తా ఏంటో పాన్ ఇండియా స్థాయిలో చాటి చెప్పారు.

ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో మరి ఎంతో మంది దర్శకులు రాజమౌళి బాటలోనే తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తూ వచ్చారు. ఇలా బాహుబలి సినిమాతో తన స్థాయి పెరిగిందని రాజమౌళి ఆగిపోకుండా మరొక అడుగు ముందుకు వేస్తూ ఇద్దరు ఒకే జనరేషన్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేసి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి ఎంతో మంచి ఆదరణ తీసుకోవచ్చేలా ప్రయత్నం చేశారు.

Rajamouli: అంతర్జాతీయ వేదికపై తెలుగోడి సత్తా…

ఇలా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ వంటి గొప్ప అవార్డు అందుకోవడం వెనుక రాజమౌళి కృషి ఎంతో ఉందని చెప్పాలి. ఇలా పాన్ ఇండియా సినిమాల వరకే మాత్రమే ఆగిపోకుండా ఆస్కార్ అవార్డులకు కూడా దారి చూపించిన ఘనత జక్కన్నకే చెల్లింది. అయితే ఈ సినిమా కోసం ఈయన భారీగా ఖర్చు చేశారంటూ కూడా వార్తలు వచ్చాయి. నిజమే ఈయన సినిమా నామినేషన్ లో నిలవడంతో ఆ సినిమాని మరింత ప్రేక్షకులకు చేరువుగా తీసుకెళ్లడం కోసం ప్రమోషన్లను నిర్వహించారు. ఇలా ఎక్కడ వెనుకడుగు వేయకుండా సరిహద్దులను చెరిపేస్తూ అంతర్జాతీయ వేదికపై ఒక తెలుగు సినిమా ఆస్కార్ అందుకోవడానికి జక్కన్న కారణమయ్యారని చెప్పాలి.

Chiranjeevi: చిరంజీవి చేసిన ఆ తప్పు వల్లే అక్కడ స్టార్ కాలేకపోయాడు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న లోకనాయకుడు, లెజండరీ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత నాలుగు సంవత్సరాల నుంచి పలు కారణాల వల్ల కమల్ హాసన్ వెండితెరకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అభిమానులు కమల్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు.ఈ క్రమంలోనే గత నాలుగు సంవత్సరాల నుంచి అభిమానులలో ఉన్న వెలితిని విక్రమ్ సినిమా ద్వారా భర్తీ చేశారు.

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీ పలు భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు కానీ మేము ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలలో నటించామని ఈ సందర్భంగా కమల్ హాసన్ వెల్లడించారు. నేను మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా పలు పాన్ ఇండియా సినిమాలలో నటించారు.తెలుగు సినిమాని తెలుగు హీరోలను తమిళ ప్రేక్షకులు ఆదరించే వారు కాదని అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం ఉండేది.అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.

చిరంజీవిని తమిళంలో ఇష్టపడే వారు ఉన్నారు…

చిరంజీవినీ ఎక్కువగా మెచ్చిన తెలుగు ఆడియన్స్ కి ఎక్కువగా కమిట్ అవ్వడం వల్ల ఆయన తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ తమిళంలో సినిమాలను చేయాలనుకోవడం లేదు. ఇలా మెగాస్టార్ చిరంజీవి తమిళంలో సినిమాలు చేయకపోవడమే ఆయన చేసిన చిన్న తప్పు లేదంటే మెగాస్టార్ చిరంజీవిని కూడా తమిళంలో అమితంగా ఇష్టపడే వారు ఉన్నారు అంటూ కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samantha: అలా జరిగితే.. సమంత బాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయం..?

Samantha: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో కొంత ఫేమ్ ఉన్న స్టార్లు అంతా ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను తీయాలనే ఆశతో .. కోరికతో ఉన్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఇప్పటికే పుష్పతో ఎంట్రీ ఇవ్వగా.. న్యాచురల్ స్టార్ నానీ కూడా శ్యామ్ సింగరాయ్ తో ఆ కోరిక తీరింది.

ఇక దీనికి ముఖ్యంగా నాంది పలికిన ప్రభాస్.. అతడి ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నాడు. ఇక హారోయిన్ల విషయానికి వస్తే.. రకుల్, రష్మిక బాలీవుడ్ లో పాగా వేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో దాదాపు ఆరు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. రష్మికా చేతిలో కూడా ప్రస్తుతం రెండు నుంచి మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.

ఇలా హీరోయిన్లు కూడా క్యూ కట్టేస్తున్నారు. వీరిద్దరి కంటే మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత కాస్త వెనుకపడిందనే చెప్పాలి. వీళ్లకంటే ముందుగానే గతంలో అవకాశాలు వచ్చాయి.. కానీ ఫ్యామిలీకి భయపడో మరేదైనా కారణం అయి ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టలేదు.

పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్..

విడాకుల తర్వాత సమంత పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె వెబ్ సిరీస్ ల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇప్పటికే ఆమె సిటాడెల్ సిరీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది హాలీవుడ్ సిరీస్ రీమేక్. సిటాడెల్ హిందీతో పాటు రీజనల్ భాషల్లో కూడా విడుదల కానుంది.ఇలా ఆమె బాలీవుడ్ ప్రముఖులతో కూడా టచ్ లో ఉంటుంది. ఆమె ప్రస్తుతం శాకుంతలంలో నటించగా.. అది హిందీలో కూడా విడుదల కానుంది. తర్వాత యశోద సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా సమంత బాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయం. ఇలా ఆమె విడాకుల ప్రస్తావన తర్వాత కెరీర్ లో దూసుకుపోతోంది.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

Tollywood-Bollywood: సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్లు ఇకపై తమ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వెళ్లిన పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

బాహుబలి1,2 సినిమా ద్వారా టాలీవుడ్ సత్తాను బాలీవుడ్ కు రుచిచూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ కలెక్షన్లు మరోసారి కొల్లగొట్టాలని చూస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. 

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

ఇప్పటికే అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే అక్కడ రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ ఊపుతో సుకుమార్ పుష్ప-2ను తెరకెక్కించనున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా బాలీవుడ్ పై తన ముద్ర వేయాలనుకుంటున్నారు. 

మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు హారికా అండ్ హాసిని క్రియేషన్ ప్లాన్ చేస్తోంది. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా ఓ సినిమా రానుంది. దీనికన్నా ముందుగానే మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. వీళ్లే కాకుండా తమిళ డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియా మూవీలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ చిత్ర సీమ నుంచి కేజీఎఫ్ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టింది. హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ప్యాన్ ఇండియా రేంజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా త్వరలో బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో విడుదల కానుంది.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

అప్పట్లో కథే హీరో. రచయిత ఓ కథను రాసి దాన్ని నిర్మాతకు చెప్పిన తర్వాత గానీ ఈ కథకు ఏ హీరో అయితే సూటవుతాడు.. ఏ దర్శకుడైతే ఇలాంటి కథను బాగా డీల్ చేస్తాడు అని నిర్ణయాలు తీసుకునేవారు. అప్పటి పెద్ద నిర్మాణ సంస్థలు అయిన ఏవీఎం, వాహిని స్టూడియోస్ ఇలాగే సినిమాలను నిర్మించేవి. ఆ తర్వాత మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు – ఆయన తనయుడు డి సురేశ్ బాబు లాంటి వారు కూడా ముందు కథకే ప్రాధాన్యం ఇచ్చారు..ఇస్తున్నారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి వారు పెద్ద స్టార్ అని నిర్మాతలు సినిమా తీసేవారు కాదు.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

కానీ ఇప్పుడు చాలా వరకు విధి విధానాలు మారిపోయాయి. నిర్మాత ముందు హీరోను ఒప్పించుకొని డేట్ లాక్ చేసుకుంటున్నారు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. ఎప్పటికో ఒకప్పటికి తగ్గ కథ తీసుకొని దర్శకుడు, రచయిత వస్తే దాన్ని ఆ హీరోకు చెప్పి నచ్చితే సినిమా చేస్తున్నారు. అంతేకాదు.. అప్పట్లో కథ అనుకున్నాక.. కాస్టింగ్, లొకేషన్స్ ఫైనల్ చేసుకొని ఓ పరిమిత బడ్జెట్ పెట్టుకునేవారు. దాదాపు అప్పటి నిర్మాతలందరూ చాలా కఠినంగా వ్యవహరించేవారు కాబట్టే అనుకున్న బడ్జెట్‌లో సినిమాలు తీయగలిగారు.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

కానీ, ఇప్పుడు సినిమాకు అనుకున్న బడ్జెట్ అదుపు తప్పడం చాలా కామన్  అయిపోయింది. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తేనే గొప్ప అనే భావన చాలా మందిలో వచ్చేసింది. ఓ హీరో డేట్స్ లాక్ చేసుకున్నాక..అప్పటి వరకు ఆ హీరో చేసిన సినిమాల జోనర్ ఏంటీ.. ఇప్పుడు ఏ కథ అల్లి ఆ హీరోతో సినిమాను చేయాలి అని కథలు రాసుకుంటున్నారు. అందుకే కొన్ని సినిమాల విషయంలో బడ్జెట్ కంట్రోల్ తప్పుతుంది కూడా. ఇప్పుడు హీరో..అతని మార్కెట్‌ను బట్టి సినిమా నిర్మాణం ఉంటోంది.

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

అలాగే భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. ప్రభాస్ హీరో అంటే ఇప్పుడు ఖచ్చితంగా 200 కోట్ల పైనే నిర్మాణ వ్యయం అవుతోంది. ఎందుకు అంటే ఆయన పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి తరువాత 100 కోట్ల లోపు నిర్మిస్తున్న ఒక్క సినిమా కూడా ప్రభాస్ చేస్తున్న వాటిలో లేదని అందరికీ తెలిసిందే. ప్రభాస్ మార్కెట్ అండ్ పాన్ ఇండియన్ క్రేజ్ చూసి అందరూ అదే ఫాలో అవుతూ వాటిని రీచ్ అవ్వాలని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ సాధించాలని తాపత్రయపడుతున్నారు.  

ఒకప్పుడు కథ నిర్మాతతో డబ్బు ఖర్చు పెట్టిస్తే ఇప్పుడు మాత్రం హీరో పెట్టిస్తున్నాడు..!

ఈ కారణంతోనే పాన్ ఇండియన్ సినిమా అని హీరో ఎవరైనా బడ్జెట్ 200 కోట్ల వరకు పెట్టి పలు భాషలలో రిలీజ్  చేస్తున్నారు. ఇందులో దర్శక, హీరోలకు లాభాలు వస్తే వచ్చే వాటా ఎక్కువే. కానీ ఇలా ఎన్ని సినిమాలు లాభాలు తెచ్చిపెడతాయో గ్యారెంటీ లేదు. ఏమాత్రం కథ ఉండని సినిమాలకు పెద్ద హీరో, భారీ బడ్జెట్ ఖర్చు చేసి నష్ఠాల ఊబిలో కూరుకుపోతున్న నిర్మాతలు ఉన్నారు. పాన్ ఇండియన్ సినిమాను 100 కోట్ల లోపు పూర్తి చేసే దర్శకుడు ఎప్పుడు తయారవుతాడో చెప్పడం కష్ఠమే. అవసరమైతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా చేస్తున్నారు గానీ, ఎక్కడెక్కడ బడ్జెట్ తగ్గించి సినిమా పూర్తి చేయాలి అనే ఆలోచన మాత్రం చాలామంది చేయడం లేదని చెప్పక తప్పదు. 

Pan India Movies: పాన్ ఇండియా అనే పదం తెలుగులోనే పుట్టింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన కరణ్ జోహార్!

Pan India Movies: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన పాన్ ఇండియా చిత్రాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన చేసిన సంచలన వ్యాఖ్యలు మన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలియజేస్తున్నాయి.

Pan India Movies: పాన్ ఇండియా అనే పదం తెలుగులోనే పుట్టింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన కరణ్ జోహార్!

ముఖ్యంగా తెలుగు సినిమాల గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసినంత కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా చేయలేకపోతున్నాయి.తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ జరగకపోయినప్పటికీ హిందీలో ఈ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిందని తెలిపారు.

Pan India Movies: పాన్ ఇండియా అనే పదం తెలుగులోనే పుట్టింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన కరణ్ జోహార్!

ఉత్తరాది రాష్ట్రాలలో అల్లుఅర్జున్ గురించి పెద్దగా తెలియక పోయినప్పటికీ ఆయన నటించిన సినిమా మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది ఇదే కదా పాన్ ఇండియా క్రేజ్ అంటే.. అసలు ఈ పాన్ ఇండియా అనే పదం పుట్టింది తెలుగులో అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

రాజమౌళి బాహుబలి సినిమాతోనే పాన్ ఇండియా పుట్టింది:

తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం మొట్టమొదటిసారిగా పలు భాషలలో విడుదల అయ్యి పాన్ ఇండియా అనే పదానికి అర్థం తీసుకు వచ్చింది. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ చేస్తుందని.. తొలిరోజు ఒక్కటే హిందీ వెర్షన్ 30 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నాడు. ఈ విధంగా కరణ్ జోహార్ దక్షిణాది సినీ ఇండస్ట్రీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈయనపై ఉత్తరాది నుంచి ట్రోలింగ్ ప్రారంభమైపోయింది.

కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తారక్.. ఎందుకంటే?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు అందరూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా తమ మార్కెట్ ను పెంచుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. ఈ క్రమంలోనే హీరోలు పాన్ ఇండియా సినిమాలను పెంచుకుంటున్నారు. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న కారణంగా తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొనిబాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి హీరోలు బాలీవుడ్ కి పరిచయమైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కూడా వీరి కోవలోకే చేరబోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి పరిచయం కానున్నారు.

ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారట. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి చెర్రీతో పాటు తారక్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇటీవల తారక్ చేతికి గాయం అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ ఆ సమయాన్ని ఇలా సద్వినియోగం చేయాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే కొరటాల సినిమాను కూడా కొద్దిగా వెనక్కి జరిపినట్లు సమాచారం.

ఆ సినిమాలపై దృష్టి పెడతానన్న మహేష్.. రాజమౌళితో కూడా..!

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా మహేశ్ బాబుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతా గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.

ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుందని టాక్. తాజాగా మహేశ్ బాబు ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో అతడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను భవిష్యత్ లో నిర్మించబోయే ప్రతీ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తానెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తానని, బాలీవుడ్ లో ఏంట్రీ ఇవ్వ‌డానికి రాజమౌళితో పాన్ ఇండియా చేయ‌డానికి సిద్దంగా ఉన్నాను. ఈ చిత్రం అన్ని భాషల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాని తీస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ సినిమా కోసం వర్క్ చేస్తారా? లేక చిన్న సినిమా ఒకటి తీస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. సరైన కథ దొరికితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తానని చెప్పాడు. ఇటీవల రాజమౌళి కూడా మహేష్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా మా నాన్న గారితో రాయించట్లేదు. వేరే రైటర్ తో రాయిస్తున్నాను అని తెలిపారు. సర్కారు వారి పాట తర్వాత మహేశ్ త్రివిక్రమ్ తో తీస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై మాత్రం క్లారిటీ లేదు.