Tag Archives: police

Soundarya Rajinikanth: రజనీకాంత్ చిన్న కుమార్తె ఇంట్లో చోరీ… పోలీసులను ఆశ్రయించిన సౌందర్య రజనీకాంత్!

Soundarya Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలోనే ఈమె పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఇంట్లో తన ఎస్ యువి కారు తాళాలు కనిపించకపోవడంతో ఈమె పోలీసులను ఆశ్రయించారు.

ఈమె ఒక ప్రైవేట్ కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లి వచ్చేలోపు తన కారు తాళాలు కనిపించడం లేదు అంటూ సౌందర్య రజనీకాంత్ చెన్నైలోని తేనాం పేట పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు అయితే ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మొన్నేమో అక్క ఇంట్లో నేడేమో చెల్లెలు ఇంట్లో దొంగతనాలు జరగడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గత కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు నగలు దొంగతనానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె తన ఇంటి పనిమనిషి అలాగే డ్రైవర్ పై సందేహాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

Soundarya Rajinikanth: కనిపించని కారు తాళాలు..


ఐశ్వర్య రజనీకాంత్ తమతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ చాలీ చాలని జీతాలు ఇవ్వటం వల్లే తాను దొంగతనానికి పాల్పడ్డానంటూ ఆమె పనిమనిషి ఈశ్వరి పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు. ఇలా ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో జరిగినటువంటి దొంగతనం మర్చిపోకముందే తిరిగి సౌందర్య రజనీకాంత్ ఇంట్లో కూడా దొంగతనం జరగడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Singer Sunitha: సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. ప్రాణహాని ఉందని పోలిసులకు ఫిర్యాదు..?

Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత గురించి తెలియని వారంటూ ఉండరు. తన మధురమైన గానంతో పాటలు పాడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సునీత ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా సునీత భర్త వీరపనేని రామకృష్ణకు ఇటీవల ఫోన్ ద్వారా బెదిరింపులు ఎదురయ్యాయని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.

రామకృష్ణ తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత మొదటి భర్తకు విడాకులు ఇచ్చి చాలా కాలం పిల్లలతో కలిసి జీవించింది. అయితే ఇటీవల పిల్లల సహకారంతో రామ్ వీరపనేనిని రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. అయితే సునీత ఇలా ఈ వయసులో రెండవ వివాహం చేసుకోవడంతో ఇప్పటికీ ఆమె గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

మొదట్లో ఈ విమర్శల గురించి స్పందిస్తూ ఎమోషనల్ సునీత ఇప్పుడు లోకం తీరు తెలిసి ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వీరపనేని రామకృష్ణ కి గుర్తు తెలియని వ్యక్తి తరచూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను నిర్మాతల మండలి సభ్యుడినని, ముఖ్యమైన విషయాలు చర్చించాలని తరచూ ఫోన్ చేసి విసగిస్తున్నారట.

2

Singer Sunitha: బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రామ్..


లక్ష్మణ్ ఎవరో తనకు తెలియకపోవటంతో రామకృష్ణ అతని ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. దీంతో లక్ష్మణ్ అనే వ్యక్తి ఇతర నెంబర్ నుండి ఫోన్ చేసి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో రామకృష్ణ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Kota Srinivarao: నేను బ్రతికే ఉన్నాను… తన మరణ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన కోటా శ్రీనివాసరావు!

Kota Srinivarao: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచం నలుమూలలో జరిగిన విషయాలు అన్ని నిమిషాలలోనే అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగపడే విషయాలు షేర్ చేయటమే కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి అనేక దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియా వల్ల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించాడు. అలాగే విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలో తాజాగా కోటా శ్రీనివాసరావు మరణించాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ వార్త తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. దీంతో అనేకమంది సెలబ్రిటీలు ఆయన ఇంటికి ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన తన మరణ వార్త గురించి తెలుసుకున్న కోటా శ్రీనివాసరావు స్పందిస్తూ..” తన మరణం గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని వాటిని ఎవరు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Kota Srinivarao: తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించకండి…


ఉదయం 7, 7:30 గంటల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.నేనే ఒక 50 కాల్స్ వరకు మాట్లాడాను.. ఇది నిజమే అనుకుని ఓ పది మంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం వచ్చారు. ఇలాంటి అవాస్తవాలను మీరే అరికట్టాలని పోలీసులకు చెప్పాను. జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి.. మనిషి ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయకండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీలో ప్రశాంతత నెలకొంది.

Kamal Kamaraju: పోలిసులకు అడ్డంగా దొరికిపోయిన టాలివుడ్ నటుడు కమల్ కామరాజు.. వైరల్ అవుతున్న పోస్ట్..!

Kamal Kamaraju: ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు అందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆవకాయ బిర్యాని సినిమాలో హీరోగా నటించిన కమల్ కామరాజు ఆ తర్వాత చత్రపతి, గోదావరి కాటమరాయుడు వంటి సినిమాలలో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల కమల్ కామరాజు చేసిన పని వల్ల పోలిసులకు అడ్డంగా దొరికిపోయాడు.

సాధారణంగా పోలీసులకు సామాన్య ప్రజలు సెలబ్రిటీలు అనే వ్యత్యాసం ఉండదు తప్పు చేస్తే వారు ఎవరైనా శిక్షిస్తారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ పోలీసులకు చిక్కి వార్తల్లో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల నటుడు కమల్ కామరాజు కూడా చట్ట వ్యతిరేకమైన పనిచేసి పోలీసులకు దొరికిపోయాడు. అయితే తాను పోలీసులకు దొరికిపోయిన విషయాన్ని కామరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాజాగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

తాజాగా కమల్ కామరాజు ట్వీట్ చేస్తూ…అందరికీ చెప్తాను. ఇవాళ ఉదయమే బైక్ మీద వెళుతూ 60లో వెళ్లాల్సిన నేను రోడ్డు ఖాళీగా ఉందని ఆత్రుత ఆపుకోలేక 80లో వెళ్లాను. ఇలా ఉదయమే నా బైక్ స్పీడు పెంచి పోలిసులకు దొరికిపోయాను. ఇంత ఉదయమే నేను స్పీడుగా వెళ్తున్నా కూడా పోలీసులు పట్టుకుని నాకు చలాన్‌ పంపినందుకు హైదరాబాద్‌ పోలీసులకు ధన్య వాదాలు అంటూ ట్వీట్ చేశాడు.

Kamal Kamaraju: చలనా వేసిన ట్రాఫిక్ పోలీసులు..

ఈ మేరకు రోడ్డు మీద స్పీడుగా వెళ్తున్న తన బైక్ ఫొటోను కూడా పోస్టు చేశాడు. మొత్తానికి చట్ట నియమాలను అతిక్రమించి అతివేగంగా వెళ్ళటం వల్ల ఇలా పోలీసులకు చిక్కి చలానా కట్టాడు. ఈయనే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పోలీసులకు చిక్కి జరిమానా కట్టడమే కాకుండా అరెస్టు కూడా అయ్యారు.

Bigg Boss6: దొంగలతో కలిసి పోలీసులను గెలిపిస్తానని శపథం చేసిన రేవంత్.. మరి గెలిపించారా?

Bigg Boss6: బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం మూడో వారం ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈ వారంలో భాగంగా కెప్టెన్సీ టెస్ట్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులను దొంగ పోలీసులుగా విడదీస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ టాస్క్ కొనసాగుతుండగా దొంగల టీంలో ఏమాత్రం యూనిటీ లేకపోవడంతో వాళ్ల మధ్య వాళ్లకే గొడవలు జరుగుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా గీతుతో రేవంత్ కుదుర్చుకున్న డీల్ పై అనుమానం వచ్చిన దొంగలు రేవంత్ దాచుకున్న బొమ్మలను వాళ్లే దొంగలిస్తారు.

ఈ విధంగా రేవంత్ బొమ్మలను దొంగతనం చేయడానికి శ్రీ సత్య కూడా సహాయం చేస్తుంది అయితే తాను దాచుకున్న బొమ్మలు దొంగలే దొంగతనం చేశారని తెలియడంతో రేవంత్ ఆశ్చర్యపోతాడు. ఇక ఈ విషయం తెలిసిన రేవంత్ ఎలాగైనా పోలీసులను గెలిపించాలని శపథం చేస్తాడు.

Bigg Boss6: నేను చాలా కన్నింగ్ అని ఒప్పుకున్న రేవంత్..

నిద్రపోదాం అనుకున్నాను కానీ నిద్ర పోను నేను వాళ్ళ కన్నా కన్నింగ్ ఇలా దాచుకున్న బొమ్మలను దొంగతనం చేయడానికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి అంటూ ఈయన మండిపడ్డారు. అంతేకాకుండా రేవంత్ తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను పోలీసులకు ఇవ్వడానికి సిద్ధపడతారు. దీంతో సుదీప మాట్లాడుతూ నీ వరకు వచ్చేసరికి గేమ్ వచ్చిందా.నువ్వు టీ మొత్తాన్ని డిస్క్ క్వాలిఫై చేస్తావా అంటూ తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయితే రేవంత్ మాత్రం తన అనుకున్నదే చేయాలని మొండి పట్టు పడ్డారు. ఈయన నిజంగానే దొంగల టీం తో కలిసి పోలీసులను గెలిపించారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Renuka Chowdary: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. ఏకంగా ఎస్సై చొక్కా పట్టుకుని నిలదీసిన రేణుకా చౌదరి?

Renuka Chowdary: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై గత కొద్దిరోజుల నుంచి ఈడీ అధికారులు తీవ్రస్థాయిలో ఆయనను విచారణ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై ఈడీ అధికారులు వేధింపులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలి వచ్చారు.

Renuka Chowdary: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. ఏకంగా ఎస్సై చొక్కా పట్టుకుని నిలదీసిన రేణుకా చౌదరి?

విషయం తెలిసిన పోలీసులు వెంటనే అప్రమత్తమై కాంగ్రెస్ నేతలను రాజ్ భవన్ వద్దకు వెళ్లకుండా పెద్దఎత్తున పోలీసులు మోహరించి వీరిని రాజ్ భవన్ వెళ్లకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల మధ్య కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక కొందరు కాంగ్రెస్ నేతలు పోలీసుల పట్ల ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు.ఇలా కొంత సమయం పాటు పోలీసులకు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడటంతో ఆ స్థానికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Renuka Chowdary: రెచ్చిపోయిన మాజీ మంత్రి.. ఏకంగా ఎస్సై చొక్కా పట్టుకుని నిలదీసిన రేణుకా చౌదరి?

కాంగ్రెస్ నేతలపై చర్యలకు సిద్ధమైన పోలీసులు

ఇకపోతే ఈ ఉద్రిక్తతలో భాగంగా కాంగ్రెస్ నేతలు డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న బట్టి విక్రమార్క , మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టుకుని నిలదీశారు. దీంతో పోలీసులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

SV Krishna Reddy: డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు… పోలీసుల పై కామెంట్స్ చేసిన డైరెక్టర్!

SV Krishna Reddy: గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కార్లను తనిఖీ చేస్తూ కార్లకు బ్లాక్ ఫిలిమ్స్ ఉన్న వాటిని తొలగించి కార్లకు జరిమానా విధిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు దర్శకులకు ఈ విధంగా పోలీసులు జరిమానా విధించిన విషయం మనకు తెలిసిందే.

SV Krishna Reddy: డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు… పోలీసుల పై కామెంట్స్ చేసిన డైరెక్టర్!

తాజాగా మరొక డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి కారుకు కూడా పోలీసులు జరిమానా విధించారు. మంగళవారం సుల్తాన్ బజార్ బ్యంక్‌ స్ట్రీట్‌ రోడ్డులో పోలీసులు తనిఖీలలో భాగంగా అటువైపుగా వెళ్తున్నటువంటి ఎస్.వి.కృష్ణారెడ్డి కారును ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన పోలీసులు ఆయన కారును ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉండడంతో కారుకు ఫైన్ వేసారు.

SV Krishna Reddy: డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డికి జరిమానా విధించిన పోలీసులు… పోలీసుల పై కామెంట్స్ చేసిన డైరెక్టర్!

ఇలా పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తూ ఉండగా ఎస్ వి కృష్ణారెడ్డి పోలీసుల పట్ల స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.పోలీసులు నెంబర్ ప్లేట్ తప్పు ఉందని చెప్పడంతో ఎస్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తప్పు తనదేనని తప్పకుండా నెంబర్ ప్లేట్ సరి చేసుకుంటానని పోలీసులకు వివరణ ఇచ్చారు.

పోలీసులపై అభినందనలు…

పోలీసులు మండుటెండను కూడా లెక్కచేయకుండా విధిగా తమ విధులను నిర్వర్తిస్తూ ఉండటంతో ఎస్.వి.కృష్ణారెడ్డి పోలీసులపై అభినందనల వర్షం కురిపించారు. ఇలా పోలీసులను డైరెక్టర్ అభినందించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.ఇక పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఎస్.వి.కృష్ణారెడ్డి ప్రస్తుతం బిగ్ బాస్ సోహైల్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.

Telangana News: పోలీసు వారి పాట.. రూ.51.74 లక్షలు జమ!

Telangana News: ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నసమయంలో దాదాపు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. లేదంటే.. బ్యాంక్ లో పర్సనల్ లోన్ తీసుకుంటారు. అవి రెండు కూడా సాధ్యం కాకపోతే వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు అంటే.. బంగారం, వాహనాలను తనఖా పెట్టేసి అవసరానికి డబ్బులను తెచ్చుకుంటారు.

Telangana News: పోలీసు వారి పాట.. రూ.51.74 లక్షలు జమ!

అయితే ఆ డబ్బులను తీర్చలేని క్రమంలో రెండు మూడు సార్లు నోటీసులు పంపించి.. తర్వాత న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చి వేలం వేస్తుంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇలాంటి వేలం పాటలను నిర్వహిస్తుంటారు.

Telangana News: పోలీసు వారి పాట.. రూ.51.74 లక్షలు జమ!

కానీ అవి తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్లిన బాపతి కాదు.. వాటిని నిబంధనలు ఉల్లంఘించిన వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు. ఆ వాహనాలకు పలు కేసుల్లో పోలీసులు సీజ్ చేస్తుంటారు. అయితే తాజాగా గోషామహల్‌ స్టేడియంలో పేరుకుపోయిన 600 వాహనాలకు హైదరాబాద్‌ సిటీ పోలీసులు మంగళవారం వేలం నిర్వహించారు.

సర్కాస్ కు మాత్రమే ఉపయోగపడే..


నిబంధనలను అనుసరించి తిరిగి తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించినా యజమానులు ముందుకు రాలేదు. అయితే వాటిని ఆ పోలీసులు వేలం నిర్వహించారు. రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 550 మంది బిడ్డర్లు పాల్గొనగా. వాటిలో.. 567 వాహనాలు వేలం నిర్వహించారు. వాటిలో 544 ద్విచక్రవాహనాలు ఉండగా.. 21 త్రిచక్రవాహనాలు.. 2 కార్లు ఉన్నాయి. వీటి ద్వారా రూ. 44.28 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇవి కేవలం సర్కాస్ కు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. వినియోగించేందుకు అనుకూలంగా ఉన్న 33 వాహనాలలో 32 ద్విచక్రవాహనాలు ఉండగా .. ఓ కారు ఉందన్నారు. వీటి ద్వారా రూ. 7.46లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం వేలం ద్వారా రూ. 51.74 లక్షలను ఖజానాలో జమ చేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ వేలం నిష్పక్షపాతంగా జరిగేలా సీపీ పర్యవేక్షించారు.

Hyderabad Traffic: నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనా..? భారీ మార్పుల దిశగా అధికారులు..!

Hyderabad Traffic: హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచస్థాయి మహా నగరంగా భాగ్యనగరం రూపుదిద్దుకుంటున్న సమయంలో ట్రాఫిక్ సమస్యలను పూర్తిగా తీరేలా మార్పలు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.

Hyderabad Traffic: నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనా..? భారీ మార్పుల దిశగా అధికారులు..!

ఇటీవల కాలంలో హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దీనికి తగ్గట్లుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్యలు తీరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

Hyderabad Traffic: నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లేనా..? భారీ మార్పుల దిశగా అధికారులు..!

హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీగా మార్పులు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలని చర్యలు తీసుకుంటున్నారు.


ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాదిరిగానే ..

ఈ క్రమంలోనే రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్ లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నగరంలో రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, లంగర్ హౌజ్, నానాల్ నగర్, రవీంద్రభారతి, కంట్రోల్ రూపం పాటు పలు జంక్షన్లలో మార్పలు చేయనున్నట్లు రంగనాథ్ తెలిపారు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కు వాహనాల్నింటిని నేరుగా పంజాగుట్టకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఫిలిం నగర్ నుంచి రోడ్ నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలన్నింటినీ.. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫ్రీ లెఫ్ట్ ఇచ్చి మళ్లించనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ విధానం సక్సెస్ అయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మాదిరిగానే అన్నింటిని తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోకుండా చర్యలు తీసుకోనున్నట్లు రంగనాథ్ తెలిపారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ తో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని ఆయన అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్ లోని రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహించబోతున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.

Karate Kalyani: నాపై కక్షకట్టారు..నన్ను చంపాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి..!

Karate Kalyani: కరాటే కళ్యాణి పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేని పేరు. ఈమధ్య వివాదాలతో కూడా ఫేమస్ అవుతోంది కరాటే కళ్యాణి. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది కరాటే కళ్యాణి. గత సీజన్ లో బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది.

Karate Kalyani: నాపై కక్షకట్టారు..నన్ను చంపాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి..!

ఆ సమయంలో కూడా వివాదాలకు కేరాఫ్ గా మారింది. బిగ్ బాస్ టీవీ షో పై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇటు సినిమాతో తన కెరీర్ నిర్మించుకుంటూనే.. రాజకీయంగా యాక్టివ్ గా ఉంటుంది కరాటే కళ్యాణి.

Karate Kalyani: నాపై కక్షకట్టారు..నన్ను చంపాలని చూస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి..!

బీజేపీ పార్టీలో ప్రస్తుతం ఈమె కొనసాగుతోంది. అయితే గతంలో హిందూ దేవతలు, దేవుళ్లపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో గట్టిగానే రియాక్ట్ అయింది కళ్యాణి. బీజేపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది.

ప్రాణభయం ఉంది..రక్షణ కల్పించండి..

తాజాగా కరాటే కళ్యాణి మరో వివాదంలో కూడా ఇరుక్కుంది. ఓ కేసు విషయంలో తనను చంపాలని ప్రయత్నిస్తున్నారంటూ… పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. శనివారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ హత్య కేసులో సాక్ష్యాలు తారు మారు చేసిన ఘటనలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసిందని.. ఆ విషయాలు బయటపెడుతున్న క్రమంలో నాపై కక్ష కట్టి హతమార్చాలని చూస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. కరాటే కళ్యాణి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఈ విషయంపై విచారణ చేస్తామని వెల్లడించారు.