Tag Archives: pregnancy

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎలా ఉండాలి.. ఏం తీసుకోవాలంటే?

మహిళా గర్భం దాల్చడం అనేది ఒక వరం లాంటిది. అటువంటి సమయంలో ఏ ఫుడ్ తీసుకోవాలో చాలామందికి తెలవదు. ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే పుట్టే బేబి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆరోగ్య కరమైన గర్భాధారణ కోసం ప్రతీ మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని చిట్కాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.

గర్భం వచ్చిందా.. రాలేదా అనేది శరీరంలో వచ్చే మార్పుల ఆధారంగా తెలుసుకోవచ్చు. శరీరంలో మార్పులను గమినిస్తే వెంటనే ప్రెగ్నేన్సీ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ గా రిపోర్ట్ వస్తే.. అటు వంటి సమయంలో ఏం తినాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే వాటిని ఇంటి పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఇక్కడ చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

సాధారణంగా గర్భం దాల్చిన మహిళతో పొల్చితే సాధారణ మహిళలు బరువు తక్కువగా ఉంటారు. ప్రతీ నెల ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళ బరువు పెరుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు ఉండటం కూడా ప్రమాదకరమే. దాదాపు 10 నుంచి 12 కిలోల వరకు బరువు పెరిగితే పర్వాలేదు కానీ.. అంత కంటే ఎక్కువగా బరువు పెరిగితే ప్రమాదం అని నిపుణులు తెలుపుతున్నారు. ఇక తినే పండ్ల విషయంలో అధికంగా పోలిక్ యాసిడ్ ఉన్న పండ్లను తీసుకోవాలి.

నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు తెలుపుతున్నారు. రెండో నెలలో 350 అదనపు కేలరీలు.. మూడో నెలలో 450 అదనపు కేలరీలను తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు వ్యాయామం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేస్తుండాలి. పడుకునే సమయం దాదాపు 6 నుంచి 8 గంటల మధ్య ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగుతున్న శిశువు ఆరోగ్యకరంగా జన్మిస్తాడు.

శ్రీయ సరన్ ప్రెగ్నేన్సీపై.. మంచు లక్ష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

సాధారణంగా ప్రస్తుతం ఏ చిన్న సీక్రెట్ దాచాలని అనుకున్నా ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎంత దాచేసినా క్షణాల్లోనే పాకిపోతుంది.. వైరల్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో శ్రియ సరన్ మాత్రం చాలా పెద్ద సీక్రేట్ ఏడాది పాటు దాచేసింది.

కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడింది. ఉన్నట్లుండి ఈ రహస్యం బయటికి చెప్పిన తర్వాత ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. ఒక ఆడపిల్లకు జన్మనివ్వడం సంతోషకరమైన విషయమే కానీ.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటే బాగుండేదని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్‌ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఆమె ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు లక్ష్మి ప్రసన్న స్పందించింది. శ్రీయ పోస్టుకు ఆమె రీ ట్వీట్ చేసింది. శ్రీయకు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘‘ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడంలో నువ్వు తీసుకున్న సమయం విషయమై నిన్ను చూసి గర్వపడుతున్నా. ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం.

అది అందరికీ సమయానికి చెప్పాల్సిన అవసరం లేదు” అని తెలిపింది. ప్రస్తుతం మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని శ్రీయ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలారోజుల తర్వాత మళ్లీ RRR మూవీలో నటిస్తోంది.

తన బిడ్డకు తండ్రి ఎవరో రివీల్ చేసిన ఎంపీ, నటి నుస్రత్ జహాన్..!

తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, అందాల తార సుస్రత్ మొదటి నుంచి కూడా వివాదాలకు కేంద్రంగా మారుతుంది. బెంగాలీ ముస్లిం అయిన ఆమె నిఖిల్ జైన్ అనే బిజినెస్ మ్యాన్ ను 2018 లో ప్రేమించి, 2019లో హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. నుస్రత్ వివాహం అప్పట్లో సంచలనం రేపింది.

ఇక ఈమె లోక్ సభకు నుదుట బొట్టు పెట్టుకొని వెళ్లడంపై ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అప్పట్లో ఇది కూడా పెద్ద సంచలనంగా మారింది. ఇటీవల ఆమె తన భర్తతో దూరంగా ఉంటుంది.వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా విభేదాలు రావడంతో 2020 నవంబర్ నుంచి దూరంగా ఉంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. దాదాపు రెండు నెలల క్రితం ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కోల్ కత్తాలోని నియోతియాలో సిజేరియన్ ద్వారా ఆమె బిడ్డను కనింది.

ఆమె గర్భం దాల్చిన సమయంలో నుస్రత్ భర్త.. నిఖిల్ ఆమె ప్రెగ్నెన్సీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్లు సంచలనం స్పష్టించాయి. ఈ క్రమంలో.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఇక బిడ్డ పుట్టాక సైతం నుస్రత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.

అయినా ఆమె నోరు విప్పలేదు. తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన భాగస్వామి పేరుగా నటుడు యష్‌ దాస్‌ గుప్తా పేరును చేర్చడంతో విమర్శలకు తెరపడినట్లైంది. ఆమె భర్తతో విడిపోయిన దగ్గర నుంచి ఆమె తన స్నేహితుడు యష్ దాస్ గుప్తాతో సన్నిహితంగా ఉంటోంది. ఆమెకు బిడ్డ పుట్టగానే గుప్తా కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆమె కూడా ఓ కేక్ పై తన భర్త యష్.. తన బిడ్డకు తండ్రి కూడా అతడే అంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో భాగస్వామి ఎవరో అందరికీ తెలిసిపోయింది.

తల్లి కావడానికి సిద్ధమైన సమంత… కానీ అంతలోనే ఇలా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నీలిమ గుణ..!

సమంత నాగ చైతన్యల వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నామని చెప్పి దాదాపు వారం రోజులు కావస్తున్నా ఇప్పటికీ వీరిద్దరి విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం అంటూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు.ఈ క్రమంలోనే విడాకుల తర్వాత తన విడాకుల విషయమై నాగచైతన్య ఏమాత్రం స్పందించకపోగా సమంత మాత్రం తన విడాకుల విషయమై ఘాటుగా స్పందించారు.

విడాకులు తీసుకుని విడిపోవడంతో ప్రతి ఒక్కరు తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకుని అబార్షన్లు చేయించుకున్నాను అని మాట్లాడుతున్నారు. విడాకుల బాధ నుంచే తను బయట పడలేని స్థితిలో ఉన్న తనపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ మరింత బాధ పెట్టారని ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉండగా సమంత తల్లి కావడం గురించి యువ నిర్మాత నీలిమ గుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఈమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అసలు సమంత తల్లి కావడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని బయటపెట్టారు. శాకుంతలం సినిమా కోసం సమంతను సంప్రదిస్తే సమంత వారికి కొన్ని కండిషన్లు పెట్టిందని తెలియజేశారు.తాను సినిమాల్లో నటించాలనుకోవడం లేదని తను ప్రస్తుతం ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉండటం వల్ల పూర్తి సమయం కుటుంబంతో గడపాలని భావించినట్లు చెప్పారని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు.

అయితే పౌరాణిక చిత్రం కావడంతో ఈ సినిమాలో నటించడానికి సమంత కొన్ని కండిషను పెట్టింది. సినిమాను వీలైనంత వరకు ఆగస్టు చివరి కల్లా పూర్తి చేసేలా ఉంటేనే తను సినిమాకు ఒప్పుకుంటానని లేకపోతే ఈ సినిమాలో నటించలేననే ఆ విషయాన్ని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలోనే సమంత చెప్పిన విధంగానే ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేస్తామని మాట ఇవ్వడంతోనే సమంత శాకుంతలం సినిమాలో నటించిందని తెలిపింది.

సమంత తనకు పిల్లలు కావాలన్న ఉద్దేశంతోనే పిల్లలను కనడానికి సిద్ధమైందని అయితే అనుకోకుండా ఈ విధంగా విడాకులు తీసుకోవడంతో సమంత వైపు నుంచి ఏ మాత్రం తప్పులేదని తెలుస్తోంది. మరి సమంత నాగ చైతన్యల విడాకుల విషయంలో ఏం జరిగింది… తప్పు మొత్తం అక్కినేని కుటుంబానిదేనా.. వీరు విడాకులకు కారణం ఏమై ఉంటుంది అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. అబార్షన్ కు అనుమతించిన కోర్టు..

ఈ మధ్య కాలంలో దేశంలో ఉన్న కొన్ని కోర్టులు సంచలన తీర్పులను వెలువరిస్తున్నాయి. ఇటీవల పంజాబ్, హర్యానా హైకోర్టు మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని.. మైజర్ అయిన తర్వాత చట్టబద్దం చేసుకోవచ్చని.. అంతేకాకుండా మేజర్ అయిన తర్వాతనే విడాకులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులు బాటు ఉంటుందని తీర్పు చెప్పింది.

తాజాగా మరో సంచలన తీర్పు వెలుగులోకి వచ్చింది. అత్యాచార బాధితులకు ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది కేరళ హైకోర్టు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్ లో గర్భస్రావం చేయడం అనేది నేరంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో అది చట్టబద్దమైనదిగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే తొలగిస్తారు.

దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే కేరళ హైకోర్టు ఓ కేసులో ఇలా తీర్పు ఇచ్చింది.. ఆమె 8 నెలల గర్భవతి. గర్భస్రావం చేయాలని వైద్యులను సంప్రదించినప్పుడు.. వైద్యులు ఇలా చేయడం నేరం అంటూ చెబుతారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయిస్తుంది. ప్రెగ్నెన్సీ తీయించుకోవడం అనేది సదరు మహిళ సమ్మతి మాత్రమే అని.. దీనిపై తల్లిదండ్రులకు, భర్తకు ఎలాంటి అధికారం లేదని తెలిపింది.

18 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు గర్భవతి అయితే మాత్రం కచ్చితంగా తల్లిదండ్రుల సమ్మతి ఉండాల్సి ఉంటుంది. అయితే ఆమెకు అబార్షన్ చేసేందుకు కేరళ కోర్టు అంగీకరించింది. దానికి ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించింది. దీంతో బాధితులకు ఇది అనుకూలమనే చెప్పాలి. కానీ కొన్ని మార్గదర్శకాలను మాత్రం పాటించాలని సూచించారు.

గర్భిణీ స్త్రీలు చర్మ సమస్యలతో బాధపడుతున్నారా… ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

తల్లి కావడం అనేది మహిళలకు దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒక మహిళ తల్లి కాబోయే సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అనేక రకమైన చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తీవ్రంగా వెంటాడుతుంటాయి. ఈ క్రమంలోనే కొందరికి అలర్జీలు రావడం, చర్మంపై మచ్చలు ఏర్పడటం, మొటిమలు జుట్టురాలిపోవటం వంటి సమస్యలు అధికమవవుతాయి. ఈ విధంగా గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలకు ఈ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు.

గర్భధారణ సమయంలో మన చర్మంపై వచ్చే మొటిమలు మచ్చలను తొలగించుకోవాలంటే మన చర్మాన్ని శుభ్ర పరచుకోవడమేకాకుండా, ఎక్స్ పోలిట్ చేయడం ఎంతో అవసరం.రసాయన రహిత క్లేన్సర్‌ని ఉపయోగించి క్లీన్ చేయడం చర్మానికి చాలా అవసరం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అందంగా ఉంచుతుంది.

గర్భధారణ సమయంలో ఏర్పడే మచ్చలు, పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్కులను తగ్గించడం కోసం మాయిశ్చరైజర్ క్రీమ్స్ ను ఉపయోగించకుండా కేవలం కొబ్బరి నూనెను ఉపయోగించి మన చర్మాన్ని బాగా మసాజ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందటమే కాకుండా మన శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

క్లీనింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్ చేయలేనివారు ఫేస్ మాస్క్ వేసుకోనీ చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. బ్లాక్ బ్యాక్ ఫేస్ మాస్క్ వేసుకోవడం ద్వారా చర్మం పై మూసుకుపోయిన చెమట గ్రంధులను శుభ్రం చేయడానికి ఎంతో దోహదపడుతుంది. అదే విధంగా చర్మం పై ఏర్పడిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి చర్మం అందంగా కనిపించడానికి కారణం అవుతుంది. ఈ విధమైనటువంటి మూడు చిట్కాలను పాటించటం ద్వారా మహిళలు చర్మ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

గర్భవతులు కాఫీ తాగకూడదా… తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

ఉదయాన్నే వేడి వేడి కాఫీ తాగడం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే కాఫీ తాగే విషయంలో కొన్ని నియమాలు పాటించకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాఫీ గింజల్లో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు కెఫీన్ తగు మోతాదులో తీసుకుంటే అలసటను తొలగి నరాలను ఉత్తేజపరిచి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మోతాదుకు మించి తీసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మందగించి గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధ పడాల్సి వస్తుంది.

కావున రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. డయాబెటిస్, గుండె జబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులుతో బాధపడేవారు అసలు కాఫీ తాగాక పోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.కాఫీ ఎక్కువగా తాగేవారిలో ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలం పాటు షుగర్ వ్యాధితో బాధపడేవారు కాఫీని తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగి రక్త ప్రసరణ వ్యవస్థ సమతుల్యత కోల్పోతుంది.కాఫీని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్‌పై అధిక ప్రభావం పడుతుంది. ఇది ఒత్తిడిని మరింత ఎక్కువ చేస్తుంది. దాంతో రక్తప్రసరణ పై ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కాఫీ తాగడం మంచిది కాదు. కాఫీలో ఉండే కెఫిన్ శాతం మీ శరీరంలోని రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కడుపులో పెరుగుతున్న పిండానికి రక్తం సరఫరాలో అసమతుల్యత ఏర్పడి పిండం ఎదుగుదలలో అవరోధం ఏర్పడుతుంది అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రమాదకర రక్తపోటుతో బాధ పడేవారు కాఫీ ని ఎక్కువగా తాగడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ నియంత్రణ కోల్పోయి నరాలపై ఒత్తిడి పెరిగి గుండె పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

ఎవరైతే తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే కాఫీని తాకక పోవడమే మంచిది. ఈ సమస్యతో బాధపడేవారు కాఫీని తాగడం వల్ల కాఫీలో ఉన్నటువంటి కెఫిన్ ఆల్కలాయిడ్ మెదడు సంబంధిత నరాల పై తీవ్ర ప్రభావం చూపి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి కాఫీ అయినా, మరి ఏ ఇతర ఆహార పదార్థాల నైనా మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ జబ్బులకు చెక్..!

కరోనా మహమ్మారి ఎంతటి విలయతాండవాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే చాలామంది అంతకముందు ఎప్పుడూ లేనంతగా కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే పోషకవిలువలు ఉన్న ఆహార పదర్థాలను తినాలి.

అయితే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇవి మన శరీరం సొంతంగా ఈ ఆమ్లాలను ఉత్పత్తి చేయలేదు. కాబట్టి వీటిని ఆహారంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆమ్లాలు ఎక్కుగా.. ట్రౌట్, సార్డినెస్, సాల్మన్, మాకేరెల్, ట్యూనా,హెర్రింగ్, చేపలలతో పాటు.. అవిసె గింజలు, వాల్ నట్స్, చియా గింజలు, పిస్తా, నూనె గింజలను ఆహారంగా తరచూ తీసుకోవాలి. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా ముప్పును తగ్గించడంతో పాటు మరణించే ప్రమాదం నుంచి రక్షిస్తుంది.

ఇవి ఎక్కువగా ఉన్న వారిలో కరోనా సోకినా మరణం శాతం అనేది ఒమేగా -3 స్థాయిలు తక్కువగా ఉన్న వారిలో పోలిస్తే చాలా తక్కువ అని ప్రోస్టాగ్లాండిన్స్, ల్యూకోట్రియెన్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం తెలిసింది. ఇవి మన ఆహారంలో ఉండే విధంగా చూసుకుంటే.. గుండె జబ్బులు కూడా రాకుండా చూసుకోవచ్చు.

గర్భిణులకు ఇది పోషకాహారమైనది. వారికి ఇది ఒక దివ్యౌషధం లాంటిది. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల లోపం వల్ల నాడీ క్షీణత వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో ప్రకారం.. ప్రతీ రోజు ఒమేగా 3 ప్యాటీ ఆమ్లాలు తినడం వల్ల నాడీ సంబంధించి వ్యాధులు దరి చేరవని తేల్చింది. పలు సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి.

కోవిడ్‌ టీకా గర్భధారణపై ప్రభావం చూపుతుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

కరోనా నుంచి తమకు తాను రక్షించుకోవాలటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. అయితే టీకా తీసుకుంటే సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా.. గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా.. గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా.. వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే ఇవి నిజం కాదని.. వాటి వల్ల ఎలాంటి హాని కలగదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వల్ల గర్భధారణపై ఎలాంటి ప్రభావం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైందని చెప్పారు. ఆ అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో రెండు వేర్వేరు బృందాలకు టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు.

టీకా తీసుకుంటే.. స్వల్పకాలం రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న నివేదికలపై పరిశోధకులు దృష్టి సారించారు. సంతాన సౌభాగ్యంపై టీకాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని యేల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, గైనకాలజిస్టు డాక్టర్‌ మేరీ జేన్‌ మిన్‌కిన్‌ అన్నారు. కరోనా వ్యాక్సిన్ అనేది మామూలు వాళ్ల కంటే గర్భవతులు తీసుకోవడం చాలా మందచిదని.. ఎందుకంటే.. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భవతుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆక్సిజన్ అవసరం కూడా ఎక్కువగా ఏర్పడుతుందని
సీడీసీ నిపుణులు పేర్కొంటున్నారు.

అందుకే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ధైర్యంగా టీకాలు వేసుకోవచ్చిన ఇమోరి యూనివర్సిటీ గైనకాలజీ శాఖ చీఫ్‌, డాక్టర్‌ డెనిస్‌ జేమిసన్‌ స్పష్టం చేశారు. ఆలస్యం అసలు చేయవద్దని సూచించారు.

ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారా… అయితే ఈ మూలికలు వాడాల్సిందే!

మీకు పెళ్లయి సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడం లేదా… గర్భధారణ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే గర్భం కోసం ఎదురు చూసే వారు తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే. తాజాగా కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ మూలికలను తీసుకోవటం వల్ల తొందరగా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ మూలికలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం…

అశ్వగంధ: అశ్వగంధ అనే మూలికను ఆయుర్వేదంలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మూలిక ఫెర్టిలిటీ సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా పురుషులలో శృంగారపరమైన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. అలాగే మగవారిలో శుక్రకణాల ఉత్పత్తిని పెంచడంలో అశ్వగంధ కీలక పాత్ర పోషిస్తుంది.

శతావరి: శతావరి అనే మూలకం మహిళలకి ఒక రిప్రొడక్టివ్ టానిక్ అని చెప్పవచ్చు. దీనిలో ఫైటో ఈస్ట్రోజెన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ మూలకం మహిళలలో అధిక ఒత్తిడి ఆందోళనలు తగ్గించి గర్భందాల్చడానికి అవకాశాలను కల్పిస్తుంది. అదేవిధంగా ఫర్టిలిటీ సమస్యను కూడా దూరం చేస్తుంది. కనుక గర్భం దాల్చాలంటే మహిళలకు శతావరి ఒక అద్భుతమైన మూలిక అని చెప్పవచ్చు.

చైనీస్ హెర్బ్స్: ఫర్టిలిటీ సమస్యలు అధికంగా ఉండే మహిళలు చైనీస్ హిట్స్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. అయితే వీటిపై పూర్తిగా పరిశోధనలు జరగలేదు..