Tag Archives: suicide

Pallavi Prashanth: ఆ క్షణం సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రశాంత్.. అసలేం జరిగిందంటే?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి బిగ్ బాస్ విన్నర్ గా ఒక సెలబ్రిటీగా బయటకు వచ్చారు. రైతుబిడ్డగా వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు.

ఇలా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ తాను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని అయితే ఆ సమయంలో తన తల్లిదండ్రులు తనకు ఎంతో అండగా నిలబడ్డారనీ తెలియజేశారు.

తన స్నేహితులతో కలిసి తాను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను అని తెలిపారు. అయితే యూట్యూబ్ ఛానల్ కు చాలామంది సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత డబ్బులు రావడం కూడా మొదలయ్యాయి అయితే డబ్బు వచ్చే సమయంలో నా స్నేహితులు నన్ను ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా తొలగించారని ప్రశాంత్ తెలిపారు. ఇలా వాళ్లు నన్ను తొలగించడంతో ఎంతో బాధపడ్డానని తెలియజేశారు.

స్నేహితులు మోసం చేశారు..


ఆ సమయంలో తాను పూర్తిగా డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు కూడా చేశానని కాకపోతే నా తల్లి తండ్రులు తనకు ఎంతో అండగా నిలబడటమే కాకుండా తనకి కూడా ఒక మొబైల్ ఫోన్ కొనివ్వడంతో తాను కూడా వీడియోలు చేయడం మొదలు పెట్టాను అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ సూసైడ్ ఆలోచనల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bigg Boss: మరో రెండు వారాలు బిగ్ బాస్ ఉంటే అమర్ సూసైడ్ ఆలోచనలకు వచ్చేవా?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎవరు ఊహించని విధంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ద్వారా ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఎప్పటిలాగే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో ఏదో ఒక మాస్క్ వేసుకొని ఆట ఆడారు కానీ చాలా రియాలిటీగా ఆడినటువంటి కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమర్ అని మాత్రమే చెప్పాలి.

ఈయన తోటి కంటెస్టెంట్లతో సంతోషంగా ఉన్నప్పుడు అందరితోనూ సంతోషంగా ఉన్నాడు తనకు బాధ కలిగినప్పుడు బాధపడ్డారు. కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని ప్రదర్శించాడు. ఎక్కడ కూడా అరే నేను ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో అని కవర్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. తాను బయట ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉన్నారు. దీంతో బిగ్ బాస్ కంటెంట్ మొత్తం కూడా అమర్ చుట్టూనే తిరిగింది. ఇలా ఈ కార్యక్రమం మంచి హిట్ అవ్వడానికి అమర్ కూడా ప్రధాన కారణమని చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా అమర్ మంచితనాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని తనని పలు సందర్భాలలో ఎంతో ఇబ్బంది కూడా పెట్టారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక గత వారంలో భాగంగా పల్లవి ప్రశాంత్ అమర్ మధ్య జరిగినటువంటి పోరు అందరికీ తెలిసిందే. ఇక టైటిల్ రేస్ లో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ అమర్ పట్ల వ్యవహరించిన తీరు కారణంగా ఆయన ఓటింగ్ శాతం కూడా పడిపోయిందని చెప్పాలి.

మానసికంగా కృంగదీశారు..

శివాజీ బ్యాచ్ అమర్ పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు తనని మానసికంగా ఎంతగానో కృంగదీశారు దీంతో ఆయన ఎంతో స్ట్రెస్ కి కూడా గురి అయ్యి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా అమర్ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారని ముందు అనుకున్నట్టు బిగ్ బాస్ కార్యక్రమం మరొక రెండు వారాలు కనుక పొడిగించి ఉంటే ఈయనకు సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చేవని అంతలా ఆయనను మానసికంగా కృంగదీశారని పలువురు భావిస్తున్నారు.

Raj Tharun: రాజ్ తరుణ్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా అంటూ ఫోన్ చేశాడు.. మధునందన్ షాకింగ్ కామెంట్స్ !

Raj Tharun: ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధునందన్ అందరికీ సుపరిచితమే. తాజాగా మధునందన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రాజ్ తరుణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మధునందన్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించారు.

కరోనా లాక్ డౌన్ ముందు సమయంలో హీరో రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లారు. అయితే గోవా వెళ్లిన తర్వాత లాక్ డౌన్ విధించారు. అయితే రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవాలోనే చిక్కుకుపోయారు. ఇంట్లో రాజ్ తరుణ్ ఒక్కడే ఉన్నారు. ఆ సమయంలో కేవలం నిత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేది. ఇకపోతే లాక్ డౌన్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది అనుకుంటే సుమారు కొన్ని నెలల పాటు విధించారు.

ఇక రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవాలో ఉండిపోవడంతో రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు ఒక్కడినే ఉన్న ఇంకొక వారం ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటా అంటూ నాకు ఫోన్ చేశారు. అయితే ఒంటరిగా ఉండటం వల్ల బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో మాట్లాడారని మధునందన్ తెలిపారు.

ఇక ఆ సమయంలో నా ఫ్రెండ్ కి ఎసెన్సియల్ సర్వీస్ పాస్ ఉంది. దాంతో ప్రతి రోజు ఉదయం కారులో వెళ్లి కొన్ని రకాల పండ్లను ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ పోలీసులకు అందించే వాళ్ళం. అయితే రాజ్ తరుణ్ ఫోన్ చేయగానే ఏం చేయాలి అని ఆలోచించగా నా ఫ్రెండ్ మాదాపూర్ వెళ్తున్నానని ఫోన్ చేశాడు. ఎలాగో మాదాపూర్ వెళ్తున్నావ్ కదా అలాగే గండిపేట వెళ్లి ఈ అడ్రస్ లో నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను.

ఇంటికి వెళ్లానని చెప్పాడు…


అక్కడికి వెళ్ళాడు రాజ్ తరుణ్ వచ్చి కారులో కూర్చోగానే ఒకసారిగా నా ఫ్రెండ్ ఆశ్చర్యపోయారు. ఎలాగలాగో రాజ్ తరుణ్ ను మా ఇంటికి తీసుకు వచ్చాము. అయితే మా అపార్ట్మెంట్ లో సుమారు 16 మంది చిన్న పిల్లలు ఉండేవారు వారందరితో రోజు ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేశాడు. సుమారు మూడు వారాలపాటు రాజ్ తరుణ్ మా ఇంట్లోనే ఉన్నాడు. అనంతరం లాక్ డౌన్ లో కొంచెం రిలీఫ్ ఇచ్చిన తర్వాత రాజు తరుణ్ కి ఇంటికి వెళ్లాలని లేదని చెప్పారు. ఇక అప్పుడే తన ఫ్యామిలీ గోవా నుంచి రావడంతో రాజ్ తరుణ్ కూడా తన ఇంటికి వెళ్లి పోయారని ఈ సందర్భంగా మధునందన్ కరోనా సమయంలో రాజ్ తరుణ్ విషయంలో జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.

Actor Samuthirakani: చెప్పుల విషయంలో తీవ్ర అవమానం.. డబ్బులు లేని దౌర్భగ్య స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సముద్రఖని ?!

Actor Samuthirakani : తెలుగులో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని ప్రతీ సాంగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విలన్ గా నటించిన ‘సముద్రఖని’ తమిళ ఇండస్ట్రీలో సుపరిచితుడు. ఇటీవలే రాజమౌళీ దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా అయన అద్భుతమైన పాత్ర పోషించారు. అంతే కాదు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక లాంటి సినిమాలలో కీలకమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే అతడు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఓ ఘటన గురించి ఆయన చెప్పుతూ.. భావోద్వేగానికి గురయ్యారు.

అసలేం జరిగిందంటే.. మొదట అతడు సినిమాలో అవకాశాల కోసం చెన్నై వెళ్లాడట. అక్కడ అతడు ఓ రూంలో ఉండి సినిమాలో అవకాశం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓ రోజు అతడు ప్రయత్నంలో భాగంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అతడు ఆ సమయంలో కనీసం చెప్పులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకుండా ఉన్నాడు. అలా అతడు బయటకు వెళ్లే సమయంలో తన రూంలో ఉన్న స్నేహితుడి చెప్పులు వేసుకునేందుకు ప్రయత్నించగా.. దానికి సదరు వ్యక్తి ఒప్పుకోలేదు.

దీంతో ఎంతో భాదపడిన అతడు ఒట్టి కాళ్లతోనే నడుచుకుంటూ వెళ్లాడు. వెళ్లే మార్గంలోనే అతడు ఆ అవమానాన్ని తట్టుకోలేక చనిపోవాలని అనుకున్నారట. ఇలా అతడు వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి అతడికి లిఫ్ట్ ఇచ్చినట్లు తెలిపారు. జరిగిన విషయం అతడికి చెప్పాడు. విషయం తెలుసుకున్న అతడు సముద్రఖనికి ధైర్యం చెప్పి చనిపోవాలనే ఆలోచనను తప్పించాడట.

అతడిలో నింపిన ఆత్మవిశ్వాసంతోనే సముద్రఖని అవకాశాల కోసం ప్రత్నిస్తుండగా.. ఓ సినిమాలో అతడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చిందట. మొదట అతడు రూ.100 పారితోషకం తీసుకోగా.. అతడు ఆ డబ్బులతో మొదట చెప్పులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ అతడికి వచ్చే డబ్బులతో చాలా వరకు చెప్పులు, షూలను ఎక్కువగా కొనుగోలు చేస్తారట. ఇలా ఆ ఘటన గురించి చెబుతూ ఎన్నో కష్టాలను అనుభవించినట్లు చెప్పాడు.

Yediyurappa Granddaughter Dead: ఆత్మహత్య చేసుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మనవరాలు!

Yediyurappa Granddaughter Dead: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవరాలు సౌందర్య (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య మృతి చెందడంతో యడియూరప్ప ఇంటిలో విషాదం చోటు చేసుకుంది.

బెంగళూరులోని హైగ్రౌండ్స్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

సౌందర్య యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అని తెలుస్తోంది. పద్మావతి రాష్ట్ర రాజకీయాలలో లేకపోవటంవల్ల ఈమె గురించి పెద్దగా పరిచయం లేదు. సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు. ఈమె బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది.

వైద్యుడిని వివాహమాడిన సౌందర్య…

సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు కావడంతో ఆమె 2018లో తన తోటి డాక్టర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఇలా సౌందర్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈమె మరణించడంతో ఈమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బౌరింగ్ ఆస్పత్రికి చేరుకున్నారు.

నా ఆత్మహత్యకు కారణం కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి.. వైరల్ గా మారిన ట్వీట్.. ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. తమకు సాయం చేయాలంటూ వస్తున్న విజ్ఞప్తులపై వెంటనే స్పందిస్తూ వారికి సాయం అందిస్తుంటారు. అందుకే చాలామంది ఏ కష్టం వచ్చిన వెంటనే స్పందిస్తాడు మంత్రి. ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తాడు. అందుకే ఓ విద్యార్థి తన బాధను వెళ్లగక్కుతూ కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు. అందులో అతడు ఏం రాశాడో తెతుసా.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఈ రోజు కొన్ని గంటల క్రితం తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు.

జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,59,242 మంది పరీక్షకు హాజరవ్వగా 2,24,012 మంది మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం మీద పాసైన వారి పర్సెంటేజ్ 49 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. దీనిపై గణేష్ విద్యార్థి ట్విట్టర్ ఇలా పోస్టు చేశారు. ఇంటర్ లో నాలుగు సబ్జెక్టులతో ఫెయిల్ అయ్యాను. పరీక్ష రాసే సమయంలో ఏం రాసినా పాస్ చేస్తానని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఫెయిల్ చేశారని.. దానికి ఎంతో మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో అతడు ట్విట్టర్ లో ‘సార్.. ఏం రాసినా పాస్ చేస్తామని చెపి.. అందర్నీ ఫెయిల్ చేశారు. నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోబోతున్నా.. నా ఆత్మహత్యకు కారణం మంత్రి కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి అంటూ ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్ ను మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి చేశాడు చేశాడు. దాంతో పాటు తన మార్కుల షీట్ ను కూడా షేర్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

నమ్మించి.. స్నేహితుడి భార్యతో ప్రేమాయాణం సాగించాడు.. చివరకు ఇలా జరిగింది..

వివాహేతర సంబంధాలు ఎంత దూరం అయినా తీసుకెళ్తాయి. వాటి వల్ల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇలాంటి ఘటన ఒకటి మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను నిలదీసిన భర్త.. ఆ భార్య మాత్రం పట్టించుకోలేదు.

దీంతో మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ టీటీ నగర్ కు చెందిన గొల్లు బలన్(25), సుధా(22)లు భార్యాభర్తలు. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

అయితే గొల్లు బాలన్ కు తన స్నేహితుడు సాగర్ ఉండేవాడు. అతడు తరచూ తన ఇంటికి వచ్చి సుధాతో మాట్లాడుతుండేవాడు. ఫ్రేండే కదా అని అతడు అంతగా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు జరగరాని ఘటన జరిగిపోయింది. సాగర్, సుధాతో ప్రేమయాణం నడిపించాడు. ఇది గమనించిన గొల్లు బాలన్ భార్యను నిలదీశాడు. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు.

దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత రోజు భర్త సూసైడ్ చేసుకున్నాడని తెలిసి భార్య కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారికి పుట్టిన నాలుగేళ్ల బిడ్డ అనాథగా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యాభర్తల చావుకు కారణమైన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనాథ అయిన నాలుగేళ్ల కొడుకు, గొల్లు తల్లి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

తన మిత్రుడిని చూసి కన్నీటిపర్యంతమైన తారక్..!

పునీత్ మరణవార్తతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోయింది.అతని మృతదేహాన్ని చూసేందుకు అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. కడసారిగా చూసేందుకు అభిమానులు బారులు తీరుతున్నారు.తమ అభిమాన నటుడు ఇక లేరు అనే వార్త వినగానే గుండెపోటుతో పునీత్ అభిమాని ఒకరు కన్నుమూశారు.

మరి కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. కంఠీరవ స్టూడియోలో రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.పునీత్‌ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

టాలీవుడ్ నుండి నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నిర్మాత సాయి కొర్రపాటి, ప్రభుదేవా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సీనియర్ నరేష్, శివ బాలాజీ బెంగుళూరు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.తండ్రి రాజ్ కుమార్ ఉన్నప్పటి నుండి ఆ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది.

పునీత్ పార్థివ దేహాన్ని చూసి బాలయ్య భోరున విలపించారు.పునీత్ అన్న శివ కు ధైర్యం చెప్పారు. ఎప్పుడూ హుందాగా, గంభీరంగా కనబడే బాలయ్య భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శివన్నకు ధైర్యం చెప్పారు. తారక్ పునీత్ మధ్య మంచి స్నేహబంధం ఉంది.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు.. నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంతమందికి మంచి ఉద్యోగం.. లక్షల్లో సంపాదన ఉన్నా సరిపోదు. ఇంకా ఏదో చేయాలి.. ఇంకా సంపాదించాలి అనే కోరిక, ఆశలు ఉంటాయి. ఇలా ఆశపడి నిరాశలో కుంగిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అతడు సాప్ట్ వేర్ ఉద్యోగిగా మంచి జీతంతో పనిచేస్తున్నాడు. పార్ట్ టైంలాగనే స్టాక్ మార్కెట్లో అతడు ఇన్ వెస్ట్ చేసి.. డబ్బులను సంపాదిస్తున్నాడు. రెండు చేతులా అతడు మూడు పువ్వులు.. ఆరు కాయలు లాగా అతడి జీవితం సాగిపోతుంది.

ప్రస్తుతం అతడు కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే పని చేస్తున్నాడు. అటు ఆ వ్యవహారం చూసుకుంటూ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో చిత్తూరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన భరత్‌ (23) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గా చేస్తున్నాడు.

కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఆ సాప్ట్ వేర్.. తనను తాను ఆదుకోవడానికి ఆశతో ఇటీవల స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. మొదట కొద్దో గొప్పో లాభాలు బాగానే వచ్చాయి. కానీ ఓ రోజు దురదృష్టం అతన్ని వెక్కిరించింది. స్టాక్ మార్కెట్లో దాదాపు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి.. ఆశగా రిటర్న్స్ కోసం ఎదురు చేశాడు. కానీ అతడికి అదృష్టం వరించలేదు.

పెట్టుబడి పెట్టిన డబ్బులు అన్నీ పోయాయి. దీంతో అతడు చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్లాడు. కేఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. పోస్టు మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని పోలీసులు వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు.

ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు.. తాను చెల్లి వరుస అవుతానంటూ ఆమె నిరాకరించింది.. దీంతో

కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఇటు విద్యిర్థినీ విద్యార్థులు చాలామందికి స్నేహితులుగా మారుతారు. కొంతమందికి ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లే జంటలు చాలా తక్కువగా ఉంటుంది. ధైర్యం చేసి ఇంట్లో చెప్పకపోవడం, టైం పాస్ గా లవ్ చేసి ఎవరి దారి వాళ్లు చూసుకోవడం.. ప్రేమ అంటే ఎంటో అర్థం తెలియకుండా.. ఎట్రాక్షన్ ను ప్రేమ అనే భ్రమలో ఉండటం లాంటి కారణాలతో పెళ్లి అనే కార్యం వరకు కొన్ని జంటలు వెళ్లవు.

అయితే మరికొన్ని జంటలు నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. కులాలు వేరు కావడంతో ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకునే జంటలో కూడా ఇరు కులాలు ఒక్కటే.. దీంతో ఆయువకుడు ఆమె ప్రేమ కోసం తహతహలాడుతూ ఓ రోజు ప్రపోజ్ చేశారు. ఇద్దరు ఒకటే కాలేజీలో చదువుతున్నారు.

కానీ ఆమె అతడికి ఒక షాకింగ్ నిజం చెప్పింది. తాను నీకు చెల్లి వరుస అవుతానని. దీంతో ఆ యువకుడికి నోటి నుంచి మాట రాలేదు. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ప్రేమను ఆ యువతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తర్వాత 5 రోజులకు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటు చేసుకుంది.

సంతులాల్‌పోడు తండా చెందిన వంశీ.. మహబూబాబాద్‌లో ఇంటర్‌ చదువుతూ ఉన్నాడు. కాలేజీలో గంధంపల్లి–కొత్తపేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ప్రేమిస్తున్నానని చెప్పడంతో చెల్లి వరుస అవుతాను అంటూ ఆమె చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.