Tag Archives: Tammareddy Bharadwaj

Kalyan Dileep: పవన్ పై సెటైర్లు వేసిన తమ్మారెడ్డి… దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జనసేన నేత కళ్యాణ్ దిలీప్!

Kalyan Dileep: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గురించి తాజాగా నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఒక్కో సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే నీకు పిల్లల ఫీజు కట్టడం పెద్ద కష్టం కాదు.ఇంకోసారి పిల్లల ఫీజు కోసం దాచిన డబ్బులు పెట్టి పార్టీ బిల్డింగ్ కట్టానని దేశాన్ని ఉద్దరించడానికి చేసినట్లు చెబుతున్నావు అంటూ మండిపడ్డారు.

ఇక నీ రాజకీయ స్వార్థం కోసం మీ తండ్రిని కూడా అల్లరి చేస్తున్నావ్ ఆయన పెద్దమనిషి అలాంటి ఆయన దేవుడు దీపంతో సిగరెట్ కాల్చేవారని చెబుతున్నావు అంటూ పవన్ కళ్యాణ్ పై తమ్మారెడ్డి మండిపడ్డారు. ఇలా తమ్మారెడ్డి పవన్ కళ్యాణ్ తో చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత కళ్యాణ్ దిలీప్ స్పందించారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యలపై దిలీప్ సుంకర సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఏమైనా గొప్ప సినిమాలు చేశారా.. ఎంతమంది హీరోలకు మీరు రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారు. చిరంజీవి గారికి మీరు ఎంత రెమ్యూనరేషన్ ఎగ్గొట్టారో చెప్పనా?కేవలం సినిమాలో తీయడం నీకు మాత్రమే వచ్చు అన్నట్టు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఏవేవో మాట్లాడుతుంటావు అని ఈయన మండిపడ్డారు.

Kalyan Dileep: పార్టీని నడిపించాలంటే 500 కోట్లు ఉన్న సరిపోదు..

పవన్ కళ్యాణ్ 2014 ముందు వరకు ఎన్ని సినిమాలు చేశారు నీకు తెలుసా అప్పుడు తన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఇక్కడ ఒక పార్టీని నడిపించాలంటే 500 కోట్ల రూపాయలు డబ్బు ఉన్నా కూడా సరిపోదు.. అన్ని నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటూ తమ్మారెడ్డి పై దిలీప్ సుంకర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Tammareddy Bharadwaj: హీరోలు కథలో వేలు పెట్టడం మానేయాలి.. విశ్వక్ తీరుపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Tammareddy Bharadwaj: గత రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీలో విశ్వక్ సేన్, యాక్షన్ హీరో అర్జున్ మద్యం వివాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తెను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేస్తూ విశ్వక్ హీరోగా సినిమా చేయాలని భావించారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా ప్రారంభమై చివరికి సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకున్న సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ విషయం వివాదంగా మారింది.

ఈ క్రమంలోనే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ డెడికేషన్ లేని హీరో అంటూ కామెంట్ చేయగా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు తనకు డేడికేషన్ లేదని చెప్పిన తాను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను అంటూ అర్జున్ మాటలకు విశ్వ కౌంటర్ ఇచ్చారు.ఇకపోతే ఈ వివాదం పై తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ విషయంపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ విషయంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ అర్జున్ సినిమా విషయంలో విశ్వక్ వ్యవహరించిన తీరు దర్శక నిర్మాతలకు అవమానకరం అంటూ ఈయన వ్యాఖ్యానించారు. ఒక హీరో సినిమా అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత తప్పకుండా ఆ సినిమాలో నటించాల్సిందే తనకు నచ్చకపోతే ముందుగానే తనకు నచ్చలేదని చెప్పాలి కానీ కమిట్ అయిన తర్వాత సినిమా నచ్చలేదు పాటలు నచ్చలేదంటే కుదరదు. ఇలాంటి విషయాలన్నీ అగ్రిమెంట్ కుదుర్చుకు ముందే మాట్లాడుకోవాలని తెలిపారు.

Tammareddy Bharadwaj: హీరోల యాటిట్యూడ్ వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి..

ఇకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోలు చూపిస్తున్నటువంటి ఆటిట్యూడ్ కారణంగానే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఈయన తెలిపారు. ముఖ్యంగా యంగ్ హీరోలు సినిమా కథల విషయంలో జోక్యం చేసుకోవడం మానేయాలి.ఇలా హీరోలు కథ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని గతంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు సైతం ఒకసారి కథ ఫైనల్ అయిన తర్వాత డైరెక్టర్లు ఏది చెబితే అది చేసేవారు కానీ ప్రస్తుత హీరోలు అలా లేరంటూ ఈయన మండిపడ్డారు.

Tammareddy Bharadwaj: బాలయ్య సినిమాలు అమెరికాలో ఆడేవి కాదు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ !

Tammareddy Bharadwaj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ కేవలం నటుడుగా మాత్రమే కాకుండా తనలో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇలా నటుడిగా వ్యాఖ్యాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా బాలకృష్ణ సినిమాల గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఈయన సినిమాలు మంచి కలెక్షన్లను రాబడతాయి. అయితే ఒకానొక సమయంలో అమెరికాలో బాలకృష్ణ సినిమాలు పెద్దగా కలెక్షన్లను రాబట్టేవి కాదు. ఇక కొన్ని సినిమాలు అయితే అసలు అమెరికాలో విడుదల కూడా చేయలేదు.

ప్రస్తుతం బాలయ్య సినిమా అయినా టాక్ షో అయినా అమెరికాలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయని తమ్మారెడ్డి వెల్లడించారు.అఖండ సినిమా అమెరికాలో ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే బాలకృష్ణకు అమెరికాలో ఈ విధమైనటువంటి ఆదరణ అఖండ సినిమా ద్వారా వచ్చిందా లేకపోతే అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా వచ్చిందా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈయన సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు.

Tammareddy Bharadwaj: రికార్డులు సృష్టించిన అఖండ…

అఖండ సినిమా విడుదలైన తర్వాత 22 సంవత్సరాల క్రితం బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని కూడా రీ రిలీజ్ చేయడంతో అమెరికాలో మంచి కలెక్షన్లు రాబట్టాయి. దీన్నిబట్టి చూస్తుంటే అఖండ సినిమా తరువాత అమెరికాలో బాలయ్య సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందని వెల్లడించారు. ఇక అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా కూడా బాలకృష్ణ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక అమెరికాలో అయితే ఈ కార్యక్రమాన్ని చూడటం కోసం ఏకంగా స్పెషల్ బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Tammareddy Bharadwaj: రాముడి గెటప్ మార్చేయడం విచిత్రంగా ఉంది.. ఆది పురుష్ టీజర్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Tammareddy Bharadwaj: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆది పురుష్ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఈ సినిమా గ్రాఫిక్స్ ఏమాత్రం బాగాలేవని ఈ టీజర్ కన్నా కార్టూన్ ఛానల్ ఏంతో అద్భుతంగా ఉందంటూ చాలామంది ఈ సినిమా టీజర్ పై విమర్శలు చేశారు.

ప్రభాస్ అభిమానులు సైతం ఈ టీజర్ చూసి ఇందులో ప్రభాస్ గెటప్ చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అయితే కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ టీజర్ పై స్పందిస్తూ విమర్శలు చేయడం మరికొందరు మాత్రం కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ లోనే అద్భుతంగా ఉంటాయని ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే బాగుంటాయని తెలిపారు.మరో 20 రోజులలో ఈ సినిమా నుంచి ఇంకొక టీజర్ విడుదల చేస్తామని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూసి సంతోష పడతారు అంటూ తెలియచేశారు .

ఇకపోతే ఈ టీజర్ పై ప్రముఖ నిర్మాత నటుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆది పురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుంది పైగా 500కోట్ల బడ్జెట్ అంటే సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఊహించాను అయితే ఈ సినిమా ఒక యానిమేషన్ సినిమా లాగా ఉందని ఈయన తెలియజేశారు. ఈ సినిమా టీజర్ పై వస్తున్న విమర్శలపై ఇప్పటికే చిత్ర బృందం స్పందించారు.

Tammareddy Bharadwaj: రావణుడు కూడా బ్రాహ్మణుడే..

ఇదివరకే చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు. 3డీ అయినా ఫోర్ డి అయిన యానిమేషన్ కి లైవ్ కి చాలా తేడా ఉంటుంది. రాముడిని దేవుడిలా భావించే ఈ దేశంలో రాముడి గెటప్ మార్చేయడం చాలా విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు ఆయనకు కూడా మన భారతదేశంలో దేవాలయాలు ఉన్నాయి.20 రోజులలో మొత్తం మారుతుందని చిత్ర బృందం చెబుతున్నారు నిజంగానే ఆ మార్పులు చేసి సినిమాని మంచిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు

Tammareddy Bharadwaj: కృష్ణంరాజు గారు అడిగిన ఆపని చేయలేకపోయాను.. నాకు మాట్లాడటానికి కూడా సిగ్గుగా ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ్

Tammareddy Bharadwaj: తెలుగు వెండితెర రారాజుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆదివారం ఈయన మరణించడంతో తెలుగు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే మంగళవారం ఈయన సంస్కరణ సభను నిర్వహించారు.

ఫిల్మినగర్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సంస్కరణ సభలో పాల్గొన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాను నిర్మాతగా కృష్ణంరాజు హీరోగా ఫస్ట్ సినిమా చేశానని అయితే ఈ సినిమాకు మా అన్నయ్య దర్శకుడు అంటూ తమ్మారెడ్డి తెలియచేశారు.

ఈ సినిమాలో మా అన్నయ్య ఏకంగా నాలుగు పాటలు పెడతానన్నారు అయితే నాలుగు పాటలు పెడితే ఎవరు చూస్తారు అంటూ తాను అడ్డుపడ్డానని ఇదే విషయాన్ని కృష్ణంరాజు దగ్గరికి వెళ్లి మా అన్నయ్య నాలుగు పాటలు పెడతానన్నారు అసలు ఎవరు చూస్తారు ఈ పాటలు అని అతనితో చెప్పాను. ఆ స్థానంలో కృష్ణంరాజు కాకుండా వేరే ఏ హీరో ఉన్న లాగిపెట్టి నన్ను కొట్టేవారు. ఆయన మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వి నేను పనికిరానా? అంటూ మా అన్నయ్యని ఒప్పించారు. ఆయన సినిమాకు ఏం కావాలో అంతే చేస్తారని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

Tammareddy Bharadwaj:ఆయన ఇష్టపడిన ఫ్లాట్ ఇవ్వలేకపోయాను…

ఈ సంఘటన తర్వాత దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు ఆయన ఫోన్ ఎత్తాలన్న భయం వేసేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.ఇకపోతే మూడు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు గారు తన వద్దకు వచ్చి మూవీ టవర్స్ లో తనకు ఒక ఫ్లాట్ కావాలని అడిగారు.అయితే తనకు మార్కెట్ రేట్ కావాలని చెప్పగా మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తానని కృష్ణంరాజు గారు చెప్పారు. అయితే ఆయనకు చెప్పినట్టుగా నేను ఆ ఫ్లాట్ ఇవ్వలేకపోయానని ఈ విషయం గురించి మాట్లాడాలన్నా చాలా సిగ్గుగా ఉందంటూ ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Manchu Mohan Babu: నోరారా అరేయ్ అంటూ పిలిచేవారు.. కృష్ణంరాజు సంతాప సభలో మోహన్ బాబు ఎమోషనల్!

Manchu Mohan Babu: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు మరణించడంతో సినీ ప్రపంచం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరు పోర్చలేరు అంటూ పలువురు సినీ ప్రముఖులు కృష్ణంరాజు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు.1966లో చిలుక గోరింక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన తుది శ్వాస వదిలే వరకు సినిమాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు.

ఇలా చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మరణించడంతో మంగళవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, సి కళ్యాణ్, జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన ఆత్మీయులు ఎంతోమంది అనంత లోకాలకు వెళ్లిన ఎప్పుడు సంతాప సభలో పాల్గొనలేదని మొదటిసారి ఈ సభలో పాల్గొనడం జరిగింది అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇక కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం గురించి మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.

Manchu Mohan Babu: మొదటిసారి బెంజ్ కారు ఎక్కించింది ఈయనే..

నన్ను ఇండస్ట్రీలో నోరారా అరేయ్ అంటూ పిలిచే ఏకైక వ్యక్తి కృష్ణంరాజు గారు. అలాగే తనని మొట్టమొదటిసారి బెంజ్ కార్ ఎక్కించినది కూడా ఈయనే అంటూ మోహన్ బాబు కృష్ణంరాజు గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని సకల దేవతలను కోరుకుంటున్నా అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కృష్ణంరాజు సంతాపసభలో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tammareddy Bharadwaj: ఆరోజు దిల్ రాజు ఇంటికి వెళ్లి ఎందుకు అడుక్కున్నావ్..? హీరో నిఖిల్ పై ఫైర్ అయిన తమ్మారెడ్డి

Tammareddy Bharadwaj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా గుర్తింపు పొందిన తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా పై స్పందిస్తూ పెద్ద ఎత్తున హీరో నిఖిల్ పై ఫైర్ అయ్యారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ తన సినిమా విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని థియేటర్లు కూడా దొరక్కుండా చేస్తున్నారంటూ పరోక్షంగా దిల్ రాజు గురించి ఈయన ఆరోపణలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ విషయంపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ నిఖిల్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ హీరో నిఖిల్ సినిమా విడుదలకు థియేటర్స్ దొరకడం లేదని ముసలి కన్నీళ్లు కార్చి సినిమా హిట్ అవ్వగానే దిల్ రాజుని సక్సెస్ మీట్ కి పిలవడం ఆయన మాట్లాడుతూ చేసిందంతా మీడియా అంటూ మీడియాపై మండిపడుతున్న సమయంలో నిఖిల్ మాత్రం వెనకనే ఉండి నవ్వుతున్నారే తప్ప ఆ రోజు నువ్వు నా సినిమాకి అడ్డుపడలేదా అని దిల్ రాజు గారిని ప్రశ్నించలేదు.

నిజంగానే నీ సినిమాకి దిల్ రాజుగారు అడ్డుపడి ఉంటే ఆరోజు ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్ తీసుకొని మీరు నా సినిమాకు అడ్డుపడలేదా అని అడగాల్సింది. సినిమా హిట్ అయితే ఒక విధంగా ఫ్లాప్ అయితే మరొక విధంగా మాట్లాడటం మానుకోవాలి. అయినా దిల్ రాజు గారి ఇంటికి వెళ్లి అడుక్కోవాల్సిన అవసరం నీకేంటి? హీరో హీరో పనులు మాత్రమే చూసుకోవాలి డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమాలో నటించలేదు కదా…మాచర్ల నియోజకవర్గం సినిమాకి పోటీగా వచ్చిన నీవు థాంక్యూ సినిమాకి ఎందుకు పోటీగా రాలేకపోయావు అంత ధైర్యం నీకు లేదా? అంటూ తమ్మారెడ్డి నిఖిల్ పై ఫైర్ అయ్యారు.

Tammareddy Bharadwaj: డబ్బు కోసమే సినిమాలు చేస్తారు…

సినిమా ఫ్లాప్ అయితే ముసలి కన్నీళ్లుకార్చడం హిట్ అయితే కాలర్ ఎగరేయడం వంటివి మానుకోవాలి అయినా నువ్వు హీరోగా డబ్బు తీసుకోకుండా సినిమాలు చేయలేదు కదా డబ్బు కోసమే సినిమాలు చేశావు కానీ దేశాన్ని ఉద్ధరించడం కోసం సినిమాలు చేయలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన నిఖిల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ వ్యాఖ్యలపై నిఖిల్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Karthikeya 2: కార్తికేయ 2 సినిమా హిట్ అవుతుందని దిల్ రాజు భయపడ్డారు.. వైరల్ అవుతున్న తమ్మారెడ్డి కామెంట్స్!

Karthikeya 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కార్తికేయ 2 సినిమా ఇష్యూ గురించి ఈయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విడుదలయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా వాయిదా పడటం వెనుక దిల్ రాజు ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిఖిల్ సైతం పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా నిఖిల్ తాను ఎక్కడ దిల్ రాజు పేరు ఉపయోగించలేదని ఈ సినిమా ఇంత మంచి విజయం అయిందంటే అందుకు దిల్ రాజే కారణం అంటూ ఒక్కసారిగా మాట మార్చారు.

ఇక ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ సాధారణంగా ఒక సినిమా విడుదలవుతుందంటే మరొక సినిమాని వాయిదా వేసుకోమని చెప్పడం ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు కూడా తన సినిమా విడుదలవుతుందని కార్తికేయ2 టీమ్ కి ఫోన్ చేసి సినిమా వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారని ఈయన వెల్లడించారు.ఈ విధంగా దిల్ రాజు వంటి వారి ఈ సినిమా వాయిదా వేసుకోమని ఫోన్ చేశారంటే నిజంగా నిఖిల్ ఎంతో గర్వపడాలని ఈయన వెల్లడించారు.

Karthikeya 2: కార్తికేయ2 విజయాన్ని ముందే ఊహించారా…

దిల్ రాజు గారు కార్తికేయ 2సినిమా హిట్ అవుతుందని ముందే ఊహించారు. అందుకే సినిమాని వాయిదా వేసుకోమని ఫోన్ చేసి ఉంటారని ఈయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా హిట్ కాదని తెలిస్తే వాయిదా వేసుకోమని చెప్పే అవసరం దిల్ రాజుకి ఉండదంటూ తెలిపారు. ఈ విధంగా దిల్ రాజు కార్తికేయ 2 సినిమా విజయవంతం అవుతుందని ముందే ఊహించి ఈ సినిమాకి భయపడి నిఖిల్ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పి ఉంటారంటూ తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!

Tammareddy Bharadwaj: గత కొంత కాలంగా సినిమాకు సంబంధించి టికెట్ల వ్యవహారం అనేది వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. మొన్న సినిమా పరిశ్రమపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఖండించారు.

Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!

పెద్ద సినిమా హీరోలు టికెట్లను వేలల్లో అమ్ముకొని దోపిడీ చేస్తున్నారంటూ అతడు ఆరోపించాడు. దానిని అతడు తోసిపుచ్చుతూ.. ఎవరైనా కష్టపడితేనే డబ్బులు వస్తాయని.. దోచుకుంటే దొంగ అవుతాడు.. కానీ దొర కాడు అంటూ చెప్పాడు.

Tammareddy Bharadwaj: మీ ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా..? ఎవరు ఏం దోచుకుంటున్నారో తేల్చుకుందాం రండి..!

మీ ఎమ్మెల్యేలు ప్రజలను ఎంతో దోచుకుంటున్నారో నిరూపించేందుకు నేను చర్చకు సిద్ధం. మీరు దీనికి సిద్ధమా అంటూ సవాల్ విసిరాడు. ఏపీలో టికెట్ల ధరల తగ్గింపుపై హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తమ్మారెడ్డి మాట్లాడారు.


కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా..

రాజకీయాల్లోకి వచ్చిన ప్రారంభంలో మీరు ఎలక్షన్ కమిషన్ కు చూపించన ఆస్తలు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని అంటూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ను ఉద్దేశించి ప్రశ్నించాడు. సినిమా వెనుకాల ఎంతో మంది కష్టం ఉంటుందని.. కోట్లు పెట్టుబడి పెట్టి.. పైసా పైసా కూడబెట్టుకుంటారన్నారు. కానీ మీలాగా రూపాయి పెట్టుబడి పెట్టి.. రూ. కోట్లు దోచుకోవడం లేదన్నారు. చీప్ గా దొరికామని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు. ఒకరిని విమర్శించే ముందు.. మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ఇప్పటి వరకు లేని కుల, మత రంగును సినిమా రంగానికి ఆపాదించడం సరికాదన్నారు. కుల ప్రస్తావన లేకుండా ప్రతిభ ఆధారంగా అవకాశాలిచ్చే ఒకే ఒక్క రంగం సినీ రంగమేనని పేర్కొన్నారు. ఇక సినిమా టికెట్ల ధరల నియంత్రణ అనే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే ప్రొడక్ట్ కు మాత్రం ధర నిర్ణయించే అధికారం మాకే ఉందన్నారు.అయితే ఆ హక్కును చట్టబద్దంగా సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక అసెంబ్లీని ఎలాగో నాశనం చేశారు.. టీవీలను ఎందుకు నాశనం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.