Tag Archives: telangana government

Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!

Flash News: తెలంగాణ సీఎం దళితులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ప్రతీ ఏటా రెండుమూడు లక్షల మందికి దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. మార్చి తరువాత ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల మందికి దళిత బంధు ఇస్తామని వెల్లడించారు. 

Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!

శరీరంలో ఏ భాగం మంచిగా లేకున్నా.. శరీరం మొత్తం బాగున్నట్లు కాదని.. దళితులు కూడా అభివ్రుద్ది చేసుకుందామని అన్నారు సీఎం కేసీఆర్. దళితబంధు పథకం చూసి  చాలా మందికి కళ్లు మండుతున్నాయని ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రతీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామని అన్నార. 

Flash News: దళితులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. ఏంటంటే..!

దళిత బంధులో రూ. 10 లక్షలు ఇవ్వడమే కాకుండా.. మెడికల్ షాపుల్లో, ఫెర్టిలైజర్ షాపుల్లో, ప్రభుత్వ కాంట్రాక్ట్ లో, బార్, వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామని అన్నారు. ఇలా భారత దేశంలో ఏ రాష్ట్రం ఎక్కడా చేయలేదని అన్నారు. 

మోదీకి కేసీఆర్ వార్నింగ్..

మరోవైపు బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ బోర్ల దగ్గర మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని… నన్ను చంపినా ఆ పని చేయను అని..ఏం చేసుకుంటావో చేసుకో అని మోదీకి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. బీజేపీ వాళ్లు టీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే నశం చేస్తామంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఢిల్లీ కోటలు బద్ధలు కొడతా అంటూ.. వ్యాఖ్యానించారు.

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

Telangana Jobs: తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఖాళీల జాబితా కేబినేట్ ముందుకు రానుంది. అన్ని కుదిరితే ఈ నెలాఖరులోగా నిరుద్యోగులకు తీపి కబురు అందనుంది. ఉద్యోగాల భర్తీపై రాష్ర్టంలోని నిరుద్యోగులు దాదాపుగా నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారి ప్రిపరేషన్ కూడా ప్రారంభించారు.

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

సుమారు 60వేల ఖాళీలను గుర్తించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడింది. నిధులు, నీటిపారుదల ప్రాజెక్టుల సంగతి ఎలా ఉన్నా.. నియామకాల విషయంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటి వరకు గ్రూప్-1, 3 నోటిఫికేషన్లే రాలేదు. మరోవైపు గ్రూపు-2 పోస్టులను ఒక్కసారే భర్తీ చేసింది.

Telangana Jobs: తెలంగాణలో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు..! మొదలైన కొలువుల జాతర!

రమారమీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 1.30లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. వీటిల్లో ఎక్కువగా పోలీస్, విద్యుత్తు, టీఎస్పీఎస్పీ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల్లోనే ఖాళీలను భర్తీచేసింది. ఉపాధ్యాయుల ఖాళీలకు సంబంధించి టీఆర్టీ నోటిఫికేషన్ సుమారు 9వేల పోస్టులతో 2016లో వచ్చింది. నాటినుంచి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయలేదు. దీనికోసం పెద్ద సంఖ్యలో బీఈడీ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఇది భవిష్యత్తులో తెరాస ప్రభుత్వానికి రాజకీయంగా..

దీనికి సంబంధించి టెట్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం సర్కారు జారీ చేయనున్న ఉద్యోగ ప్రకటనల్లో ఎక్కువ సంఖ్యలో పోలీస్, విద్యా, ఆరోగ్య రంగాలకు చెందిన శాఖల్లోనే ఎక్కువ భర్తీ చేసే అవకాశముంది. ఇప్పటికి భర్తీ చేసిన ఖాళీల్లో పోలీసు ఉద్యోగాలే అధికంగా ఉండటం విశేషం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నియామకాలపై సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దుబ్బాక ఉపఎన్నిక నుంచి ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల సమయాల్లో తెరాస అగ్రనాయకత్వం ఉద్యోగ ఖాళీల భర్తీపై హామీలు ఇస్తూ వచ్చింది. అయినా నేటికీ నియామక ప్రకటన రాలేదు. ఇది నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఇది భవిష్యత్తులో తెరాస ప్రభుత్వానికి రాజకీయంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా, మల్టీ, బహుళ జోన్లు ఖరారు చేస్తూ రాష్ర్టపతి ఉత్తర్వులు వచ్చాయి. ఆయా జోన్లకు సంబంధించిన ఖాళీల వివరాలు సీఎంవో కార్యదర్శి శేషాద్రి వద్ద ఉంది. దీనికి ఆయన కేబినేట్ కు సమర్పించనున్నారు. ఈ పరిణామాలన్నీ సజావుగా జరిగితే ఈ నెలాఖరులో నిరుద్యోగులకు శుభవార్త అందనుంది.

Telangana Government: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..ఇక అన్ని పాఠశాలల్లో అది తప్పని సరి..!

Telangana Government: తెలంగాణ సర్కార్ విద్యా వ్యవస్థకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని ప్రతీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండనున్నట్లు పేర్కొంది. దీంతో అన్నీ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు.

Telangana Government: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..ఇక అన్ని పాఠశాలల్లో అది తప్పని సరి..!

2022-23 నుంచే ఈ విధానం అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. దీనిని అధికారికంగా సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే మీటింగ్‌లో మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు.

Telangana Government: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..ఇక అన్ని పాఠశాలల్లో అది తప్పని సరి..!

అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాల కల్పనకు నిధులను కూడా విడుదల చేశారు. అందులో భాగంగానే రూ.7వేల 289కోట్లు వెచ్చించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమోదం తెలిపింది కేబినెట్. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా.. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.


ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు..

అంతే కాకుండా.. ప్రైవేట్ పాఠశాల, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీల ఫీజులను సైతం రెగ్యూలర్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని కేబినెట్ డిసైడ్ కాగా.. ఫీజుల నియంత్రణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన పలువురు మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. దీనిలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సభ్యులుగా ఉంటారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఆ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాలేజీ యజమాన్యం నడుచుకోవాలని సూచించారు.

Telangana: వారికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కారు..! ఆ బదిలీలు చేపట్టవద్దని ఆదేశం.. !

Telangana: తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. జోనల్‌ బదలాయింపుల దృష్ట్యా సాధారణ బదిలీలు చేపట్టవద్దని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కేటాయింపులు, బదలాయింపులు అనేవి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేపట్టింది.

Telangana: వారికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కారు..! ఆ బదిలీలు చేపట్టవద్దని ఆదేశం.. !

దీనిలో భాగంగానే పరస్పర బదిలీలు పరిశీలనలోకి తీసుకుంది. ఇది కనుక అనుమతిస్తే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు , కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన వర్చువల్ సమీక్షలో దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చిటట్లు సమాచారం.

Telangana: వారికి షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కారు..! ఆ బదిలీలు చేపట్టవద్దని ఆదేశం.. !

2018 సంవత్సరంలో చివరిసారిగా తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ప్రతీ సంవత్సరం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని.. సాధారణ బదిలీలు చేపట్టాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం ఏ సంవత్సరం కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం జరగుతాయని అశించినా ఫలితం లేదు.


దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి..

కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా బదలాయింపులు జరగడంతో.. నెల రోజుల వ్యవధిలోనే 70 వేల మందికి బదిలీలు జరిగాయి. దీనిలో కూడా భార్య భర్తలకు సంబంధించి బదిలీల సమస్యలు ఉంది. వీటిపై ప్రభుత్వానికి ఎన్నో వినతులు వచ్చాయి. ఈ అంశాలను కూడా పరిష్కరించాల్సి ఉంది. అంతే కాదు బదిలీలు అయిన వారిలో కూడా సీనియార్టీని ఖరారు చేయాలి.. ఈ సమస్యలు అనేది జిల్లా స్థాయిలో లేకున్నా.. జోనల్, మల్టీ జోనల్ స్థాయిలోని పోస్టుల్లోకి బదిలీ అయిన వారికి.. భార్యాభర్తలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. వారిని ఒకవేళ ఒకే చోటు నియమిస్తే మాత్రం.. అప్పటికే అక్కడ ఉన్నవారిని సీనియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

CM KCR-Farmers: తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ముందుకు సాగుతోంది. రైతుబీమాతో ఒకవేళ రైతు మరణిస్తే అతడి కుటుంబసభ్యుల్లోని నామినీకి రూ.5లక్షలు ఇవ్వనున్నారు. దీనికి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దానికి సంబంధించిన ప్రీమియాన్ని చెల్లిస్తుంది.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

ఇక రైతు బంధు విషయానికి వస్తే భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కింద సాయం చేస్తోంది.
ఎకరం పొలం ఉన్న రైతులకు రెండు దఫాలకు ఐదు వేల చొప్పున రూ.10 వేలు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తాజాగా మరో శుభవార్తను అందించింది కేసీఆర్ ప్రభుత్వం.

CM KCR-Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త..! నెలకు రూ.2016 పింఛన్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆదేశం..!

రైతులకు పింఛన్‌‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌‌లో ఈ స్కీమ్ ప్రకటించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌ మొదలు పెట్టింది. దీనికి సంబంధించి పథకాన్ని సీఎం కేసీఆర్ కొండపోచమ్మసాగర్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు గుడ్‌‌ న్యూస్‌‌ చెప్తానని వెల్లడించారు.

పలు కారణాలతో ఆ హామీ అలాగే మిగిలిపోయిందని.. రైతుబంధు, రైతుబీమాలకు తోడుగా అన్నదాతల కోసం ఈ స్కీం తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రభుత్వవర్గాలు పలు సందర్భాల్లో వెల్లడించాయి.
రైతులకు నెలకు రూ.2016 ఫిచన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు పింఛన్‌‌ విధివిధానాలు ఖరారు చేసే పనిలో ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిమగ్నమైంది.


చిన్న, సన్న కారు రైతులకు..

చిన్న, సన్న కారు రైతులకు రూ.2016 పింఛన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారని.. రైతుకు 47 ఏల్లు నిండాలని పేర్కొన్నారు. 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్ ఇప్తున్న ప్రభుత్వం.. ఆ కార్మికుల కంటే వయోపరిమితి రెండేళ్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 47 ఏళ్లు వయస్సు పరిమితి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట ఎందుకంటే.. రాష్ట్రంలో రైతుబంధు పొందుతున్న రైతులు 67 లక్షల పైచిలుకు ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది ఉన్నారు..? 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఫైనల్ గా 47 ఏళ్లు నిండి ప్రతీ రైతుకు పింఛన్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మూడెకరాల నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్‌‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం.. బడ్జెట్ లో ప్రవేశపెట్టేందుకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.

‘పుష్ప’ సినిమాకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

రేపు అనగా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా విడుదలకాబోతోంది. దాదాపు ఈ సినిమా ఏడు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సబంధించి రివ్యూలు అన్నీ పాజిటివ్ గా వచ్చాయి. ఎంతో మంది అల్లు అర్జున్ అభిమానలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు కొన్ని గంటల దూరంలోనే ఉంది.

డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం. మొదట ఆర్య, ఆర్య2 తర్వాత మళ్లీ పుష్పతో జతకట్టారు. అందుకే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మొదట ఒక్క పార్ట్ గా తీయాలనుకున్నా ఈసినిమా నిడివి అత్యధికంగా ఉండటంతో రెండు పార్ట్ లుగా తీయడానికి సిద్ధం అయ్యారు. అందులో మొదటి పార్ట్ పుష్ప.. ది రైజ్ తో రేపు అభిమానుల ముందుకు వస్తున్నాడు బన్నీ.

ఈ నేపథ్యంలో పుష్ప మూవీ టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా కోసం 5వ షో ప్రదర్శనకు అనుమతిని ఇచ్చింది. అది కూడా రేపటి నుంచి డిసెంబర్ 30 వ తేదీ వరకు రోజు కు థియేటర్లలో 5 షోలు వేసుకోవచ్చని తెలిపింది. టికెట్ల పెంపుపై కూడా సినిమా వాళ్లకే వదిలేసింది ప్రభుత్వం. దీంతో ఈ మూవీ మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ వసూళ్లు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

ఇక ఈ సినిమాలో మంగళం శ్రీనుగా ‘సునీల్’ అదిరిపోయే పర్మామెన్స్ ఇచ్చినట్లు సమాచారం. రష్మికా తనదైన శైలిలో నటించినట్లు టాక్. ఇక మొదటిసారిగా సమంత ఐటెం సాంగ్ లో కనిపించబోతోంది. ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ అంటూ కుర్రకారు గుండెళ్లొ రైళ్లు పరుగెత్తించేందుకు సిద్ధం అయింది. సినిమా మొత్తం ఓ ఎత్తు అయితే.. ఈ సాంగ్ మరో ఎత్తు అని సినీ బృంద సభ్యులు ఎన్నో సార్లు చెప్పారు కూడా.

రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు జమ అయ్యేందుకు కేవలం ఐదు రోజులే..

వివిధ దశల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ 2018 వానాకాలం సీజన్‌ నుంచి ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌లోనూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఇందుకు సంబంధించిన నగదును ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల అకౌంట్లలో జమ కానుంది. అంటే ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలిఉంది.

ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జూన్‌‌‌‌‌‌‌‌ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం కింద రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కూడా పెరగనుంది.

ఏమైనా సమస్యలు ఉంటే.. స్థానిక వ్యవసాయాధికారిని సంప్రదించాలని అధికారులు కోరారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా పంపిణీ చేశారు. ఈ సారి కూడా ఇదే పద్ధతిని ఫాలో కానున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. గురుకుల పాఠశాలల ఓపెన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ సర్కారు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విద్యాసంస్థలు మొత్తం మూసేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, కరోనా పాజిటివ్ కేసులు కూడా తగ్గడంతో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వ హాస్టల్స్ కు విద్యార్థులు వస్తే.. గుంపులు గుంపులుగా ఉండటంతో మళ్లీ కరోనా సోకే అవకాశం ఉంటుందని.. గురుకులాల్లో ప్రత్యక్ష తరగతులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత చాలా రోజుల తర్వాత ఇంటర్ పరీక్షల నేపథ్యంలో గురుకుల పాఠశాలలను తెరవాలని.. దానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఈ రోజు గురుకుల పాఠశాలలను తెరుచుకోవచ్చని హైకోర్టు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సవరించింది. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు అంటే.. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను తెరుచుకోవచ్చునని న్యాయస్థానం పేర్కొంది.

ఇదిలా ఉండగా గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్ లైన్ తరగతులకు బోధనా తరగతులను చేపట్టాలని కూడా స్ఫష్టం చేసింది. ఇక విద్యా సంస్థలో కరోనా వ్యాప్తి పెరకుండా ఉండటం కోసం తగిన జాగ్రత్తులు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ సర్కారుతో చేతులు కలిపిన విజయ్ దేవరకొండ..!!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది.. ప్రతిరోజూ.. లక్షలాదిగా కేసులు, వేలాదిగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. అదేవిధంగా.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. తాజాగా.. టాలీవుడ్‌ నటుడు విజయ్ దేవరకొండ కూడా ప్రభుత్వ ప్రచారంలో భాగమయ్యారు.ఈ మేరకు ఆయన ఓ వీడియోను రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

‘కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చాలా ఇబ్బంది పెడుతోంది. గతేడాదిలో మనం ఎంతో కష్టపడ్డాం. ఇక, అందులోంచి బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. నిత్యం లక్షలాది మంది వైరస్ కు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కానీ.. జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు”అని తెలిపారు విజయ్‌.’మనలో కరోనా లక్షణాలు కనిపించగానే చికిత్సకు సిద్ధమవ్వాలి.

మీకు జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయంటే.. ఖచ్చితంగా కరోనా అయి ఉంటుందని భావించాలి. వెంటనే.. డాక్టరు వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఏ లక్షణాలు కనిపించినా.. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకోండి.’ అని సూచించారు.కరోనా వచ్చిన వారికి అన్నింటికన్నా టైం ప్రధానమైంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డాక్టర్లను అందుబాటులో పెట్టింది.

మీరు వాళ్లతో మాట్లాడండి. మీరు ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లినా.. కిట్ రూపంలో మందులు ఇస్తారు. వాటిని వేసుకుంటే సరిపోతుంది. భయపడకండి. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అంటూ చెప్పారు విజయ్ దేవరకొండ..ఇక విజయ్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు..ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది…!!

మహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఆ వాహనాల పంపిణీ..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. కేసీఆర్ సర్కార్ మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళల కొరకు కేంద్రం కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది.

ఈ పథకం ద్వారా తెలంగాణ సర్కార్ మహిళలకు చేపలు, చేపల వంటల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను పంపిణీ చేయనుంది. ఇప్పటికే గ్రామాలలో నివశిస్తున్న మత్స్యకారులకు టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను సబ్సిడీ కింద అందిస్తున్న తెలంగాణ సర్కార్ మరో కొత్త స్కీమ్ అమలు దిశగా అడుగులు వేయడం గమనార్హం. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోలోని ఒక్కో డివిజన్ కు ఒకటి చొప్పున 150 డివిజన్లకు 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందిస్తోంది.

సంచార చేపల విక్రయ వాహనం ఖరీదు 10 లక్షల రూపాయలు కాగా ఏకంగా 60 శాతం సబ్సిడీతో మహిళలు ఈ వాహనాలను పొందే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కొరకు దేశంలో ఎక్కడా లేని విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ స్కీమ్ ద్వారా తాజా చేపలు, చేపల వంటకాలను వినియోగదారుల దగ్గరకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ స్కీమ్ అమలు ద్వారా కష్టపడి పని చేసే మహిళలకు ప్రయోజనం చేకూర్చే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడాలని.. మహిళలు లబ్ధి పొందాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.