నిమ్మరసంలో ఎంతటి అద్భుత ఔషధ గుణాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. విటమిన్ సితోపాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మర‌సం వల్ల మనకు లభిస్తాయి. నిమ్మ‌ర‌సాన్ని మ‌నం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. రుచికి మాత్రం పుల్లగా ఉన్నా ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదండోయ్. కొందరు సౌందర్య సాధనంగా కూడా నిమ్మరసాన్ని వాడుతారు. అయితే నిత్యం ఒక నిమ్మకాయ నుంచి పూర్తిగా రసాన్ని తీసి దాన్ని ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే దాంతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం చాలా మంది ఉద‌యాన్నే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగి రోజు మొద‌లు పెడ‌తారు. దీంతో నిద్ర మ‌త్తు వ‌దిలి యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చ‌ని వారి భావ‌న‌. అయితే ఆరోగ్య‌ప‌రంగా చెప్పాలంటే ఉద‌యాన్నే ఈ డ్రింక్స్‌ను తాగడం అంత మంచిది కాదు. వీటితో జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలా కాకుండా ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు క‌లుగుతాయి. యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది సహజంగా యాసిడ్ గుణాన్ని కలిగి ఉన్నా శరీరంలోకి వెళ్లగానే ఆల్కలైజింగ్ ఏజెంట్‌గా మారుతుంది. కనుక నిమ్మ రసాన్ని ఎవరైనా నిర్భయంగా సేవించవచ్చు. దాంతో శరీర ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. రోగ నిరోధక శక్తిని నిమ్మ రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు పలు బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనకు రక్షణను ఇస్తుంది. ప్రధానంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి తగ్గిపోతాయి.

బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేయాలి ? ప్రెగ్నెన్సీ సమయంలో సెన్సిటివ్ బ్రెస్ట్ సమస్యను డీల్ చేయడం ఎలా? పామాయిల్ ను ఎవరు వాడవచ్చు &దానికి ఎవరు దూరంగా ఉండాలి వృద్ధాప్య ఛాయలు వయస్సు మీద పడుతుండడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఆ లక్షణాలను దూరం చేసే యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది. నిమ్మరసంలో పాస్ఫరస్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. విష పదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. తద్వారా కలిగే ఇతర అనారోగ్య లక్షణాలు కూడా దూరమవుతాయి. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి. ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగితే శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. క్యాన్సర్ కణాలు నాశనం పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ కణాల వృద్ధి ఆగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.

శరీరం ఐరన్‌ను గ్రహించేందుకు నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి తోడ్పడుతుంది. దీంతో రక్తహీనత వంటి జబ్బులు తగ్గుతాయి. మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. నిమ్మరసం తాగాల్సిందే ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం పోతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు మాయమవుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోతాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నిమ్మరసం తాగాల్సిందే. దీంతోపాటు కిడ్నీల్లో ఉండే రాళ్లు కూడా కరిగిపోతాయి. కిడ్నీల్లో క్యాల్షియం గడ్డకట్టదు. తద్వారా రాళ్లు ఏర్పడేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే శ‌రీరంలో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు రావు. తిన్న ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రావు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటివి త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. కొవ్వు క‌రిగిపోతుంది శ‌రీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. అధికంగా ఉన్న బ‌రువు త‌గ్గుతారు. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. వికారం తగ్గుతుంది ఇక నిమ్మ ద్వారా ఆరోగ్యానికి, అందానికి సంబంధించిన కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తాగితే వికారం తగ్గుతుంది. అధిక బరువుతో బాదపడేవాళ్లు పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది. ముఖం నిగనిగలాడుతుంది నిమ్మరసం తాగినా… నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా… చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు. తలస్నానం చేసే ముందు నిమ్మరసం కలిపిన నీటితో స్నానం చేస్తే కురులు నల్లగా మెరుస్తాయి. ముల్తానా మట్టిలో నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది. నిమ్మరసానికి జిడ్డు తొలగించే స్వభావం ఎక్కువ కాబట్టి నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖంమీద జిడ్డు తొలగి ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. మృతకణాలన్నీ తొలగిపోతాయి ఎండబెట్టిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మం మీది మృతకణాలన్నీ తొలగిపోతాయి. నిమ్మరసాన్ని పెరుగులో కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛాయ పెరుగుతుంది. కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here