ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లోనే గడుపుతున్నారు. ఎప్పుడైతే మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పటి నుంచి బంధాలు అను బంధాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోనే ప్రపంచంగా మారింది జనాలకు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరికీ స్మార్ట్ ఫోన్ పిచ్చి ఎక్కువైంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పిచ్చి లో పడి చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయినప్పటికీ చాలా మంది అదే తప్పులను చేస్తూనే ఉన్నారు.
ఇలా ఫోనే ప్రపంచం గా బతుకుతూ కొంతమంది ఇంటా బయట, ట్రాఫిక్ లో, అలాగే కొన్ని భయంకరమైన విదేశాలలో కూడా స్మార్ట్ ఫోన్ లను చూస్తూ లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామందికి సెల్ ఫోన్ ప్రపంచంగా మారడంతో రోజంతా గేమ్స్ ఆడుతూ గడిపే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది బాత్ రూమ్ లో కూడా సెల్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. బాత్ రూమ్ కు సెల్ ఫోన్ ను తీసుకెళితే ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం ఉంటున్నారు.
ఆఖరికి బాత్రూంలోకి కూడా సెల్ ఫోన్ ని తీసుకొని వెళుతున్నారు అంటే ప్రజలు మొబైల్ ఫోన్ లకు ఎంత ఎడిక్ట్ అయ్యారో మీరే అర్థం చేసుకోవచ్చు.అయితే ఇలా బాత్ రూమ్ లో సెల్ ఫోన్ ను వినియోగించడం వల్ల ప్రమాదకర బ్యాక్టీరియా ఇంట్లోకి చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ తో బాత్ రూమ్ లో ఎక్కువ సమయం గడిపేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తేలింది. పెద్దవాళ్లతో పాటు ఈ బ్యాక్టీరియా వల్ల పిల్లలు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
బాత్ రూమ్ లో ఎక్కువ సమయం ఉండటం వల్ల కొంతమందిని పైల్స్ సమస్య వేధిస్తోందని శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.బాత్ రూమ్ లో ఎక్కువ సమయం ఉండటం వల్ల జీర్ణాశయ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే ఆ సమస్యలతో బాధ పడేవాళ్లకు ఆ సమస్యలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయం గడపటం వల్ల సమయం వృథా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…