Tamannah: వెండితెర మిల్క్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్న ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె రొమాంటిక్ సన్నివేశాలలో నటించే సమయంలో హీరోలు ప్రవర్తించే విధానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా హీరో హీరోయిన్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అయితే అలాంటి సీన్లలో నటించాలి అంటే నటీనటులు ఎంతో ఇబ్బంది పడతారు.అయితే కొంతమంది హీరోలు మాత్రం ఇలాంటి రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు వారు ప్రవర్తించే విధానం గురించి నటి తమన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ అంతమంది చూస్తూ ఉండగా రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం అంటే సాహసమే అని చెప్పాలి. ముఖ్యంగా హీరోలు ఇలాంటి రొమాంటిక్ సన్ని వేషాలలో నటించేటప్పుడు చాలా ఇబ్బంది పడతారని తెలిపారు. ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు హీరోయిన్స్ ఏమనుకుంటారో అనే కంగారు వారిలో ఉంటుంది.

Tamannah: ఇలాంటి సీన్లలో నటించాలంటే సాహసమే…
ఇక కొంతమంది హీరోలు అయితే ఇలాంటి సీన్లలో నటించడానికి ఏమాత్రం ఇష్టం చూపరు. ఇక మరికొందరైతే ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి చాలా సమయం తీసుకుంటారంటూ ఈ సందర్భంగా తమన్నా రొమాంటిక్ సీన్లలో నటించే ముందు హీరోలు ప్రవర్తించే విధానం గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా మారిపోయారు.





























